సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికే మూడు కీలక శాఖలను నిర్వహిస్తున్న సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రాకు ప్రభుత్వం మరో బాధ్యతను అప్పగించింది. ఢిల్లీలోని తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్‌ఏసీ)ను ఇస్తూ ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అజయ్ మిశ్రా ఇప్పటికే జీఏడీ(పొలిటికల్), హోం, రోడ్లు, భవనాల శాఖల ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక పౌర సరఫరాల సంస్థ ఎండీగా ఉన్న వి.అనిల్‌కుమార్‌కు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి బాధ్యతలను కూడా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు ఇంకా కాకపోవడంతో.. అధికారులకు అదనపు బాధ్యతలు కేటాయించక తప్పడం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.