తెలంగాణ ఫండ్‌కి స్టార్ క్రికెట్
తెర మీద సందడి చే సే న టీనటులు ఇప్పుడు క్రీడా మైదానంలో అభిమానులను అలరించనున్నారు. తెలంగాణ ముఖ్య మంత్రి సహాయనిధి కోసం తెలంగాణ స్టార్స్, చెన్నై హీరోస్ జట్ల మధ్య ఆగస్టు 9న క్రికెట్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మధ్యా హ్నం రెండు గంటలకు ఆట మొదలవుతుంది. తెలంగాణ సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తోంది. ‘‘తెలుగు ఇండస్ట్రీలోని హీరోలందరూ కలిసికట్టుగా ఆడనున్నారు. గెలిచిన జట్టుకు ‘కాకతీయ కప్’ ఇస్తాం’’ అని హీరో జై ఆకాశ్ చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ సినీ ఆర్టిస్ట్స్ సంఘ గౌరవాధ్యక్షుడు నాగరాజు, అధ్యక్షుడు సంగకుమార్ పాల్గొన్నారు.