Telangana Group -1
-
TG: గ్రూప్-1 రగడ.. నేడు సర్కార్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 అభ్యర్థుల నిరసనలతో హైదరాబాద్ అట్టుడుకుతోంది. నిన్నటి(శనివారం)నిరసనల ఎఫెక్ట్‌తో అశోక్‌నగర్‌లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల ఆందోళనకు బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలికాయి.మరోవైపు, గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికకు పాటించిన విధానంతో రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిసి తమ సమస్యలను ప్రస్తావించారు. ఈ క్రమంలో చొరవ తీసుకున్న మహేశ్‌కుమార్ గౌడ్ శనివారం సాయంత్రం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని పొన్నం ప్రభాకర్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతోపాటు టీజీపీఎస్సీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: ఎందుకీ గ్రూప్-1 వివాదం.. ఏమిటీ జీవో 55.. జీవో 29?గ్రూప్–1 అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు, సమస్యలను మహేశ్ గౌడ్ ప్రస్తావించారు. ప్రధానంగా జీఓ 29పై అభ్యర్థుల్లో భిన్నాభిప్రాయాలు, అనుమానాలున్నాయన్నారు. ఈ క్రమంలో దీనిపై కోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ పరీక్షలో ఏ విద్యార్థికీ అన్యాయం జరగొద్దని, రిజర్వేషన్ల పరంగా ఎలాంటి నష్టం కలగకుండా అన్ని వర్గాలకు న్యాయం జరగాలని మంత్రులు స్పష్టం చేశారు. మంత్రులు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సాంకేతికపరమైన వివరణలు ఇచ్చారు. అనంతరం పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదనే అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పరీక్షలు యధాతథంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆదివారం ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు సమాచారం. -
వచ్చే వారం గ్రూప్–1 నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 ఉద్యోగ నియామకాల కసరత్తు వేగవంతమైంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన 503 గ్రూప్–1 ఉద్యోగాలకు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నిర్దేశించిన పోస్టులకు సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలు టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పిం చగా ఒకట్రెండు శాఖలకు సంబంధించిన ప్రతిపాదనల్లో సందేహాలు తలెత్తడంతో వాటి నివృత్తికి కమిషన్ సవరణ ప్రతిపాదనలు కోరినట్లు తెలిసింది. ఆయా శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించిన వెంటనే టీఎస్పీఎస్సీ సమావేశమై కోరం ఆమోదంతో ఉద్యోగ ప్రకటన జారీ చేయనుందని, ఈ ప్రక్రియకు ఎంతో సమయం పట్టదని టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం సైతం టీఎస్పీఎస్సీ యంత్రాంగం గ్రూప్–1 ఉద్యోగ ప్రకటనపై పలు సమీక్షలు నిర్వహించి ప్రక్రియ పూర్తికి కసరత్తు చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు రాష్ట్రంలో గ్రూప్–1 ఉద్యోగ నియామకాలు జరగలేదు. దీంతో కమిషన్ నుంచి ప్రకటన వస్తే రాష్ట్రంలో అదే తొలి ప్రకటన కానుంది. (చదవండి: ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా!) -
ఎక్కడి వారక్కడే అనడం అన్యాయుం
స్థానికత ఆధారంగానే రాష్ట్రస్థాయిఅధికారుల కేటాయింపు చేపట్టాలి తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా తాత్కాలిక కేటాయింపుల్లో రాష్ట్ర స్థాయి అధికారులను ఎక్కడ పని చేస్తున్న వారిని అక్కడే ఉంచాలని పేర్కొంటూ కేంద్రానికి పంపిన ప్రతిపాదనలతో తెలంగాణ అధికారులకు అన్యాయుం జరుగుతుందని తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. తాత్కాలిక కేటాయింపుల్లోనూ రాష్ట్రస్థారుు అధికారుల విభజన స్థానికత ఆధారంగానే చేపట్టాలని డివూండ్ చేశారు. సోవువారం హైదరాబాద్‌లో విలేకరుల సవూవేశంలో ఆయున వూట్లాడుతూ.. ఇరు ప్రాంతాల అధికారుల అభిప్రాయూలను తెలుసుకోకుండా పంపిన ప్రతిపాదనలను తీవ్రంగా ఖండిస్తున్నావున్నారు. సీవూంధ్రులు తెలంగాణలోనే తిష్టవేసేలా ఈ చర్యలకు పూనుకున్నారని, దీనిని ఉద్యోగులు, నేతలు అడ్డుకోవాలని కోరారు. దీనిపై త్వరలో రాజకీయుపార్టీలతో సవూవేశం నిర్వహించి ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపించనున్నట్టు తెలిపారు. ప్రొవిజనల్ అలాట్‌మెంట్‌కు, ఫైనల్ అలాట్‌మెంట్‌కు మధ్య వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చే సరికి పెద్ద తేడా ఉండదని పేర్కొన్నారు. పైగా ఫైనల్ అలాట్‌మెంట్‌కు మూడేళ్లు పట్టొచ్చంటూ అధికారులే చెబుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక కేటాయింపుల పేరుతో తెలంగాణలో తిష్ట వేసే పరిస్థితి కల్పిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల పంపిణీ, శాఖల వారీగా పోస్టుల విభజన వివరాలను వెబ్సైట్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయం అడిగితే ఎన్నికల కోడ్ ఉందని చెబుతున్నారని, మరోవైపు మాత్రం పోస్టుల భర్తీ, డెప్యుటేషన్లు కొనసాగిస్తున్నారన్నారు. సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ వారిని, తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను వారి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.