స్థానికత ఆధారంగానే రాష్ట్రస్థాయిఅధికారుల కేటాయింపు చేపట్టాలి
తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్
హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా తాత్కాలిక కేటాయింపుల్లో రాష్ట్ర స్థాయి అధికారులను ఎక్కడ పని చేస్తున్న వారిని అక్కడే ఉంచాలని పేర్కొంటూ కేంద్రానికి పంపిన ప్రతిపాదనలతో తెలంగాణ అధికారులకు అన్యాయుం జరుగుతుందని తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. తాత్కాలిక కేటాయింపుల్లోనూ రాష్ట్రస్థారుు అధికారుల విభజన స్థానికత ఆధారంగానే చేపట్టాలని డివూండ్ చేశారు. సోవువారం హైదరాబాద్‌లో విలేకరుల సవూవేశంలో ఆయున వూట్లాడుతూ.. ఇరు ప్రాంతాల అధికారుల అభిప్రాయూలను తెలుసుకోకుండా పంపిన ప్రతిపాదనలను తీవ్రంగా ఖండిస్తున్నావున్నారు. సీవూంధ్రులు తెలంగాణలోనే తిష్టవేసేలా ఈ చర్యలకు పూనుకున్నారని, దీనిని ఉద్యోగులు, నేతలు అడ్డుకోవాలని కోరారు. దీనిపై త్వరలో రాజకీయుపార్టీలతో సవూవేశం నిర్వహించి ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపించనున్నట్టు తెలిపారు.
ప్రొవిజనల్ అలాట్‌మెంట్‌కు, ఫైనల్ అలాట్‌మెంట్‌కు మధ్య వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చే సరికి పెద్ద తేడా ఉండదని పేర్కొన్నారు. పైగా ఫైనల్ అలాట్‌మెంట్‌కు మూడేళ్లు పట్టొచ్చంటూ అధికారులే చెబుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక కేటాయింపుల పేరుతో తెలంగాణలో తిష్ట వేసే పరిస్థితి కల్పిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల పంపిణీ, శాఖల వారీగా పోస్టుల విభజన వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయం అడిగితే ఎన్నికల కోడ్ ఉందని చెబుతున్నారని, మరోవైపు మాత్రం పోస్టుల భర్తీ, డెప్యుటేషన్లు కొనసాగిస్తున్నారన్నారు. సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ వారిని, తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను వారి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
ఎక్కడి వారక్కడే అనడం అన్యాయుం
Published Sun, May 11 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM
Advertisement
Advertisement