telangana gulf workers association
-
ఖతర్‌లో 7న.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
గల్ఫ్ డెస్క్ : ఖతార్‌లోని తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో జూన్ 7న తెలంగాణ ఆవిర్భావ వేడుకలతో పాటు ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు తెలంగాణ గల్ఫ్ సమితి ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కతిక కార్యక్రమాలలో రాష్ట్ర ఉత్తమ జానపద అవార్డు గ్రహీత రేలారే రేలా ఫేం గంగ పాల్గొననున్నారు. ఇండియన్ కల్చరల్ సెంటర్ అశోకా హాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనాలనుకునే ఖతార్‌లోని తెలంగాణ వాసులు ఎంట్రీ పాసుల కోసం ఈ కింది నంబర్లలో సంప్రదించవచ్చు. దోహా: 33625731, 70691202, 55883866, 66517476, వక్రా: 33473690, 30201243, సాన్యా: 70926360, 66732459, 70024431, లేబర్సిటీ: 55756964, 33241860, సాల్వా రిసార్ట్: 50370906. -
'తెగువ' ఒమన్ అధ్యక్షులుగా నరేంద్ర పన్నీరు
సాక్షి, హైదరాబాద్ : గల్ఫ్ వలసకార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమం కోసం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ (తెగువ) ఒమన్ (మస్కట్) శాఖఅధ్యక్షులుగా నరేంద్ర పన్నీరును నియమిస్తూ సంస్థ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నియామకపత్రం ఇచ్చారు. జగిత్యాలకు చెందిన నరేంద్ర పన్నీరు ఒమన్ దేశంలోని మస్కట్‌లో ఒక టెలికం కేబుల్ కంపెనీ యజమానిగా ఉన్నారు. ప్రముఖ ప్రవాస భారతీయుడైన నరేంద్ర పన్నీరు తెలంగాణ వలసకార్మికుల సమస్యల పరిష్కారానికి ఒమన్‌లో కృషిచేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'గల్ఫ్' సినిమా కు ఓవర్సీస్ అంబాసిడర్ గా వ్యవహరించారు. తెలంగాణ నుంచి దాదాపుగా 10 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారిసంక్షేమాన్నీ ప్రభుత్వం గాలికివదిలేసిందన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు 650మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ లో చనిపోతే ఒక్కకుటుంభానికి కూడా ప్రభుత్వం సహాయం చెయ్యకపోవడం బాధాకరమయిన విషయమన్నారు. 2014 ఎలక్షన్ మేనిఫెస్టోలో గల్ఫ్ సమస్యలని పరిష్కరిస్తామని వారికోసం పాలసీ రూపొందిస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు ఏమి చెయ్యకపోవడం అత్యంత దారుణం అని అన్నారు. -
ఈ నెల 6న ఢిల్లీలో ప్రవాసీ ప్రజావాణి
► ప్రతి నెల మొదటి బుధవారం ఓపెన్ హౌజ్ సాక్షిప్రతినిధి, నిజామాబాద్: విదేశాంగ శాఖ ప్రవాసీల కోసం ప్రతినెలా ప్రవాసీ ప్రజావాణి (బహిరంగ వేదిక)ను నిర్వహించనున్నట్లు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్(పిజిఇ) కార్యాలయంలో ప్రతినెలా మొదటి బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనుందని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం 18 ఇసిఆర్ దేశాలకు వలస వెల్లదలచిన వారు, ఆయా దేశాల నుంచి తిరిగి వచ్చినవారు తమ సమస్యలను, సందేహాలను వినడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పిజిఇ కార్యాలయం ఢిల్లీలో చాణక్యపురి, అక్బర్ భవన్లో గల ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న వారు పిజిఇ కార్యాలయం ఫోన్ నెం. 011 24673965కు గానీ, ఈ–మెయిల్: pge@mea.gov.in కు సంప్రదించవచ్చని తెలిపారు. సలహాలు, సహాయం కోసం తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ హెల్ఫ్‌లైన్ నెంబర్ 81435 88886 కు కాల్ చేయాలని కోరారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ (జీసీసీ) సభ్యదేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్, ఓమాన్, ఖతార్‌తో పాటు ఆప్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేసియా, నార్త్ సుడాన్, సౌత్‌సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్ ఇలా మొత్తం 18 దేశాలను భారత ప్రభుత్వం విదేశాలకు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి అవసరం’ అయిన దేశాలు (ఇ.సి.ఆర్– ఎమ్మిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వయిర్డ్)గా వర్గీకరించిందని వివరించారు. ఈ దేశాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు సుమారు పది లక్షల చొప్పున ఉన్నారని అంచనా.