Telangana Minority Education Institution of Residential Society
-
కలెక్టర్ ఆదర్శం; ప్రశంసల వెల్లువ
సాక్షి, వికారాబాద్ : తన కూతురిని మైనార్టీ గురుకుల పాఠశాలలో చేరుస్తానని ప్రకటించి పలువురికి ఆదర్శంగా నిలిచిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదవడాన్ని స్టేటస్ సింబల్‌గా భావించే నేటి కాలంలో.. తన కూతురిని ప్రభుత్వ వసతిగృహంలో చేర్పించాలనుకుంటున్న ఆమె నిర్ణయం స్ఫూర్తిదాయకమని తెలంగాణ మైనార్టీ గురుకులాల (టీఎమ్‌ఆర్‌ఈఐఎస్)కార్యదర్శి షఫీయుల్లా ప్రశంసించారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా మైనార్టీ వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు టీఎమ్‌ఆర్‌ఈఐఎస్ ఎంతగానో కృషి చేస్తోంది. సంప్రదాయ బోధనా పద్ధతులు అవలంబిస్తూనే.. వారిని ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దేందుకు నిరంతరం పాటుపడుతోంది. ఈ క్రమంలో వికారాబాద్ కలెక్టర్ తన కూతురు తాబిష్ రైనాను టీఎంఆర్ వికారాబాద్ బాలికల పాఠశాల-1లో చేర్పించాలని నిర్ణయించారు. -
మైనార్టీ గురుకుల సొసైటీకి పోస్టులు
సాక్షి, హైదరాబాద్: మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో ఏర్పాటు చేసిన తెలంగాణ మైనార్టీ గురుకుల ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)కి 20 రెగ్యులర్, 19 ఔట్ సోర్సింగ్ పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్ పోస్టులను డెప్యుటేషన్‌పై భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.