వారిది అనవసర రాద్ధాంతం
ఆదిలాబాద్: ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు ఆరోపించారు. శుక్రవారం ఆదిలాబాద్లో విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. పెండింగ్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాకు అదనంగా లక్ష ఎకరాలకు సాగునీటిని అందజేస్తామని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ రైతులకు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.