ఉద్యమంలో దళిత, గిరిజనులే కీలకం
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమంలో దళిత, గిరిజనులు పోషించిన పాత్ర మరువలేనిదని తెలంగాణ పొలిటికల్ జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎ.సీతారాంనాయక్ అన్నారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హన్మకొండలోని పబ్లిక్‌గార్డెన్ నుంచి అంబేద్కర్ భవన్ వరకు ఆదివారం తెలంగాణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ భవన్లో మాదిగ సర్పంచ్ల ఆత్మీయ సన్మాన సభ జరిగింది.
ఈ సభలో ప్రొఫెసర్ సీతారాంనాయక్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ 1200 మందికి పైగా బలిదానాలు, సుదీర్ఘ ఉద్యమంతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల బిక్షపతి మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట సాధన, వర్గీకరణ సాధన లక్ష్యంగా తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఏర్పా టైందన్నారు.
ఈ మేరకు దళితుల హక్కులు, మాదిగల హక్కులు కూడా సాధించుకుందామన్నారు. అనంతరం మాదిగ సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. ర్యాలీలో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పాల్గొని సంఘీభావం తెలపగా, కార్యక్రమాల్లో టీఎమ్మార్పీఎస్ నాయకులు బొట్ల రమేష్, బోడ యుగేందర్, వక్కల వెంకట్, కనకం రమేష్, వేల్పుల వెంకన్న, నత్తి కొర్నేలు, అనుమాండ్ల విద్యాసాగర్, కొమ్ముల వజ్రమ్మ, నవీన్, పాము రమేష్, కాళ్ల నవీన్, రామంచ అయిలయ్య, కొయ్యడ సునీల్, నాగరాజు, సిరగొమ్ముల మనోహర్, జంద్యాల బాలస్వామి, సిలువేరు కృష్ణప్రసాద్, దైద సాగర్, నల్లగట్ల వెంకటేశ్వర్లు, బొక్క ఏలియా పాల్గొన్నారు.