telangana region mlas
-
బిల్లు గడువు పెంచొద్దు
రాష్ట్రపతికి టీ ఎమ్మెల్యేల లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చకు అదనపు సవుయుం ఇవ్వరాదని కోరుతూ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి లేఖ రాశారు. ఇప్పటికే తగినంత గడువు ఇచ్చినా సభలో చర్చ జరగకుండా సీమాంధ్ర ప్రాంత నేతలు సవుయం వృథా చేశారని, ఇప్పుడు అదనపు సమయం కోరినా అనుమతించరాదని విన్నవించారు. ఈ మేరకు సోవువారం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతి కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపారు. టీఆర్ఎస్ నేతలు కూడా రాష్ట్రపతికి వేరే లేఖ ద్వారా ఇదే విషయుమై విన్నవించారు. తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం స్పీకర్ మనోహర్‌ను కలిసి లేఖ ఇచ్చారు. చర్చకు రాష్ట్రపతి గడువు పొడిగించే అవకాశం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఇచ్చిన 40 రోజుల గడువు బిల్లుపై అభిప్రాయాలు తెలిపేందుకు సరిపోతుందని సోమవారం లాబీల్లో మీడియా ప్రతినిధులతో చెప్పారు. -
'సమైక్యంగా ఉంచాలని తెలంగాణ ఎమ్మెల్యేలకు కొరతాం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను కలసి కొరతామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు మంగళవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. తాము రేపు సమావేశమై సమ్మె విరమణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే ఈ నెల 17 మధ్యాహ్నం సీఎం కిరణ్‌తో తాము సమావేశం కానున్నట్లు తెలిపారు. సీఎం కిరణ్ ఇచ్చే హామీతోపాటు అప్పటి పరిస్థితిని బట్టి తాము సమ్మె విరమణపై నిర్ణయం తీసుకోనున్నట్లు అశోక్ బాబు వివరించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా తాము చివర వరకు పోరాడతామన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన ప్రభుత్వ వ్యవస్థలపై సమ్మె ప్రభావంఅలానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మా డిమాండ్లన్ని రెండు మూడు రోజుల్లో సీఎస్‌కు నివేదిస్తామన్నారు. న్యూఢిల్లీ వెళ్లి మరోసారి జాతీయ నాయకులను కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కొరనున్నట్లు అశోక్‌బాబు వెల్లడించారు. -
సమైక్యంగా ఉంచాలని తెలంగాణ ఎమ్మెల్యేలను కోరతాం