ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను కలసి కొరతామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు పి.అశోక్బాబు మంగళవారం హైదరాబాద్లో వెల్లడించారు. తాము రేపు సమావేశమై సమ్మె విరమణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే ఈ నెల 17 మధ్యాహ్నం సీఎం కిరణ్తో తాము సమావేశం కానున్నట్లు తెలిపారు. సీఎం కిరణ్ ఇచ్చే హామీతోపాటు అప్పటి పరిస్థితిని బట్టి తాము సమ్మె విరమణపై నిర్ణయం తీసుకోనున్నట్లు అశోక్ బాబు వివరించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా తాము చివర వరకు పోరాడతామన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన ప్రభుత్వ వ్యవస్థలపై సమ్మె ప్రభావంఅలానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మా డిమాండ్లన్ని రెండు మూడు రోజుల్లో సీఎస్కు నివేదిస్తామన్నారు. న్యూఢిల్లీ వెళ్లి మరోసారి జాతీయ నాయకులను కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కొరనున్నట్లు అశోక్బాబు వెల్లడించారు.
Published Tue, Oct 15 2013 3:32 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement