రాష్ట్రపతికి టీ ఎమ్మెల్యేల లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చకు అదనపు సవుయుం ఇవ్వరాదని కోరుతూ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి లేఖ రాశారు. ఇప్పటికే తగినంత గడువు ఇచ్చినా సభలో చర్చ జరగకుండా సీమాంధ్ర ప్రాంత నేతలు సవుయం వృథా చేశారని, ఇప్పుడు అదనపు సమయం కోరినా అనుమతించరాదని విన్నవించారు. ఈ మేరకు సోవువారం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతి కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపారు. టీఆర్‌ఎస్ నేతలు కూడా రాష్ట్రపతికి వేరే లేఖ ద్వారా ఇదే విషయుమై విన్నవించారు. తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం స్పీకర్ మనోహర్‌ను కలిసి లేఖ ఇచ్చారు. చర్చకు రాష్ట్రపతి గడువు పొడిగించే అవకాశం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఇచ్చిన 40 రోజుల గడువు బిల్లుపై అభిప్రాయాలు తెలిపేందుకు సరిపోతుందని సోమవారం లాబీల్లో మీడియా ప్రతినిధులతో చెప్పారు.
బిల్లు గడువు పెంచొద్దు
Published Tue, Jan 21 2014 2:29 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement