మండలి ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్లో ప్రచురణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలిలో 2 పట్టభద్రుల నియోజకవర్గాల (మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ) ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 11న షెడ్యూలు ప్రకటించిన ఎన్నికల సంఘం గురువారం తెలంగాణ రాష్ట్ర గెజిట్లో నోటిఫికేషన్ను ప్రచురించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) కార్యాల యం ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని సీఈఓ కార్యాలయం పేర్కొంది.