Telangana state practice
-
నలుగురు స్టార్స్‌తో తెలంగాణ సాయుధ పోరాటం
‘‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటంలో నేనూ పాల్గొన్నాను. ఇప్పుడు రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా అని వెంటనే సినిమాలు చేస్తే అది స్వార్థం అవుతుంది. మరో మూడు నాలుగు నెలల్లో తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి నుంచి సినిమాలు తీయాలనుకుంటున్నా’’ అని దర్శక, నిర్మాత సానా యాదిరెడ్డి చెప్పారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా బుధవారం పత్రికలవారితో మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒకటి మల్టీస్టారర్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు చెందిన నలుగురు హీరోలతో ‘తెలంగాణ సాయుధ పోరాటం’ పేరుతో ఈ చిత్రం చేయాలనుకుంటున్నా. అలాగే, అంతా నూతన తారలతో ఓ ప్రేమకథా చిత్రం, మరో కుటుంబ కథా చిత్రం తీయాలనుకుంటున్నా’’ అని తెలిపారు. తెలంగాణ లో చిత్రసీమను బలోపేతం చేయడం కోసం పోరాటం చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సినిమా అంటే డిఫైన్, డిజైన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ డెలివరీ అని, ఈ త్రీ‘డి’ విధానాన్ని అభివృద్ధి చేస్తే తెలంగాణాలో సినిమా బలోపేతం అవుతుందని యాదిరెడ్డి తెలిపారు. చెన్నయ్‌లో ‘అమ్మ థియేటర్లు’ ఉన్నట్లుగా.. ఇక్కడ కూడా ఉండాలని, వంద సీట్లు ఉండి, రోజుకి ఇరవై, ముప్ఫయ్ వేలు వచ్చినా ఫర్వాలేదని, అలాంటి థియేటర్లని ఏర్పాట్లు చేయాలని ఓ లాయర్‌గా, నిర్మాతగా కోరుకుంటున్నానని సానా యాదిరెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రకటించగానే ఎవరు పడితే వాళ్లు యూనియన్లు పెడుతున్నారని, అలా కాకుండా ఒక పటిష్ఠమెన కమిటీ ఏర్పడి, 24 శాఖలూ ఒకే చోట ఉండేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరామని సానా వెల్లడించారు. -
తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ అంతర్భాగం
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు నేడు ‘తెలంగాణ జాగృతి’ కవిత, రాష్ట్ర మంత్రి ‘ఈటెల’ జిల్లాకు రాక హన్మకొండ సిటీ : తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ అంతర్భాగమని టీఆర్ఎస్ జిలా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. గురువారం హన్మకొండ రాంనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాల యం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి బతుకమ్మ కొత్తరూపును తీసుకురావడమే కాకుండా సంస్కృతిలో అగ్రభాగాన నిలిచిందని పేర్కొన్నారు. వరంగల్, హన్మకొండలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జిల్లా పర్యటనకు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం ఇక్కడికి వస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి ఉదయం 9.30 గంటలకు హన్మకొండలోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకున్న తర్వాత దుగ్గొండి, నర్సంపేట, కొత్తగూడ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలలో పాల్గొంటారని వివరించారు. తెలంగాణ జాగృతి యువత రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం విజయ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉదయం 9 గంటలకు భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. తర్వాత హన్మకొండ శ్యామలా గార్డెన్సలో ఏర్పాటు చేసిన తెలంగా ణ జాగృతి జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. సాయంత్రం 6.00 గంటలకు హన్మకొండ మర్కజీ స్కూల్ వద్ద తెలంగాణతల్లి విగ్రహం నుంచి నిర్వహించే బతుకమ్మ ర్యాలీలో టీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, జెడ్పీటీసీ సభ్యురాలు వీరమ్మ, టీఆర్ఎస్ నాయకులు లింగంపల్లి కిషన్‌రావు, అంజయ్య, జోరిక రమేష్, బండి రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంకు బీసీలు గుర్తుకు రావడంలేదా..?
జనాభా ప్రతిపాదికన బడ్జెట్ కేటాయించాలి బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షుడు నారగోని వరంగల్ చౌరస్తా : ఎస్పీలకు మూడెకరాల సాగు భూమి, పక్కా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓట్లు వేసి అధికారం కల్పించిన బీసీలు గుర్తుకు రావడం లేదా అని బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీ య అధ్యక్షుడు వీజీఆర్ నారగోని ప్రశ్నించా రు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బడుగు యువకులు అమరులైన విషయాన్ని విస్మరిస్తే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే రానున్న మెదక్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తారని హెచ్చరించారు. వరంగల్‌లోని మహేశ్వరి కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచారి అధ్యక్షతన జరిగిన బీసీ ఐక్య సంఘర్షణ సమితి ప్రతి నిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1931 నాటి జనాభా లెక్కలు చూపిస్తూ ఇంతకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసగిస్తున్నాయని, ఈనెల 19న తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టనున్న సమ గ్ర కుటుంబ సర్వేతో బీసీల జనాభా స్పష్టమవుతుందని, బీసీలు సర్వేకు సహకరించాలని కోరారు. బీసీలు అధికారం కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజ ల భూములు లాక్కొని పరిశ్రమలకు అప్పగించడాన్ని ఐక్య సంఘర్షణ సమితి పూర్తి గా వ్యతిరేకిస్తోందని, ప్రజలకు ఇళ్లు, భూములు కేటాయించిన తర్వాత పరిశ్రమలకు భూము లు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. రానున్న బడ్జెట్ సమావేశంలో బీసీలకు రూ.25వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. టీడీపీకి సర్వేపట్ల చిత్తశుద్ధి లేకపోవడం శోచనీయమన్నారు. అనంతరం రాష్ట్ర, జిల్లా కమిటీలను ప్రకటించారు. రాష్ట్ర కార్యవర్గంలోకి.. సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డాక్టర్ మొగిళిచర్ల సుదర్శన్, కార్యదర్శిగా కట్ట ఈశ్వరప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పోగుల సారంగపా ణి, ఉపాధ్యాయ సెల్ కన్వీనర్‌గా గిరిగాని శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ సెల్ కన్వీనర్‌గా డాక్టర్ వలబోజుల మోహన్‌రావును ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా గౌడ సదానందం, ఉపాధ్యక్షుడిగా గండ్రతి యాదగిరి, నీలోజు శ్రీనివాస్, అమరవాది సారంగపాణి, ప్రధాన కార్యదర్శిగా అర్షం సదానందం, కార్యదర్శులుగా చెన్నోజు రఘు, తుల రమేష్, సహాయ కార్యదర్శిగా కునుకుంట్ల రంజిత్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా వల్లాల ఉపేందర్, బాల్నే శేఖర్‌గౌడ్, భీమన్నగౌడ్, కోశాధికారిగా దొనికెల శ్రీనివాస్‌గౌడ్‌ను నియమించారు. అనుబంధ సంఘాల అధ్యక్షులు.. మహిళా విభాగం అధ్యక్షురాలిగా పెండ్యాల రత్నమాల, డాక్టర్స్ విభాగం కె.సురేందర్, ఉద్యోగ విభాగం చందా మల్లయ్య, లెక్చరర్ల విభాగం అధ్యక్షుడిగా తులా గోవర్ధన్‌ను ఎంపి క చేసినట్లు నారగోని వివరించారు.