సీఎంకు బీసీలు గుర్తుకు రావడంలేదా..? | BC sienku ravadanleda recall ..? | Sakshi
Sakshi News home page

సీఎంకు బీసీలు గుర్తుకు రావడంలేదా..?

Published Mon, Aug 18 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

BC sienku ravadanleda recall ..?

  •      జనాభా ప్రతిపాదికన బడ్జెట్ కేటాయించాలి
  •      బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షుడు నారగోని
  • వరంగల్ చౌరస్తా : ఎస్పీలకు మూడెకరాల సాగు భూమి, పక్కా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓట్లు వేసి అధికారం కల్పించిన బీసీలు గుర్తుకు రావడం లేదా అని బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీ య అధ్యక్షుడు వీజీఆర్ నారగోని ప్రశ్నించా రు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బడుగు యువకులు అమరులైన విషయాన్ని విస్మరిస్తే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

    పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే రానున్న మెదక్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తారని హెచ్చరించారు. వరంగల్‌లోని మహేశ్వరి కాన్ఫరెన్స్ హాల్‌లో ఆదివారం సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచారి అధ్యక్షతన జరిగిన బీసీ ఐక్య సంఘర్షణ సమితి ప్రతి నిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  1931 నాటి జనాభా లెక్కలు చూపిస్తూ ఇంతకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసగిస్తున్నాయని, ఈనెల 19న తెలంగాణలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టనున్న సమ గ్ర కుటుంబ సర్వేతో బీసీల జనాభా స్పష్టమవుతుందని, బీసీలు సర్వేకు సహకరించాలని కోరారు.

    బీసీలు అధికారం కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజ ల భూములు లాక్కొని పరిశ్రమలకు అప్పగించడాన్ని ఐక్య సంఘర్షణ సమితి పూర్తి గా వ్యతిరేకిస్తోందని, ప్రజలకు ఇళ్లు, భూములు కేటాయించిన తర్వాత పరిశ్రమలకు భూము లు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. రానున్న బడ్జెట్ సమావేశంలో బీసీలకు రూ.25వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. టీడీపీకి సర్వేపట్ల చిత్తశుద్ధి లేకపోవడం శోచనీయమన్నారు. అనంతరం రాష్ట్ర, జిల్లా కమిటీలను ప్రకటించారు.
     
    రాష్ట్ర కార్యవర్గంలోకి..

    సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డాక్టర్ మొగిళిచర్ల సుదర్శన్, కార్యదర్శిగా కట్ట ఈశ్వరప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పోగుల సారంగపా ణి, ఉపాధ్యాయ సెల్ కన్వీనర్‌గా గిరిగాని శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ సెల్ కన్వీనర్‌గా డాక్టర్ వలబోజుల మోహన్‌రావును ప్రకటించారు.
     
    జిల్లా అధ్యక్షుడిగా గౌడ సదానందం, ఉపాధ్యక్షుడిగా గండ్రతి యాదగిరి, నీలోజు శ్రీనివాస్, అమరవాది సారంగపాణి, ప్రధాన కార్యదర్శిగా అర్షం సదానందం, కార్యదర్శులుగా చెన్నోజు రఘు, తుల రమేష్, సహాయ కార్యదర్శిగా కునుకుంట్ల రంజిత్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా వల్లాల ఉపేందర్, బాల్నే శేఖర్‌గౌడ్, భీమన్నగౌడ్, కోశాధికారిగా దొనికెల శ్రీనివాస్‌గౌడ్‌ను నియమించారు.
     
    అనుబంధ సంఘాల అధ్యక్షులు..

    మహిళా విభాగం అధ్యక్షురాలిగా పెండ్యాల రత్నమాల, డాక్టర్స్ విభాగం కె.సురేందర్, ఉద్యోగ విభాగం చందా మల్లయ్య, లెక్చరర్ల విభాగం అధ్యక్షుడిగా తులా గోవర్ధన్‌ను ఎంపి క చేసినట్లు నారగోని వివరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement