తెలంగాణ వీరస్వామికి కన్నీటి వీడ్కోలు
ముషీరాబాద్: కాలేయ సంబంధిత వ్యాధితో సోమవారం మరణించిన తెలంగాణ వీరస్వామి అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ వాదులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య పార్శిగుట్ట శ్మశానవాటికలో జరిగాయి.
అంతకుముందు రాంనగ ర్ డివిజన్ హరినగర్‌లోని వీరస్వామి నివాసం వద్ద ఆయన భౌతికకాయానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, గ్రేటర్ చైర్మన్ శ్రీధర్, టీజీవో నాయకులు ఎంబీ కృష్ణయాదవ్, ముషీరాబాద్ జేఏసీ చైర్మన్ ఎం.నర్సయ్య, గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ కల్పనా యాదవ్, సీపీఎం నాయకులు శ్రీనివాస్, శ్రీనివాసరావు, న్యూ డెమోక్రసీ నాయకులు అరుణోదయ రామారావు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాంనగర్ డివిజన్ కన్వీనర్ నర్సింగ్, దోమలగూడ డివిజన్ కన్వీనర్ శ్రీనివాస్, గాంధీనగర్ డివిజన్ కన్వీనర్ డికె.శ్రీనివాస్ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు.