9న గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర మహాసభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర మహాసభను ఈ నెల 9న హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రకటన విడుదల చేసింది.
వీఆర్వోలకు ఆర్ఐలుగా ప్రొబేషన్ డిక్లరేషన్, గ్రామాల్లో వీఆర్వో కార్యాలయాల ఏర్పాటు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, కారుణ్య నియామకాలు తదితర అంశాలపై మహాసభలో చర్చించనున్నట్లు సంఘం పేర్కొంది.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీశ్ అధ్యక్షతన జరగనున్న ఈ మహాసభల్లో రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఈటల రాజేందర్, హరీశ్‌రావు, నిజామాబాద్ ఎంపీ కవితతోపాటు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, కారం రవీందర్‌రెడ్డి, కె.భిక్షపతి, రాజేశ్ తదితరులు పాల్గొంటారని తెలిపింది.