వాటర్‌గ్రిడ్ టెండర్లపై ప్రి బిడ్ సమావేశం
హైదరాబాద్ : తెలంగాణ తాగునీటి సరఫరా పథకం(వాటర్ గ్రిడ్) రెండోదశ టెండర్ల ప్రీ బిడ్ సమావేశాన్ని శుక్రవారం గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు నిర్వహించారు. సుమారు రూ.14,098 కోట్ల అంచనాలతో 10 ప్యాకేజీలకు ఈ నెల 17న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి జరిగిన ప్రీ బిడ్ సమావేశానికి 18 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై, టెండరు నిబంధనల విషయంలో తమకున్న సందేహాలపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించారు.
ప్రాజెక్ట్ పనులను ఎంత సమయంలో పూర్తి చేయాలన్న అంశంపై స్పష్టత కావాలని కోరారు. ఆయా కంపెనీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆర్డబ్ల్యూఎస్ సలహాదారు జ్ఞానేశ్వర్, వాటర్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ సురేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు జవాబులిచ్చారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ ఎస్ఈలు జగన్మోహన్రావు, నందనరావు తదితరులు పాల్గొన్నారు.