television ratings
-
రిపబ్లిక్ టీవీ సీఎఫ్ఓకు సమన్లు
ముంబై: ముంబైలో వెలుగు చూసిన టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(టీఆర్పీ) స్కామ్‌కు సంబంధించి ‘రిపబ్లిక్ టీవీ’ సీఎఫ్ఓ సుందరానికి పోలీసులు శుక్రవారం సమన్లు జారీ చేశారు. అక్టోబర్ 10న విచారణకు హాజరు కావాలన్నారు. ఈ స్కామ్‌లో రిపబ్లిక్‌తో పాటు మరో 2 మరాఠీ చానళ్ల పాత్రపై దర్యాప్తు జరుపుతున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. వినియోగదారులతో ఒప్పందాలు ముంబైలో టీఆర్పీల నిర్వహణను హంస అనే ఎజెన్సీ చూస్తోంది. ఆ సంస్థ మాజీ ఉద్యోగుల సాయంతో, వినియోగదారులకు డబ్బులు ఇచ్చి, తమ చానళ్లనే చూడాలని, చూడకపోయినా తమ చానెళ్లనే ఆన్‌లో ఉంచాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. అలా ఎంపిక చేసిన చానళ్లను నిర్ధిష్ట సమయంలో చూసినందుకు నెలవారీ కొంత డబ్బు ఇస్తామని చెప్పడం వల్ల ఒప్పుకున్నానని ఒక వినియోగదారుడు చెప్పారు. ఇందులో రిపబ్లిక్ చానల్‌తో పాటు రెండు మరాఠీ చానెళ్లు కూడా ఉన్నాయి స్టాండింగ్ కమిటీ ముందుకు! టీఆర్పీ స్కామ్ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం.. పార్లమెంటరీ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చీఫ్ శశి థరూర్‌కు లేఖ రాశారు. ఒక జాతీయ వార్తా చానల్ సహా 3 చానళ్లు ఈ స్కామ్‌లో ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారని, అందువల్ల తదుపరి కమిటీ మీటింగ్‌లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కార్తి చిదంబరం ఆ లేఖలో కోరారు. -
ముంబైలో టీఆర్పీ స్కామ్
ముంబై: ముంబైలో ఒక టెలివిజన్ రేటింగ్స్ పాయింట్స్(టీఆర్పీ) స్కామ్ వెలుగు చూసింది. టీవీ కార్యక్రమాల ప్రజాదరణను గణాంకాలతో వివరించే టీఆర్పీ ఆధారంగా ఆయా కార్యక్రమాలకు ప్రకటనలు వస్తాయి. ముంబైలో కొన్ని టీవీ చానళ్లు అక్రమ మార్గాల ద్వారా టీఆర్పీలను పెంచుకుంటున్న విషయాన్ని పోలీసులు గురువారం బట్టబయలు చేశారు. ఇందుకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. రిపబ్లిక్ టీవీకి కూడా ఈ కుంభకోణంలో భాగం ఉందని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ వెల్లడించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో మహరాష్ట్ర ప్రభుత్వంపై, ముంబై పోలీసులపై ఆ న్యూస్ చానల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆ వార్తాచానల్ పాత్రకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామని పరమ్‌వీర్ సింగ్ తెలిపారు. సుశాంత్ మృతి కేసులో ప్రశ్నించినందువల్ల ముంబై పోలీస్ కమిషనర్ తమపై తప్పుడు అభియోగాలు మోపారని ఆ చానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఆరోపించారు. రెండు మరాఠీ చానళ్లు కూడా రెండు మరాఠీ చానళ్లు అయిన ఫాస్ట్ మరాఠీ, బాక్స్ సినిమాల యజమానులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చానళ్లకు చెందిన బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నామన్నారు. ‘టీఆర్పీల ఆధారంగా∙చానళ్లకు ప్రకటనలు వస్తాయి. తద్వారా ఆదాయం వస్తుంది. ఇదంతా వేల కోట్ల వ్యవహారం. తప్పుడు విధానాలతో టీఆర్పీలను పెంచుకుని చూపించి ఆయా చానళ్లు ఆదాయం పెంచుకున్నాయి’ అని వివరించారు. ‘కొంతమంది ఎంపిక చేసిన వినియోగదారుల ఇళ్లల్లో బారోమీటర్లను ఏర్పాటు చేసి, ఆయా కుటుంబాలు చూస్తున్న చానళ్లను గుర్తిస్తారు. తద్వారా టీఆర్పీలను గణిస్తారు. అయితే, అక్రమంగా టీఆర్పీలను పెంచుకుని చూపాలనుకునే చానల్.. ఆయా వినియోగదారులకు డబ్బులు ఆశ చూపి, తమ చానల్నే ఎక్కువ సేపు చూడాలని, లేదా చూడకపోయినా తమ చానల్నే ఆన్ చేసి ఉంచాలని కోరుతాయి’ అని తెలిపారు. బారోమీటర్లు ఉన్న వినియోగదారుల్లో చాలామంది తాము డబ్బు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించారన్నారు. టీఆర్పీలను ప్రతీవారం విడుదల చేసే బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) అధికారులను కూడా విచారిస్తామన్నారు. ‘టీఆర్పీలను లెక్కించేందుకు ముంబైలో 2 వేల బారోమీటర్లు ఉన్నాయి. వాటి నిర్వహణను హంస అనే ఏజెన్సీకి బార్క్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ ఏజెన్సీ వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ కుంభకోణాన్ని వెలికితీశాం’ అని వివరించారు. హంస ఏజెన్సీ మాజీ ఉద్యోగులు కొందరికి ఇందులో పాత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. మంబైలోనే కాకుండా ఈ తరహా మోసం దేశంలోని ఇతర నగరాల్లోనూ జరగుతుండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
బుల్లితెరపైనా 'బాహుబలి' ప్రభంజనం
ముంబై: వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా 'బాహుబలి' సంచనాలు సృష్టిస్తున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించడంతో పాటు పలు రికార్డులను ఈ చిత్రం తిరగరాసింది. అత్యధిక వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా ఊహించిన దానికంటే ఘన విజయం సాధించడమే కాకుండా నిర్మాతలకు కాసుల పంట పండించింది. దసరా సందర్భంగా 'బాహుబలి' సినిమాను తెలుగు, హిందీ టీవీ చానళ్లలో ప్రసారం చేశారు. టీవీల్లోనూ ఈ సినిమా అత్యధిక మంది వీక్షించారు. దీంతో ఆరోజు టీవీ రేటింగ్స్ అమాంతంగా పెరిగాయి. ఈ విషయాన్ని బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'బాహుబలి'లో టెలివిజన్ రేటింగ్స్ దూసుకెళ్లాయని తెలిపారు. ఈ ఘనత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, యూనిట్ మొత్తానికి చెందుతుందని పేర్కొన్నారు. కరణ్ జోహార్ కు 'భల్లాలదేవ' దగ్గుబాటి రానా ధన్యవాదాలు తెలిపారు. 'బాహుబలి' విజయంలో మీకూ భాగస్వామ్యం ఉందని ట్వీట్ చేశారు. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. #Baahubali storms television ratings!!! More power to the man @ssrajamouli and the entire team!!! #Prabhas @RanaDaggubati — Karan Johar (@karanjohar) November 16, 2015