బుల్లితెరపైనా 'బాహుబలి' ప్రభంజనం | Baahubali Movie storms television ratings: Karan Johar | Sakshi
Sakshi News home page

బుల్లితెరపైనా 'బాహుబలి' ప్రభంజనం

Published Mon, Nov 16 2015 2:41 PM | Last Updated on Sun, Sep 3 2017 12:34 PM

బుల్లితెరపైనా 'బాహుబలి' ప్రభంజనం

బుల్లితెరపైనా 'బాహుబలి' ప్రభంజనం

ముంబై: వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా 'బాహుబలి' సంచనాలు సృష్టిస్తున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించడంతో పాటు పలు రికార్డులను ఈ చిత్రం తిరగరాసింది. అత్యధిక వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా ఊహించిన దానికంటే ఘన విజయం సాధించడమే కాకుండా నిర్మాతలకు కాసుల పంట పండించింది.

దసరా సందర్భంగా 'బాహుబలి' సినిమాను తెలుగు, హిందీ టీవీ చానళ్లలో ప్రసారం చేశారు. టీవీల్లోనూ ఈ సినిమా అత్యధిక మంది వీక్షించారు. దీంతో ఆరోజు టీవీ రేటింగ్స్ అమాంతంగా పెరిగాయి. ఈ విషయాన్ని బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'బాహుబలి'లో టెలివిజన్ రేటింగ్స్ దూసుకెళ్లాయని తెలిపారు. ఈ ఘనత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, యూనిట్ మొత్తానికి చెందుతుందని పేర్కొన్నారు.

కరణ్ జోహార్ కు 'భల్లాలదేవ' దగ్గుబాటి రానా ధన్యవాదాలు తెలిపారు. 'బాహుబలి' విజయంలో మీకూ భాగస్వామ్యం ఉందని ట్వీట్ చేశారు. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement