telicome shares
-
వొడాఫోన్‌లో ఉద్యోగుల తొలగింపు.. 11 వేల మందిపై వేటు!
ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ లేఆఫ్స్ ప్రకటించింది. రానున్న 3 ఏళ్లలో 11వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ మార్గరీటా డెల్లా వల్లే తెలిపారు. తమ సామర్ధ్యం తగినంతగా లేదని, నిరంతరం మెరుగైన సేవలు అందించే క్రమంలో వొడాఫోన్ విధిగా మారాలని డెలా వలె స్పష్టం చేశారు. ‘కస్టమర్లు, సరళత, వృద్ధి ఈ మూడు అంశాలే మా లక్ష్యం. వీటి ఆధారంగా మార్కెట్లో నెలకొన్న పోటీని ధీటుగా ఎదుర్కొనేందుకు సంస్థను తీర్చిదిద్దుతామని చెప్పారు. అంతేకాదు కస్టమర్లకు నాణ్యమైన సేవల్ని అందించేలా వనరులను కేటాయిస్తూ మరింత వృద్ధి సాధిస్తామని మార్గరీటా డెల్లా ధీమా వ్యక్తం చేశారు. సంస్థ సైతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి నేపథ్యంలో వొడాఫోన్ ఈ నిర్ణయం తీసుకోవడం టెలికాం రంగానికి చెందిన ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాగా, గత ఏడాది వొడాఫోన్‌లో 104,000 మంది సిబ్బంది ఉండగా.. తాజాగా మొత్తం వర్క్ ఫోర్స్‌లో 10శాతానికి పైగా సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. చదవండి👉 అమెజాన్‌లో లేఆఫ్స్.. భారత్‌లో 500 మంది ఉద్యోగుల తొలగింపు! -
ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదంట!
4జీ కంటే 10 రెట్ల వేగంతో పనిచేసే 5జీ టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా? అని ఎదురు చూసిన స్మార్ట్ ఫోన్ యూజర్లకు నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభం సందర్భంగా 5జీ సేవల్ని ప్రధాని అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం టెలికం సంస్థ ఎయిర్ టెల్ దేశంలో ఎంపిక చేసిన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, సిలిగురిలో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ 5జీ సేవలు ఐఫోన్, శాంసంగ్, వన్ ప్లస్‌తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్లలో పనిచేయడం లేదని యూజర్లు వాపోతున్నారు. దీనిపై నిపుణులు మాత్రం తయారీ సంస్థలు ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని అంటున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 5జీ పనిచేయడం లేదు 5జీ నెట్ వర్క్ పనిచేయకపోవడంతో ఎయిర్టెల్, ఫోన్ తయారీ సంస్థలు టెస్టింగ్ నిర్వహిస్తుండగా..యాపిల్, శాంసంగ్ సిరీస్‌లోని ఫ్లిప్ 4, ఫోల్డ్ 4, ఎస్ 21 ఎఫ్ఈ, గెలాక్సీ ఎస్ 22, ఎస్22 ఆల్ట్రా అండ్ ఎస్ 22, వన్ ప్లస్‌కు చెందిన వన్ ప్లస్ 8, 8టీ, 8ప్రో, 9ఆర్, నార్డ్2, 9ఆర్టీలలో 5జీ పనిచేయడం లేదని, మిగిలిన స్మార్ట్ ఫోన్లలో ఈ ఫాస్టెస్ట్ టెక్నాలజీని వినియోగించుకోనే సౌలభ్యం ఉంది. చదవండి👉 రూ.15వేలకే ల్యాప్‌ట్యాప్,‘రిలయన్స్ జియో సరికొత్త సంచలనం!’ -
దీపావళి నుండి దేశంలో జియో 5జీ సేవలు, ముఖేష్ అంబానీ కీలక ప్రకటన!
ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆగస్ట్ 29 మధ్యాహ్నం 2గంటలకు (సోమవారం) వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ప్రసంగిస్తున్నారు. ఈ ప్రసంగంలో 5జీ నెట్ వర్క్ గురించి అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ►5జీ లో మోర్ అడ్వాన్స్ వెర్షన్లను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ►దేశ మంతా హైక్వాలిటీ, హై అఫర్డ్‌బుల్ 5జీ సర్వీసులను అందించనున్నట్లు చెప్పారు. ►వచ్చే రెండు నెలల్లో అంటే ఈ దివాళీకి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కత్తాతో పాటు దేశంలో అన్నీ ప్రధాన నగరాల్లో జియో 5జీ నెట్ వర్క్‌లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ►జియో 5జీ సేవల్ని విస్త్రృతంగా అంబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ 2023 నాటికల్లా దేశంలో ప్రతి గ్రామ గ్రామాన జియో 5జీ సేవల్ని వినియోగదారులకు అందిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. ►మేడిన్ ఇండియా 5జీ నెట్ వర్క్ వినియోగంలోకి తెచ్చేందుకు మెటా, గూగుల్,మైక్రోసాఫ్ట్, ఎరిక్సిన్,నోకియా, శాంసంగ్,సిస్కో, క్వాల్కంతో భాగస్వామ్యం అవుతున్నట్లు చెప్పారు. ► ఈ సందర్భంగా క్వాల్కమ్ సీఈవో క్రిస్టోనా ఆమోన్ మాట్లాడారు. త్వరలో జియో 5జీ నెట్ వర్క్ దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానుందని, వినియోగదారులు 700ఎంహెచ్‌జెడ్,3500 ఎంహెచ్‌జెడ్, 26ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రంను వినియోగించుకోవచ్చని తెలిపారు. -
జియో ఎఫెక్ట్: నష్టాల్లో టెలికాం రంగ షేర్లు
వచ్చే ఏడాది కల్లా భారత్‌లో 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటనతో గురువారం ఉదయం సెషన్లో టెలికాం షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రంగానికి చెందిన భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్లు 2నుంచి 17శాతం నష్టాన్ని చవిచూశాయి. కొన్ని నెలల క్రితం వోడాఫోన్లో టెక్ దిగ్గజం గూగుల్ పెట్టుబడులు పెడుతుందని వార్తలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గూగుల్ జియోలో 7.7 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం గూగుల్ రూ. 33,373 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. అలాగే స్పెక్ట్రం వేలం వేసిన తర్వాత రిలయన్స్ మేడ్ ఇన్ ఇండియా 5 జి సొల్యూషన్స్‌ను ట్రయల్ కోసం విడుదల చేయడానికి సిద్ధంగా ఉందనే వార్తలు వోడాఫోన్, ఎయిర్టెల్ షేర్లపై ఒత్తిడిని పెంచాయి. బీఎస్ఈలో టెలికాం రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఎస్అండ్పీ బీఎస్ఈ టెలికాం ఇండెక్స్ 2శాతం మేర నష్టాన్ని చవిచూసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ ఇండెక్స్ 30శాతం లాభపడటం పడింది. ఇదే సమయంలో సెనెక్స్ సూచీ 8శాతం నష్టాన్ని చవిచూడటం గమనార్హం. వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, భారతీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ షేరు మాత్రం 1శాతం లాభంతో కదులుతోంది. -
లాక్‌డౌన్‌ను ఎదుర్కొనే సత్తా ఉన్న రంగమిదే..!
కోవిడ్ సంబంధిత అంతరాయాతో విశ్లేషకులు పలు కంపెనీ షేర్ల వృద్ధి అంచనాలను, టార్గెట్ ధరలను తగ్గిస్తున్నారు. దీంతో ఇటీవల వారాల్లో అనేక షేర్లు రీ-రేటింగ్‌ను చూస్తున్నాయి. కానీ ఇంత సంక్షోభంలో ఒక రంగానికి చెందిన కంపెనీలు దుమ్ముదులుపుతున్నాయి. చాలామంది ఇన్వెస్టర్లు ఈ రంగంపై మక్కువ చూపిస్తున్నారు. అదే టెలికాం రంగం.... ఇటీవల కాలం వరకు ఈ రంగం నానా ఇబ్బందులతో సతమతమైతూ వచ్చింది. కానీ ఒక్కమారుగా ఈ రంగం బంగారుబాతుగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ వ్యవధిలో డబ్బులు డబుల్ కావడానికి టెలికాం రంగం ఉత్తమైన ఎంపికగా కొందరు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లాక్డౌన్ సమయంలో డేటా, వాయిస్ వినియోగం పెరగడం, గతేడాది చివరి నెలలో టారీఫ్‌ల పెంపుతో పాటు భవిష్యత్తులో కంపెనీలు టారీఫ్‌లు పెంచవచ్చనే అంచనాలతో బ్రోకరేజ్ సంస్థలు టెలికాం రంగ షేర్లకు బుల్లిష్ రేటింగ్‌ను ఇస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ కంపెనీల ఆదాయాలు పెరగవచ్చని అంచనా వేస్తున్నాయి. టెలికాం కంపెనీలు రానున్న పదేళ్ల వరకు వార్షిక ప్రాతిపాదికన 14శాతం చక్రీయ వార్షిక వృద్ది నమోదు చేయగలవని యాంబిట్ క్యాపిటల్ ఛైర్మన్ వివేకానంద్ అభిప్రాయపడ్డారు. ఈయన వోడాఫోన్ ఐడియా షేరుపై బాగా బుల్లిష్‌గా ఉన్నారు. త్వరలో పోస్ట్‌పెయిడ్ ధరలను పెంచడంతో పాటు ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే ప్రీమియం వినియోగదారులు అధికంగా ఉండటం వోడాఫోన్ ఐడియాకు కలిసొస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో షేరుకు ‘‘బై’’ రేటింగ్ కేటాయింపుతో పాటు, ఏడాది కాలానికి టార్గెట్ ధరను రూ.19గా నిర్ణయించారు. ఈ టార్గెట్ ధర షేరు ప్రస్తుత ట్రేడింగ్‌ను నుంచి ఏకంగా 248శాతం అధికంగా ఉంది. ఇదే షేరు మార్చి కనిష్టం నుంచి ఏకంగా 73శాతం పెరిగింది. టెలికాం రంగంలో ఆదాయాల విజిబిలిటి మెరుగుపడుతున్నందున టెలికాం షేర్లు రానున్న రోజుల్లో చెప్పుకోదగిన ర్యాలీ చేసే అవకాశం ఉందని నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ సిఐఓ సైలేష్ రాజ్ భన్ అభిప్రాయపడ్డారు. భారతీ ఎయిర్టెల్ షేరుపై అధిక బ్రోకరేజ్ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి. మోర్గాన్ స్టాన్లీతో సహా మొత్తం 7 కంపెనీలు అవుట్పర్ఫామ్ రేటింగ్, 16 కంపెనీలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించినట్లు రాయిటర్స్ నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల కంపెనీ నిరుత్సాహకరమైన త్రైమాసికపు ఫలితాలను ప్రకటించినప్పటికీ.., మోర్గాన్ స్టాన్లీ సేరు ఓవర్‌వెయిట్ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్ ధరను రూ.525 నుంచి రూ.725కు పెంచింది. భారతీ ఎయిర్టెల్ షేరు ఈ క్యాలెండర్ అన్ని బ్లూచిప్ కంపెనీల్లో కెల్లా అత్యధిక ర్యాలీని చేసింది. వార్షిక ప్రాతిపదికన 31శాతం లాభపడింది. -
లాభాల్లో టెలికాంషేర్లు: ఐడియా 10శాతం జంప్
ముంబై: దేశీయ టెలికాం కంపెనీల ప్రతిపాదనలకు ఇంటర్‌మినిస్టీరియల్ గ్రూప్ (ఐఎంజీ) ఆమోదం తెలపనుందనే అంచనాల నేపథ్యంలో టెలికాం షేర్లు వెలుగులోకి వచ్చాయి. టెలికాం సంస్థల సూచనలకు సంబంధించిన డ్రాప్ట్‌ను ఐఎంజీ సిద్ధం చేసిందన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. దీంతో బుల్ మార్కెట్లో ఇతర షేర్లతోపాటు టెలికాం కంపెనీ లషేర్లు కూడా భారీగా ర్యాలీ అవుతున్నాయి. మూడు ప్రధాన ఆపరేటర్లు ఐడియా, భారతి ఎయిర్టెల్, వోడాఫోన్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది.ముఖ్యంగా యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ లెవీని (యూఎస్‌వోఎఫ్) భారీగా తగ్గింపు లేదా రద్దు చేయనుంది. అలాగే టెలికాం ఆపరేటర్లు ప్రతిపాదించినట్టుగా లైసెన్స్ ఫీజును 8 శాతంనుంచి 6 శాతానికి తగ్గించనుందని సమాచారం. ఈ అంచనాల నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద సంస్థ ఐడియా సెల్యులార్ ఏకంగా 10 శాతంలాభపడగా, మార్కెట్ లీడర్ భారతి ఎయిర్ టెల్ 3శాతం, టాటా టెలీ 5 శాతం, ఆర్‌కాం 5శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. కాగా జీఎస్టీ పన్ను 18 శాతానికి బదులుగా, ప్రస్తుతం ఉన్న 5 శాతాన్ని కొనసాగించాలని వోడాఫోన్ కోరింది. ఈ వాదనను ఐడియా కూడా సమర్ధించింది. తద్వారా లైసెన్సింగ్ ఫీజు తగ్గుతుందని పేర్కొంది. అలాగే లైసెన్స్ ఫీజును 3 శాతానికి తగ్గించాలని ఎయిర్ టెల్ ఐఎంజీ కి సూచించిన సంగతి తెలిసిందే.