RIL AFG 2022: Mukesh Ambani Announced 5g Roll Out In India, Details Inside - Sakshi
Sakshi News home page

5G In India: దీపావళి నుండి దేశంలో జియో 5జీ సేవలు, ముఖేష్‌ అంబానీ కీలక ప్రకటన!

Published Mon, Aug 29 2022 2:23 PM | Last Updated on Tue, Aug 30 2022 9:25 AM

Mukesh Ambani Announcement About 5g Roll Out In India - Sakshi

ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆగస్ట్‌ 29 మధ్యాహ్నం 2గంటలకు (సోమవారం) వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) సందర్భంగా రిలయన్స్‌ ఇండస్ట్రీ అధినేత ముఖేష్‌ అంబానీ ప్రసంగిస్తున్నారు. ఈ ప్రసంగంలో 5జీ నెట్‌ వర్క్‌ గురించి అంబానీ కీలక వ‍్యాఖ్యలు చేశారు.  

5జీ లో మోర్‌ అడ్వాన్స్‌ వెర్షన్‌లను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. 

దేశ మంతా హైక్వాలిటీ, హై అఫర్డ్‌బుల్‌ 5జీ సర్వీసులను అందించనున్నట్లు చెప్పారు.

వచ్చే రెండు నెలల్లో అంటే ఈ దివాళీకి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌ కత‍్తాతో పాటు దేశంలో అన్నీ ప్రధాన నగరాల్లో జియో 5జీ నెట్‌ వర్క్‌లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. 

జియో 5జీ సేవల్ని విస్త్రృతంగా అంబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్‌ 2023 నాటికల్లా దేశంలో ప్రతి గ్రామ గ్రామాన జియో 5జీ సేవల్ని వినియోగదారులకు అందిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.    

మేడిన్‌ ఇండియా 5జీ నెట్‌ వర్క్‌ వినియోగంలోకి తెచ్చేందుకు మెటా, గూగుల్‌,మైక్రోసాఫ్ట్‌, ఎరిక్సిన్‌,నోకియా, శాంసంగ్‌,సిస్కో, క్వాల్కంతో భాగస్వామ్యం అవుతున్నట్లు చెప్పారు. 

► ఈ సందర్భంగా క్వాల్కమ్‌ సీఈవో క్రిస్టోనా ఆమోన్‌ మాట్లాడారు. త్వరలో జియో 5జీ నెట్‌ వర్క్‌ దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానుందని, వినియోగదారులు 700ఎంహెచ్‌జెడ్‌,3500  ఎంహెచ్‌జెడ్‌, 26ఎంహెచ్‌జెడ్‌ స్పెక్ట్రంను వినియోగించుకోవచ్చని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement