మహానాడుకు తరలిరండి
కొరుక్కుపేట: ఉగాది పేరుతో 28న నగరంలో నిర్వహిం చనున్న తెలుగు మహానాడుకు తెలుగువారంతా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆలిండియా తెలుగు ఫెడరేషన్( ఏఐటీఎఫ్) అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగు మహానాడుకు తెలుగు క్రైస్తవ సంఘాల నాయకులు మద్దతు పలకడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఏఐటీఎఫ్ ప్రధానకార్యాలయంలో తెలుగు క్రైస్తవ సంఘాల పాస్టర్లతో డాక్టర్ సీఎంకే రెడ్డి సమావేశమయ్యారు. టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయేల్ అధ్యక్షత ఈ కార్యక్రమం జరిగింది.
ముందుగా టామ్స్ అధ్యక్షులు నేలటూరి విజయకుమార్ స్వాగతోపన్యాసం చేశారు. రాష్ట్రంలో తెలుగువారి హక్కుల పరిరక్షణ కోసం డాక్టర్ సీఎంకే రెడ్డి తలపెట్టిన తెలుగు మహానాడుకు ప్రతి ఒక్కరు తరలిరావాలని కోరారు. గొల్లపల్లి ఇజ్రాయేల్ మాట్లాడుతూ తెలుగువారి సమస్యల పరిష్కారానికి తెలుగుమహానాడు వేదికకానుందని అందువల్ల తెలుగువారంతా మహానాడుకు తరలిరావాలని కోరు. అదేవిధంగా ఏఐటీఎఫ్ ఉపాధ్యక్షులు చిరంజీవి,ప్రధాన కార్యదర్శి నందగోపాల్ మాట్లాడుతూ 30 శాతం పైబడి తెలుగు ప్రజలు ఉన్న ఈ రాష్ర్టంలో తెలుగు వారి హక్కులను ప్రభుత్వాలు హరిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
అనంతరం క్రైస్తవ సంఘాల నాయకులు మాట్లాడుతూ తమవంతు పూర్తిసహకారం అందిస్తామని అన్నారు. చివరిగా డాక్టర్ సీఎంకే రెడ్డి మాట్లాడతూ తెలుగు మహానాడును ఈనెల 28న చెన్నై మీనంబాక్కంలోని ఏఎం జైన్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నామని అన్నారు.దీనికి తెలుగువారంతా తరలివచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగువారిసంఖ్య బలాన్ని చాటాలని పిలుపునిచ్చారు.గత 50 ఏళ్ళలో రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగువారికి ఎటువంటి మంచి పనిచేయలేదని అన్నారు. ఏఐటీఎఫ్ యూత్వింగ్ ప్రెసిడెంట్ టి.సురేష్, కోశాధికారి శంకరన్, టామ్స్‌కు చెందిన స్వర్ణజయపాల్, ఐసయ్య, దేవదానం పాల్గొన్నారు.