పరభాషా సాహిత్యం అనువాదంపై విచక్షణ అవసరం
విశాఖ–కల్చరల్
తెలుగు సాహిత్య ఆరంభాలే అనువాదంపై ఆధారపడ్డ బలమైన నిర్మాణాలని పలువురు సాహితీవేత్తలు సూచించారు. విభిన్న మానవ సమాజంల్లోని ప్రజలు ఒక సమాజంలో ఏం జరుగతున్నదీ తెలుసుకోవాలంటే...ఆ భాషలో రాసింది ఇంకోక భాషలోకి వెళ్లడం చాలా అవసరమని పేర్కొన్నారు. అనువాద రంగంలో తొలిసారిగా సాహిత్య అకాడమి ‘అనువాద ధోరణలు–నైపుణ్యాలు’అనే అంశంపై ప్రముఖ అనువాద సాహితీవేత్తలు అనువాద అనుభవాలను క్రోడికరించి ఒక రోజు సదస్సు నిర్వహించారు. విశాఖ పౌరగ్రంథాలయంలో సాహిత్య అకాడమి, మొజాయిక్ సాహిత్య సంస్థ సంయుక్తంగా ఆదివారం ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథిగా çహాజరైన ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ పరిభాష సాహిత్య అనువాద ప్రాముఖ్యతను వివరించారు. సంస్కత రచనలు ఎలా తొలినాళ్ల కవులను ప్రభావితం చేసాయో అలానే ఆధునికసాహిత్య ఆరంభాలు కూడా మన పూర్వమహాకవులు మూలాలు ఆధారంగానే తొలి సామాజిక రచనలు, నవలలు, వచనలు పూర్వభూమికలు అయ్యాయన్నారు. ప్రబంధ కవుల కాలం నుంచి సొంత కల్పన,కొంత పౌరాణిక ఇతివత్తాలతో మేళవించి రాయడం మొదలై, తెలుగు కవులు రచనలు స్వతంత్ర ప్రతిపత్తితో వెలుగొందాయని గుర్తి చేశారు. సాహిత్య అకాడమి దక్షిణ ప్రాంతీయ కార్యదర్శి ఎస్. పి.మహాలింగేశ్వర్ మాట్లాడుతూ అనువాదరంగంలో నగరానికి చెందిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎల్.ఆర్.స్వామి, డాక్టర్ ఎ. శేషారత్నం, డాక్టర్ చాగంటి తులసి, వంటి లబ్ది ప్రతిష్టులూ, పురస్కార గ్రహీతలతోపాటుగా, మరికొందరు మహానుభావులు భాషాపటిమతో కషి చేయడం ప్రశంనీయమన్నారు. అనువాద సాహితీవేత్త డాక్టర్ ఎన్. గోపి మాట్లాడుతూ అనువాద లక్షణాలపై వివరించారు. పరభాష సాహిత్యాన్ని అనువదించడంలో అనువధికునికి రెండు భాషలపై పట్టు, నిబద్ధత, నైపుణ్యత అవసరమన్నారు. ముఖ్యంగా విచక్షణ పాటించాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు. బహుముఖ భాషాప్రజ్ఞశాలి ఎల్.ఆర్.స్వామి కీలక ప్రసంగం చేశారు.
ఆసక్తిగా పత్రాలు సమర్పణ
అనంతరం ఏడు భాషల నుంచి పత్ర సమర్పణ కార్యక్రమం ఆసక్తిగా రేపింది. పత్ర సమర్చకులుగా హిందీ, ఇంగ్లీష్, ఒడియా, బెంగాళీ, కన్నడ, మళయాళీ, ఉర్దూభాల నుంచి తెలుగులోకి అనువాదాలపై రెండు భాగాలుగా సదస్సు జరిగింది. మొదటి సభను డాక్టర్ ఎ. శేషారత్నం(హిందీ) అధ్యక్షతన మహీధర రామశాస్త్రి(ఒడియా), రెండోది అబ్దుల్ వాహేద్(ఉర్ధూ) అనువాదాలపైన నిర్వహించారు. కవయిత్రి జగద్దాత్రి(తెలుగు నుంచి ఇంగ్లీష్) అధ్యక్షతన, రామతీర్ధ(బెంగాళీ), శాఖమూరు రాంగోపాల్(కన్నడ), మాటూరి శ్రీనివాస్(ఇంగ్లీష నుంచి తెలుగు)అనువాదాలపైన పత్రసమర్ఫణ చేశారు. పత్రసమర్ఫణ అనంతరం డాక్టర్ చాగంటి తులసి సమాపన ప్రసంగం చేశారు.
ఆకట్టుకున్న కథసంధి
సాయంత్రం జరిగిన సదస్సులో సీనియర్ పాత్రికేయుడు చింతకింది శ్రీనివాసరావు నిర్వహించిన కథా సంధి ప్రత్యేక కార్యక్రమం ఆకట్టుకుంది. తను రచించిన క£ý పఠనం, చర్చాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి,సాహిత్య విమర్శకుడు, అనువాదికుడు రామతీర్ధ మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగంలో విశేష ప్రాధాన్యత గల అనువాద కషులకు అభినందనలు తెలిపారు.సదస్సులో ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, కవులు ఆచార్య చందు సుబ్బారావు, ద్విభాష్యం రాజేశ్వరరావు పాల్గొన్నారు.