telugu stattes
-
తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లు ఇవీ
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రయాణికుల రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ మంగళవారం నుంచి పరిమిత సంఖ్యలో నడపనుంది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ మీదుగా నడిచే రైళ్లను రైల్వే అధికారులు ప్లాన్ చేశారు. అందులో తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. (రైలు బండి.. షరతులు ఇవేనండీ) మార్గం : బెంగళూరు–న్యూఢిల్లీ ట్రైన్ నెంబర్: 02691 సర్వీస్: డెయిలీ మధ్యలో నిలిచే స్టేషను: అనంతపురం, గుంతకల్లు జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్, నాగ్పూర్, భోపాల్, ఝాన్సీ ప్రారంభం: 12.05.2020 మార్గం : న్యూఢిల్లీ–బెంగళూరు ట్రైన్ నెంబర్: 02692 సర్వీస్: డెయిలీ మధ్యలో నిలిచే స్టేషను: ఝాన్సీ, భోపాల్, నాగ్పూర్, సికింద్రాబాద్ జంక్షన్, గుంతకల్లు జంక్షన్, అనంతపురం ప్రారంభం: 12.05.2020 మార్గం : చెన్నై సెంట్రల్–న్యూఢిల్లీ ట్రైన్ నెంబర్: 02433 సర్వీస్: శుక్రవారం, ఆదివారం మధ్యలో నిలిచే స్టేషన్లు: విజయవాడ, వరంగల్లు, నాగ్పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా ప్రారంభం: 15.05.2020 మార్గం : న్యూఢిల్లీ–చెన్నై సెంట్రల్ ట్రైన్ నెంబర్: 02434 సర్వీస్: బుధవారం, శుక్రవారం మధ్యలో నిలిచే స్టేషన్లు: ఆగ్రా, ఝాన్సీ, భోపాల్, నాగ్పూర్, వరంగల్లు, విజయవాడ ప్రారంభం: 13.05.2020 మార్గం : సికింద్రాబాద్–న్యూఢిల్లీ ట్రైన్ నెంబర్: 02437 సర్వీస్: బుధవారం మధ్యలో నిలిచే స్టేషన్లు: నాగ్పూర్, భోపాల్, ఝాన్సీ ప్రారంభం: 20.05.2020 మార్గం : న్యూఢిల్లీ–సికింద్రాబాద్ ట్రైన్ నెంబర్: 02438 సర్వీస్: ఆదివారం మధ్యలో నిలిచే స్టేషను: ఝాన్సీ, భోపాల్, నాగ్పూర్ ప్రారంభం:17.05.2020 -
‘తెలుగు రాష్ట్రాల్లో అద్భుత జ్యోతిష్య విజ్ఞానం’
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అద్భుతమైన జ్యోతిష్య విజ్ఞానం ఉందని, ఇది దేశవ్యాప్తం కావాలన్నదే ఆకాంక్ష అని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేదాలు ఎంత గొప్పవో ప్రపంచానికి తెలియకపోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో వేదం స్వరాలతో ఆగిపోయిందన్నారు. వేదం భాష్యం చెప్పుకునే వాళ్ళు, సంస్కృత పరిజ్ఞానం ఉన్నవాళ్లు, చందస్సు తెలిసినవాళ్ళు తగ్గిపోతున్న సమయంలో వేదం గొప్పతనం ప్రపంచంలో తగ్గిపోతోందన్నారు. ‘నేటికి కూడా జ్యోతిష్యం పేరుతో నక్షత్ర , భూ మండలం రెండింటి గురించి దశ దిశ నిర్ధేశం చేసి లక్షల కోట్లు ఖర్చు చేసి గ్రహణం ఎప్పుడు వస్తుందో విదేశాల్లో వెతుకుతారని.. ఓ సామాన్య వస్త్రధారణతో గ్రహణం గురించి చెప్పే దేశం ఏకైక దేశం భారతదేశం’ అని అన్నారు. రూపం లేని కాలానికి కొలత చంద్రమానం, సౌరమానం, మంత్రదష్టలు, రుషులు అందించిన అద్భుత సంపద మన జ్యోతిష్కులని అన్నారు. రూపం లేని కాలానికి ఎప్పుడు ఏమి జరుగుతుంది, గ్రహాల కలయిక, పరిణామాలు ఎలా ఉంటాయనే వివరాలు కేవలం 15, 20 రూపాయలతో దొరికే పంచాంగంలో నిక్షిప్తం చేసే జ్ఞానులు జ్యోతిష్కులని కొనియాడారు. భారత దేశం జ్యోతిష్కులు రుణం తీర్చుకోలేదన్నారు. జ్యోతిష్యం లేకపోతే సొంత కర్మలు, అగ్నిహోత్ర కర్మలు కూడా జరగవన్నారు. అగ్నిహోత్ర, వైదిక కర్మలకు జ్యోతిష్యమే ప్రధానమన్నారు. జ్యోతిష్యం అనేది సార్వత్రిక అనుభవం అని పేర్కొన్నారు. జ్యోతిష్యం పై ప్రభుత్వం ముందుకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల జ్యోతిష్కులతో సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ, టీటీడీ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఉగాది తర్వాత ఏర్పాటు చేయాలనే సంకల్పం ఉందని, అందుకు ప్రారంభ సూచకంగా సింహాద్రి అప్పన్న సన్నిధిలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఏర్పాటు చేసిందన్నారు. పండగల తిథుల్లో వచ్చే చిచ్చును మధ్యలో కొందరు నాస్తికులు అవహేళన చేస్తున్నారన్నారు. మీడియా చర్చల్లో నాస్తికుల అవహేళనకు సరైన వివరణ ఇవ్వలేని జ్యోతిష్యులు పాల్గొంటే జ్యోతిష్య శాస్త్రం శక్తి తగ్గిపోతుందన్నారు. కొత్త పంచాంగం రూపకల్పనలో రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు వచ్చేలా జ్యోతిష్యులు సహకరించాలని కోరారు. ఇతర దేశాలకు మార్గనిర్దేశనం: స్వాత్మానందేంద్ర మన దేశం ఇతర దేశాలకు గురుస్థానంలో ఉందని శారద పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర అన్నారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, నదులు, తీర్థాలు, విజ్ఞాన సంపదతో ఇతర దేశాలకు మనం దేశం మార్గ నిర్దేశనం చేస్తోందన్నారు. వేదాలు, వేదంగాల్లో జ్యోతిష్యం గొప్పదన్నారు. మన దేశమే కాదని, ఇతర దేశాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పరికరాలతో గ్రహస్థితులను తెలుసుకుని బయటకు వెల్లడిస్తారని.. కానీ పంచాంగకర్తలు మారుమూల గ్రామాల్లో, పట్టణాల్లో, చెట్ల కింద వేదంతో కూడిన గణిత శాస్త్రంతో అధ్యయనం చేసి సూర్య, చంద్ర గ్రహణాలు, గ్రహ స్థితిగతులను పంచాంగంలో పొందుపరుస్తారన్నారు. పంచాంగ రూపకర్తలు చెప్పినది నూటికి నూరు శాతం నిజమవుతున్నాయన్నది ప్రత్యక్ష అనుభవం అని తెలిపారు. సూక్ష్మమైన అంశాలను కూడా క్షుణ్ణంగా బాహ్య ప్రపంచానికి అందించే జ్యోతిష్యులు, పంచాంగ కర్తలు ఉండటం అందరి అదృష్టం అని స్వామి స్వాత్మానందేంద్ర పేర్కొన్నారు. -
మరోసారి నగదు కటకట!
ఒక్కసారిగా తగ్గిన రూ. 2,000 నోట్ల చలామణి సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు సమయంలో నగదు దొరకక తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలకు మరోసారి ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా బ్యాంకుల ఏటీఎంల ముందు నోక్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడం, ఇదే సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటం కూడా నగదు కొరతకు ప్రధాన కారణంగా బ్యాంకర్లు పేర్కొంటున్నారు. సహజంగా ఆర్థిక సంవత్సరం చివరి నెలల్లో లక్ష్యాలు చేరుకోవడానికి రుణాలు మంజూరు చేయడం, బిల్లుల చెల్లింపులు వంటివి ఉండటంతో నగదుకు డిమాండ్ అధికంగా ఉంటుందంటున్నారు. అలాగే పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి రూ. 2,000 నోట్ల చెలామణి ఒక్కసారిగా తగ్గిపోవడం గమనార్హం. బ్యాంకు నుంచి బయటకు వెళ్లిన తర్వాత పెద్దనోట్లు తిరిగి వెనక్కి రావడం లేదని ఒక ప్రభుత్వరం రంగ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకునే వారికి కేవలం రూ. 100 నోట్లు మాత్రమే ఇవ్వమని, రూ. 2,000, రూ. 5,00 నోట్లు ఇవ్వొద్దని ఉద్యోగులకు ఆదేశాలు వచ్చాయంటే పెద్ద నోట్ల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన బ్యాంకులతో పోలిస్తే దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐలో నగదు కొరత ఎక్కువగా కనిపిస్తుంటే, ప్రైవేటు బ్యాంకుల్లో నగదు కొరత కొంత తక్కువగా ఉంది. గత వారం రోజుల నుంచి నగదు సరఫరా కొంత తగ్గిన మాట వాస్తవమే కానీ, పరిస్థితులు చేయిదాటిపోయే విధంగా లేవని ఆంధ్రాబ్యాంక్ డీజీఎం కృష్ణారావు తెలిపారు. గురువారం రాష్ట్రానికి ఆర్బీఐ నుంచి రూ. 1,560 కోట్లు వచ్చాయని, ఈ మొత్తాన్ని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో పంపిణీ చేశామని చెప్పారు. పెద్ద నోట్లు రద్దు తర్వాత లావాదేవీలపై విధించిన వివిధ పరిమితులు సోమవారం నుంచి పూర్తి స్థాయిలో తొలగి పోనుండటంతో పరిస్థితులు చక్కబడతా యన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా పెద్ద నోట్ల రద్దు వల్ల ఏపీ నుంచి రూ. 71 వేల కోట్లు బ్యాంకులకు జమకాగా.. ఇప్పటివరకు కేవలం రూ. 39 వేల కోట్లు మాత్రమే రావడం గమనార్హం. రాష్ట్రంలోని బ్యాంకులలో నగదు కొరతపై సీఎం చంద్రబాబు గురువారం రాత్రి బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా ఇప్పటికే ఆర్బీఐకి లేఖ రాశానని, మరోసారి ఆర్బీఐ గవర్నర్కు లేఖ రాస్తానని చెప్పారు. రాష్ట్రానికి సరిపోయేలా నగదు సరఫరా పెంచాలని కోరనున్నట్లు తెలిపారు.