శ్రీనగర్ వరదల్లో తెలుగు విద్యార్థి గల్లంతు
జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో ముంచుకొచ్చిన వరదల్లో 60 మంది తెలుగు వాళ్లు చిక్కుకున్నారు. తాజాగా శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంతంలో కూడా భారీగా వరద నీరు చేరుకుంది. అనంతపురం జిల్లా కొత్తచెరువు ప్రాంతానికి చెందిన ముఖేష్ అనే ఎన్ఐటీ విద్యార్థి ఈ వరద నీటిలో పడి గల్లంతు అయినట్లు తెలిసింది. దాంతో ముఖేష్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.
ఈ పరిస్థితిని గమనించిన ఎన్ఐటీ అధికారులు.. వెంటనే విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి ఇలాగే సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్లు అతడి తల్లిదండ్రులు తెలిపారు.