పురాతన తెలుగు తాళపత్రం
అరుదైన తెలుగు తాళపత్ర గ్రంథమిది. దీనిపై ‘నవగ్రహమండలక్షణ’ అని రాసి ఉండటాన్ని గమనించవచ్చు! ఇది ఇంగ్లండ్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో కొలువుదీరి ఉంది. కర్ణాటకలో విసృ్తత ఆదరణ పొందిన దిగంబర జైనంపై అధ్యయనంలో భాగంగా బ్రిటిష్ ఇండియా తొలి సర్వేయర్ జనరల్ కొలిన్ మెకంజీ 1799-1810 మధ్య కాలంలో మైసూరు పరిసర ప్రాంతాల్లో సేకరించిన అనేకానేక తాళపత్రాల్లో ఇదొకటి. వీటితో పాటు కన్నడనాట సమకాలీన జైన మతపు తీరుతెన్నులను చిత్రించేలా ఆయన వేయించిన పెయింటింగులు, సేకరించిన వేలాది తాళపత్ర గ్రంథాలు, నాటి జైన మత పెద్దలతో మా ట్లాడి పొందుపరిచిన సంభాషణలతో కూడిన రికార్డుల వంటివన్నీ బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయిప్పుడు!