breaking news
Telusu Kada Movie
-
దీపావళి సినిమాలు.. జోరు మీదున్న హీరో.. వెనకబడ్డ సిద్ధు!
ఈసారి దీపావళి పండగ అక్టోబర్ 20వ తారీఖున వస్తోంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అప్పుడే పండగ మొదలైంది. తెలుగులో పోటాపోటీగా సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఒకటి ఉల్లిగడ్డ బాంబ్లా సౌండ్ చేస్తుంటే మరోటి చిచ్చుబుడ్డిలా వెలుగుతోంది. ఒకటైతే మందుగుండు లేని పటాకాలా మిగిలిపోయింది. అవేంటి? వాటి కలెక్షన్స్ ఏంటో చూద్దాం..రేసులో లేని మిత్రమండలిప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిత్రమండలి. అక్టోబర్ 16న రిలీజైన ఈ మూవీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్న చందంగా మారింది పరిస్థితి! మొదటిరోజే ఈ పటాకా ఎవరికీ నచ్చలేదు. ఇప్పుడిక వేరే సినిమాల ఆప్షన్స్ ఉండటంతో రేసులో చివరి స్థానానికి వెళ్లిపోయింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన మూవీ తెలుసు కదా. ఈ మూవీ అక్టోబర్ 17న విడుదలైంది. కథ బాగున్నా కాస్త ల్యాగ్ అవడంతో మిక్స్డ్ టాక్ అందుకుంటోంది.స్పీడు మీదున్న డ్యూడ్తొలి రోజు ఈ సినిమా రూ.3 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది జాక్ కంటే కూడా తక్కువ! అయితే మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లు కాస్త మెరుగయ్యాయని చెప్తున్నారు. ఇక అక్టోబర్ 17న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ (Dude Movie) కూడా రిలీజైంది. ఈ మూవీ సెకండాఫ్‌పై కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తున్నారు. ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లు రాబట్టిందని అధికారిక ప్రకటన విడుదల చేశారు.కె-ర్యాంప్ ఫస్ట్ డే కలెక్షన్స్అన్నిటికంటే ఆలస్యంగా (అక్టోబర్ 18న) వచ్చిన మూవీ కె-ర్యాంప్ (K-Ramp Movie). ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్టు దిగిందా? లేదా? అంటూ బరిలోకి దిగిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమాకు హిట్ టాక్ వస్తోంది. తొలిరోజు ఈ చిత్రానికి రూ.4.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని చిత్రయూనిట్ ప్రకటించింది. మరి ఏ సినిమా వసూళ్లు పెరగబోతున్నాయి? దీపావళి హిట్ బొమ్మ ఏదనేది చూడాలి! DAY 2 > DAY 1 for #TelusuKada ❤🔥DIWALI'S RADICAL BLOCKBUSTER sees massive growth on Saturday with housefulls all over 💥💥Book your tickets now!🎟️ https://t.co/QvC10IjSqS#LoveU2 #UnapologeticallyRadicalSTAR BOY @Siddubuoyoffl @NeerajaKona #RaashiiKhanna… pic.twitter.com/UdtkfHUrmu— People Media Factory (@peoplemediafcy) October 18, 2025 DUDE DIWALI BLAST is unstoppable at the box office with massive love from the audience ❤️#Dude collects a gross of 45 CRORES WORLDWIDE in 2 days & going super strong ❤🔥Book your tickets now and celebrate #DudeDiwali 🔥🎟️ https://t.co/JVDrRd4PZQ🎟️ https://t.co/4rgutQNl2n… pic.twitter.com/TLNPYTpNsV— Mythri Movie Makers (@MythriOfficial) October 19, 2025Box-Office daggara tana Mass Madness chupinchina Kumar Abbavaram 🤙🔥𝟰.𝟱 𝗖𝗿𝗼𝗿𝗲 Day1 GROSS for the 𝐃𝐈𝐖𝐀𝐋𝐈 𝐖𝐈𝐍𝐍𝐄𝐑 #KRamp 💥❤️🔥Grab Your Seats Now!!— https://t.co/nS9p8rSUlZ#KRampKaDiwali pic.twitter.com/BoeIifohez— Hasya Movies (@HasyaMovies) October 19, 2025చదవండి: కోటిలో బ్యాగులు అమ్ముకున్నా.. బాత్రూమ్లు కడిగా: ‘జబర్దస్త్’ కమెడియన్ -
‘తెలుసు కదా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నువ్వు ఎలా ఉన్నా బాగుంటావ్ నీరూ..!
-
తెలుసు కదా మూవీ రివ్యూ
టైటిల్: తెలుసు కదానటీనటులు:సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీనిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్రచన, దర్శకత్వం: నీరజ కోనసంగీతం: ఎస్. థమన్సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ విఎస్ఎడిటర్: నవీన్ నూలివిడుదల తేది: అక్టోబర్ 17, 2025డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకున్న స్టార్ బాయ్ సిద్ధుకి ‘జాక్’ భారీ షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘తెలుసు కదా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజ కోన తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ (Telusu Kada Movie Review)లో చూద్దాం.కథేంటంటే..స్టార్ హోటల్ లో చీఫ్ చెఫ్‌గా పనిచేసే వరుణ్ కుమార్(సిద్దు) అనాథ. కాలేజీ డేస్‌లో లవ్ బ్రేకప్ అవ్వడంతో అమ్మాయిలను ఎంత వరకు ప్రేమించాలనే విషయంలో క్లారిటీతో ఉంటాడు. భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాలని కోరుకుంటాడు. మ్యాట్రిమొనీ ద్వారా అంజలి(రాశి ఖన్నా)ని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికి పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ పెళ్లి తర్వాత అంజలికి పిల్లలు పుట్టరనే విషయం తెలుస్తుంది. కొన్నాళ్ల తర్వాత డాక్టర్ రాగా(శ్రీనిధి శెట్టి) ద్వారా సరోగసీతో తల్లి కావొచ్చనే విషయం అంజలికి తెలుస్తుంది. బిడ్డను మోసేందుకు డాక్టర్ రాగా ముందుకు వస్తుంది. కట్ చేస్తే.. కాలేజీ డేస్‌లో వరుణ్ ప్రేమించిన అమ్మాయినే డాక్టర్ రాగా. ఈ విషయం తెలిసి కూడా రాగా తన బిడ్డను మోసేందుకు ఒప్పుకుంటాడు వరుణ్. ఈ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాగా-వరుణ్ బ్రేకప్‌కి కారణం ఏంటి? తనను వదిలేసి వెళ్లిపోయిన రాగా పట్ల ఎంతో కోపం పెంచుకున్న వరుణ్.. ఆమె తన బిడ్డను మోసేందుకు ఎందుకు ఒప్పుకున్నాడు? రాగా-వరుణ్‌ల విషయం అంజలికి తెలిసిందా లేదా? మాజీ ప్రేయసి ఒకవైపు.. కట్టుకున్న భార్య మరోవైపు.. ఇద్దరి మధ్య వరుణ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? వరుణ్ కోరుకున్నట్లుగా చివరకు తండ్రి అయ్యాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. పెళ్లి అయిన తర్వాత తల్లికాలేని భార్య.. ప్రియుడి బాధను అర్థం చేసుకొని బిడ్డను మోసేందుకు ముందుకు వచ్చిన ప్రియురాలు.. వీరిద్దరిని హీరో ఎలా డీల్ చేశాడనేదే సినిమా కథ. ప్రేమ, ఈగో, ఎమోషన్స్ చుట్టూ కథనం తిరుగుతుంది. దర్శకురాలు నీరజ కోన ఎంచుకున్న పాయింట్ కాస్త కొత్తగా ఉన్నా.. కొన్ని చోట్ల హీందీ చిత్రం చోరి చోరి చుప్కే చుప్కే పోలికలు కనిపిస్తాయి. మెచ్యూర్డ్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారు కానీ.. ప్రియురాలే బిడ్డను కనేందుకు ముందుకు రావడం అనే లైన్‌ని సినిమా చూసే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేదానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. కొన్ని సున్నితమైన విషయాలను కూడా కాస్త బోల్డ్‌గానే చూపించారు. ఈ విషయంలో దర్శకురాలిని అభినందించాల్సిందే. కానీ కథనాన్ని ఆసక్తికరంగా మలచడంలో మాత్రం కొంతవరకే సఫలం అయ్యారు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. హీరో బ్రేకప్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పెళ్లి గురించి ప్లాన్ చేయడం.. ఈ క్రమంలో అంజలిని కలవడం.. ఇద్దరి ఇష్టాలు ఒకేలా ఉండడంతో పెళ్లి చేసుకోవడం.. పిల్లలు పుట్టరనే విషయం తెలిసే వరకు కథనం సింపుల్‌గానే సాగుతుంది. రాగా ఎంట్రీ తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. బిడ్డను మోసేందుకు తనే ముందుకు రావడంతో తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఇక సెకండాఫ్ మొత్తం వరుణ్, రాగా, అంజలిల చుట్టే తిరుగుతుంది. వరుణ్, రాగాల గురించి అంజలికి తెలిసిన తర్వాత ఏం జరిగిందనేదే సెకండాఫ్ స్టోరీ. ఫస్టాప్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. ముగ్గురి మధ్య వచ్చే సీన్లు రొటీన్‌గానే ఉంటాయి. కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తాయి. అయితే సినిమాలోని డైలాగ్స్ అన్ని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తాయి. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం బాగుంటుంది. ఎవరెలా చేశారంటే..ఈగో, ఎమోషన్స్‌తో కూడిన వరుణ్ పాత్రలో సిద్దు ఒదిగిపోయాడు. శ్రీనిధి, రాశీ ఖన్నాలతో సిద్దు కెమిస్ట్రీ తెరపై బాగా పండింది. ప్రేమ, పెళ్లి వద్దు.. ఉన్నంత సేపు సంతోషంగా గడిపి తర్వాత ఎవరిదారి వారు చూసుకుందామనే అమ్మాయి రాగా పాత్రకి శ్రీనిధి న్యాయం చేసింది. హీరో భార్య అంజలిగా రాశీ ఖన్నా చక్కగా నటించింది. వైవా హర్ష తన కామెడీ ఇమేజ్‌కి భిన్నంగా, డిఫరెంట్ ఫ్రెండ్ పాత్రలో మెప్పించాడు. చిన్న చిన్న డైలాగ్స్‌తో నవ్వులు పూయించాడు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అయితే ఆ బీజీఎం మొత్తం ఇటీవల వచ్చిన ఓజీ సినిమాను గుర్తు చేస్తుంది. జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ కి రిచ్ నెస్ తీసుకొచ్చింది. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
శ్రీనిధి.. ఎంత అందంగా ఉంటుందో తెలుసు కదా! (ఫోటోలు)
-
మీ ఫేవరేట్ హీరో ఎవరు?.. సిద్ధు జొన్నలగడ్డ ఏమన్నారంటే?
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఆయన హీరోగా వస్తోన్న రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ తెలుసుకదా. ఇప్పటికే ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీప్రసాద్ నిర్మించారు.రిలీజ్‌కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో సిద్ధు సరదాగా నెటిజన్లతో ముచ్చటించారు. ట్విట్టర్ వేదికగా ఆస్క్ సిద్దు పేరుతో చిట్ చాట్ నిర్వహించారు. నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధనాలిచ్చారు సిద్ధు. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ గురించి సైతం పలువురు అడిగారు. అంతేకాకుండా మీ ఫెవరేట్ హీరో ఎవరని కూడా ప్రశ్నించారు. దీనికి సిద్ధు తన నచ్చిన హీరో రణ్‌బీర్ కపూర్ అంటూ ఆన్సరిచ్చారు. ఫ్యాన్ బాయ్ మూమెంట్ త్వరలోనే జరగనుందని రిప్లై ఇచ్చాడు. Ranbir kapoor ! Fan boy moment Yet to happen— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) October 16, 2025 -
యూత్‌కి ప్రేమ సలహాలు.. అబ్బాయిలు.. ఏడ్చినా పర్లేదు, కానీ!
టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తెలుసు కదా (Telusu Kada Movie). రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం జరిగింది. ఈ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ నేటి యువతరానికి ముఖ్యమైన సందేశం ఇచ్చాడు. మరీ ముఖ్యంగా అబ్బాయిలకు లవ్బ్రేకప్ అయినప్పుడు ఏం చేయాలో సలహా ఇచ్చాడు.ఆడవారి కోసం యుద్ధాలుసిద్ధు ఏమన్నాడంటే.. ఈ సృష్టి మొదలైందే ఆడవారితో! మీకోసం యుద్ధాలు జరిగాయని చరిత్ర చెప్తోంది. మీ ముందు మేము నిమిత్తమాత్రులం! మేము ఎప్పుడైనా తెలియక ఏవైనా తప్పులు చేస్తే పెద్దమనసుతో క్షమించేయాలి. మీరు గొప్ప.. మీవల్ల మేము గొప్ప. ఇప్పుడు అబ్బాయిలకు సీరియస్‌గా ఓ విషయం చెప్తున్నా.. ఎప్పుడైనా ఒకమ్మాయి మీ మనసు ముక్కలు చేసి వెళ్లిపోయిందంటే.. తనను వెళ్లిపోనివ్వండి. లేదని వెంటపడ్డారనుకోండి. మీ ఆత్మగౌరవాన్ని మీరు కోల్పోయినట్లే లెక్క! ఎంత వెంటపడితే అంత మర్యాద కోల్పోతారు.ఏం పర్లేదు, ఏడ్వండి..ఆత్మగౌరవం ముఖ్యమని గుర్తుంచుకోండి. అమ్మాయి దూరమైతే బాధేస్తుంది. హృదయం ముక్కలవుతుంది, ఎందుకిలా అయిందని ఏడుస్తాం.. ఏం పర్లేదు బాధపడండి. కానీ, అప్పుడే వరుణ్ (తెలుసు కదాలో హీరో పాత్ర)లాంటివాడు మీలో నుంచి బయటకు వస్తాడు. మన ఎమోషన్స్ ఎప్పుడూ మన కంట్రోల్లో ఉండాలి. మీకింకా డౌట్స్ ఉంటే తెలుసు కదా సినిమా చూడండి. వరుణ్ అన్నింటికీ ఆన్సర్ ఇస్తాడు అని సిద్ధు చెప్పుకొచ్చాడు.చదవండి: బిగ్‌బాస్‌లో మాధురి కొత్త రూల్స్.. నచ్చకపోతే వెళ్లిపోమని వార్నింగ్! -
‘తెలుసు కదా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వరుణ్ పాత్రకి గుడ్ బై చెప్పడం బాధగా ఉంది
‘‘తెలుసు కదా’ సినిమాలో నేను చేసిన వరుణ్ పాత్ర ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్, సైకలాజికల్ వయొలెన్స్ ని జనరేట్ చేస్తుంది. ఏడాదిగా వరుణ్ అనే రాడికల్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను... ఆ పాత్రకి గుడ్ బై చెప్పడం బాధగా ఉంది’’ అని హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు. ఆయన హీరోగా, శ్రీనిధీ శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘ఈ దీపావళికి మా ‘తెలుసు కదా’. ప్రియదర్శి ‘మిత్రమండలి’, కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాలు విడుదలవుతున్నాయి. మంచి సినిమా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘మా సినిమా తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు శ్రీనిధి. ‘‘తెలుసు కదా’ నా మనసుకు దగ్గరైన సినిమా’’ అని రాశీ ఖన్నా పేర్కొన్నారు. ‘‘మా సినిమాని బిగ్ స్క్రీన్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని కృతీ ప్రసాద్ చెప్పారు. ‘‘ఈ సినిమా అద్భుతంగా రావడానికి కారణం నిర్మాతలే’’ అన్నారు నీరజ కోన. -
‘తెలుసు కదా’ సినిమా ప్రెస్ మీట్లో సిద్ధు జొన్నలగడ్డ (ఫొటోలు)
-
ఆమె ఎవరో తెలియదు.. నేను పట్టించుకోను : సిద్ధు జొన్నలగడ్డ
ఈ మధ్య సినిమా ప్రెస్‌మీట్స్‌లో కొంతమంది జర్నలిస్టులు అడిగే ప్రశ్నలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. సెలెబ్రిటీలను కించపరుస్తూ ప్రశ్నలు అడిగితే తాము కూడా ‘సెలెబ్రిటీ’అయిపోతామనే అపోహతో కాంట్రవర్సీ ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda )ను ఓ మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై నెటిజన్స్ ఘోరంగా మండిపడ్డారు. ‘తెలుసు కదా’ సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్న సిద్దుని ఓ మహిళా జర్నలిస్ట్ ‘మీరు నిజ జీవితంలో స్త్రీలోలుడా(వుమనైజర్) ’ అని అడగడంతో స్టేజ్‌పై ఉన్న సిద్ధుతో పాటు తోటి జర్నలిస్టులకు కూడా ఒక్కసారి షాకయ్యారు. ఇది నా పర్సనల్ ఇంటర్వ్యూ కాదు సినిమా ఇంటర్వ్యూ అని సిద్ధు కాస్త ఘూటుగానే ఆమెకు సమాధానం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మహిళా జర్నలిస్టు ప్రశ్నను తప్పుపడుతూ పలువురు నెటిజన్స్ కామెంట్ చేశారు. తాజాగా ఈ వివాదంపై మరోసారి సిద్ధు స్పందించారు.తెలుసు కదా సినిమా ప్రచారంలో భాగంగా నేడు మీడియాతో ముచ్చటించిన సిద్దు.. ‘వుమనైజర్’ ప్రశ్నపై మరోసారి స్పందించారు. ‘అమె అలా మాట్లాడడం అగౌరవం. మైకు ఉంది కదా అని ఏది పడితే అది అడగడం కరెక్ట్ కాదు. ఆమె అలా అడిగి..నవ్వుతున్నారు కూడా. అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు పద్దతిగా వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు. మైకు తీసుకోగానే మారిపోయారు. సినిమా రిలీజ్ ఉంది కదా..ఏం అయినా అడగొచ్చు అనుకోవడం కరెక్ట్ కాదు. సినిమాకు రియల్ లైఫ్‌కి తేడా ఉంటుంది. సినిమాలో హీరో అండర్ కవర్ పోలీసు అయితే..బయట కూడా ఎన్కౌంటర్ చేయడు కదా? డ్రగ్స్ తీసుకునే పాత్రలో నటిస్తే..బయట కూడా డ్రగ్స్ తీసుకుంటాడని అనుకుంటామా? సినిమాకి బయటకు తేడా తెలియదా? సీనియర్ జర్నలిస్టులు పద్దతిగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్లు ఇలా ఉండడం కరెక్ట్ కాదు. తమిళ హీరో ప్రదీప్‌ని కూడా ఆమెనె ఏదో అడిగారని, ఇష్యూ అయిందని చూశాను. అలాంటి వాటిపై ఆలోచించడం వేస్ట్. ఇలాంటి ప్రశ్నలు నన్ను ఇబ్బంది పెట్టలేవు. ఆ విషయంలో నేను చాలా స్ట్రాంగ్. పెద్దగా పట్టించుకోను. నా పనిపై నేను ఫోకస్ పెడతా’ అని సిద్దు చెప్పుకొచ్చాడు. కాగా సిద్దు నటించిన తెలుసు కదా మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మీరు ఉమెనైజరా..? ఇచ్చిపడేసిన సిద్ధూ
-
ఆ పదం బూతు అని నిజంగా తెలియదు.. రాశీ ఖన్నా క్యూట్ కామెంట్స్!
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం తెలుసు కదా. ఈ దీపావళికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాడు. కాస్ట్యూమ్ డిజైనర్ కోన నీరజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 17 థియేటర్లలోకి రానుంది.అయితే ఇటీవల మూవీ ప్రమోషన్లకు హాజరైన రాశి ఖన్నా ఓ బూతు పదాన్ని మాట్లాడింది. ఆమె మాట్లాడిన ఆ పదం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైంది. మూవీ ప్రచారంలో భాగంగా పిచ్చి ము..ని కాదంటూ కామెంట్స్ చేసింది. అయితే తాజాగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ రాశీ ఖన్నా దీనిపై క్లారిటీ ఇచ్చింది. అది బూతు పదమని తనకు తెలియదని చెప్పుకొచ్చింది. అదొక క్యూట్ వర్డ్ అనుకున్నానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత దీనిపై హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆ పదాన్ని బామ్మ క్యారెక్టర్‌కు వాడినట్లు వివరించారు. రాశీని బామ్మ అలానే పిలుస్తుందని అన్నారు. అది క్యూట్ వర్డ్ అనుకొని మాట్లాడేశానని రాశీ ఖన్నా తెలిపింది. కానీ ఆ తర్వాత అది బూతు పదమని తెలిసిందని వెల్లడించింది. ప్రస్తుతం రాశీ ఖన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. I'm not laughing like a pichi munda.:- #RaashiKhannapic.twitter.com/yBHxJGldHs— Milagro Movies (@MilagroMovies) October 11, 2025 "నాకు అది బూతు అని తెలియదు..I thought it was a Cute Word."– #RaashiiKhanna | #TelusuKada pic.twitter.com/vdwYblQgqy— Whynot Cinemas (@whynotcinemass_) October 13, 2025 -
సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నిజ జీవితంలో అమ్మాయిల పిచ్చి ఉందా?.. సిద్ధు షాక్!
డీజే టిల్లు సినిమాతో సెన్సేషన్ అయ్యాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). టిల్లు స్క్వేర్తో మరో పెద్ద హిట్ అందుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన జాక్ మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఇప్పుడు తెలుసు కదా చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సోమవారం (అక్టోబర్ 13) చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒకేసారి ఇద్దరమ్మాయిల్ని ప్రేమించారా?ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో హీరో సిద్ధుకు ఊహించని ప్రశ్న ఎదురైంది. రియల్ లైఫ్‌లో మీరు స్త్రీలోలుడా? టీనేజ్‌లో ఒకేసారి ఇద్దరమ్మాయిలను ప్రేమించడం లాంటివేమైనా చేశారా? అని ఓ మహిళా విలేఖరి ప్రశ్నించింది. అది విని సిద్ధుకు మండిపోయింది. ఇది సినిమా ఇంటర్వ్యూనా? నా పర్సనల్ ఇంటర్వ్యూనా? అని కోప్పడ్డాడు. ఈ మధ్యే తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్పైనా సదరు మహిళా జర్నలిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళ హీరోను కించపరుస్తూ..మీరు హీరోలానే ఉండరు, రెండు సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిందంటే.. అది మీ హార్డ్ వర్కా? లేక అదృష్టమా? అని ప్రశ్నించారు. వెంటనే శరత్ కుమార్ మైక్ అందుకుని ఆమె ప్రశ్నను తప్పుపడుతూ కౌంటరిచ్చాడు. కిరణ్ అబ్బవరం సైతం స్పందిస్తూ... పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోలను అలా కించపరిచే ప్రశ్నలు అడగొద్దని విజ్ఞప్తి చేశాడు. బిగ్‌బాస్ షోలో నాగార్జున సైతం.. ప్రదీప్‌ను రజనీకాంత్, ధనుష్‌తో పోలుస్తూ అతడు ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి ఎదుగుతాడని మెచ్చుకున్నాడు.చదవండి: యూరిన్ తాగి 48 రోజులు బతికాడు: హీరో -
సిద్ధు 'తెలుసు కదా' ట్రైలర్ రిలీజ్
'డీజే టిల్లు' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'తెలుసు కదా'. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు కాగా.. కాస్ట్యూమ్ డిజైనర్ కోన నీరజ ఈ చిత్రంతో దర్శకురాలిగా మారారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా.. ఈ శుక్రవారం(అక్టోబరు 17) థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)ట్రైలర్లో అయితే స్టోరీ ఏంటనేది అస్సలు రివీల్ చేయలేదు. ఎమోషన్స్ ఎప్పుడూ మన కంట్రోల్లోనే ఉండాలి. ప్రేమించిన వాళ్లకు అస్సలు ఇవ్వకూడదు అనుకునే మనస్తత్వం. అలాంటిది ఇద్దరమ్మాయిలతో రిలేషన్లోకి వెళ్తాడు. వాళ్లిద్దరూ కలిసి అంటే ముగ్గురు జర్నీ చేస్తారు? ఇంతకీ వీళ్ల మధ్య ఏం జరిగింది? అనేదే తెలియాలంటే మూవీ చూడాలి. చూస్తుంటే రెగ్యులర్ లవ్ స్టోరీలా అయితే అనిపించట్లేదు. మరి సిద్ధు ఈసారి ఏం చేస్తాడో చూడాలి?ఈ సినిమాతో పాటు ఇదే వీకెండ్లో మరో మూడు మూవీస్ కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. అవే 'మిత్రమండలి', 'డ్యూడ్', 'కె ర్యాంప్'. ఈ చిత్రాల ట్రైలర్స్ ఇప్పటికే రిలీజ్ కాగా, ఇవి కూడా బాగానే అనిపించాయి. మరి వీటిలో ఏది హిట్ అవుతుంది? ప్రేక్షకుల మనసు ఏది గెలుచుకుంటుందనేది చూడాలి? గత నెలలో టాలీవుడ్‌కి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు రాబోయే సినిమాల బట్టి ఈనెల కూడా కలిసొస్తుందా లేదా అనేది తేలుతుంది.(ఇదీ చదవండి: సాయంత్రం 6 గంటలకే వచ్చాడుగా ఏమైంది? మురుగకి సల్మాన్ కౌంటర్) -
తొలిప్రేమ.. ఆ అమ్మాయి ఇన్‌స్టా ఇప్పటికీ చూస్తుంటా: సిద్ధు
టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా చిత్రం ‘తెలుసు కదా’ (Telusu Kada). ఈ మూవీ అక్టోబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా సిద్ధు పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రేమ కథను పంచుకున్నారు. ‘తెలుసు కదా’ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, టి.జి.కృతిప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు.ఇద్దరిని ప్రేమించిన ఓ యువకుడి స్టోరీతో తెలుసు కదా చిత్రం తెరకెక్కింది. అయితే, తన నిజ జీవితంలోని ప్రేమకథను కూడా సిద్ధు జొన్నలగడ్డ ఇలా పంచుకున్నారు. 'నేను ఏడో తరగతిలోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. పదో తరగతి వరకు కలిసి చదువుకున్నాం. కానీ, ఆ అమ్మాయితో నా ప్రేమ గురించి చెప్పలేదు. ఇంతలోనే పదో తరగతి పరీక్షలు పూర్తి అయ్యాయి. చివరి రోజున శ్లామ్ బుక్ తీసుకొని తన వద్దకు వెళ్లాను. ఒక కొటేషన్‌తో పాటు తన ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ కూడా అందులో రాసింది. చివరిసారిగా నా నుంచి వెళ్తూ.. ఓ లుక్ ఇచ్చి సైకిల్‌పై వెళ్లిపోయింది. ఇప్పటికీ ఆ సీన్ నా కళ్ల ముందే తిరుగుతుంది. కానీ, ఆ తర్వాత కూడా ఎప్పుడూ నా ప్రేమ విషయాన్ని ఆమెతో పంచుకోలేదు. కొన్నేళ్ల తర్వాత తనకు పెళ్లి కూడా అయిపోయింది. పిల్లలు కూడా పుట్టేశారని తెలిసింది. ఆమెతో నేరుగా మాట్లాడకపోయినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రొఫైల్ అప్పుడప్పుడు చూస్తుంటాను.' అని సిద్ధు చెప్పాడు. -
నేను చాలా లక్కీ: రాశీ ఖన్నా
‘‘ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తున్నాను. నేను చాలా లక్కీ. టాలీవుడ్‌కి తిరిగొచ్చి, మళ్ళీ వరుస సినిమాలు చేస్తుండటం అనేది తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఓ నటిగా నాకు దర్శక– నిర్మాతల్లో ఏర్పడిన గుర్తింపు వల్లేనని నమ్ముతున్నా’’ అని హీరోయిన్ రాశీ ఖన్నా అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించగా, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో రాశీ ఖన్నా పంచుకున్న సంగతులు. ⇒ ‘తెలుసు కదా’ కథను దర్శకురాలు నీరజగారు చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఇది రెగ్యులర్ లవ్‌స్టోరీ కాదు. అందుకే ఒప్పుకున్నాను. నాకు తెలిసి ఈ తరహా ప్రేమకథా చిత్రం ఇప్పటివరకు రాలేదు. ఇందులో మేం ఓ కొత్త పాయింట్‌ని టచ్ చేశాం.⇒ ‘తెలుసు కదా’లో నేను అంజలి అనే పాత్రలో కనిపిస్తాను. కథలో మా ముగ్గురి (సిద్ధు, అంజలి, రాశీ) పాత్రలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ సినిమా ఆడియన్స్‌కు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. నీరజ బాగా డైరెక్ట్ చేశారు. ఓ మహిళా దర్శకురాలితో నేను పని చేయడం ఇదే తొలిసారి. అయినా డైరెక్షన్‌కి మేల్, ఫీమేల్ అనే తేడాల్లేవ్. ⇒ క్రమశిక్షణతోనే జీవితంలో ఎదగగలమని నమ్ముతాను. అందుకే నేను ఎప్పుడూ క్రమశిక్షణగా ఉంటాను. అలాగే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ఫిట్‌గా ఉండటం ముఖ్యం. నేను ఎప్పుడూ వర్కౌట్స్, సరైన డైట్‌తో ఫిట్‌గా ఉండాలనుకుంటాను. ఇక ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’పై నాకు నమ్మకం లేదు. అదో ఆకర్షణ అనుకుంటాను. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమకు ఉన్న పరిమితులు వంటి అంశాలను ‘తెలుసు కదా’లో ప్రస్తావించాం. ⇒ పవన్ కల్యాణ్‌గారి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చేస్తున్నాను. హిందీలో చేసిన ‘120 బహదూర్’ చిత్రం నవంబరు 21న విడుదలవుతుంది. విక్రాంత్ మెస్సేతో లవ్ స్టోరీ ఫిల్మ్, మాధవన్‌తో టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేశాను. ‘ఫర్జీ 2’ సిరీస్ చేస్తున్నాను. అలాగే ఒక ఓటీటీ ప్రాజెక్ట్‌లో లీడ్‌గా నటించాను. -
అప్పట్నుంచే తెలుగు నేర్చుకుంటున్నా!: శ్రీనిధి శెట్టి
‘‘నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో కొంతమంది తెలుగు ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. వారిని అడిగి తెలుగు పదాలు, వాక్యాలు ఓ లిస్ట్‌గా రాసుకుని, నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పట్నుంచే తెలుగు మాట్లాడటం అలవాటైంది. సినిమా సెట్స్‌లో తెలుగువాళ్లను తెలుగులోనే మాట్లాడమని చెప్పి, నేను కూడా వారితో తెలుగులోనే మాట్లాడతాను. అయితే తెలుగులో నేను ఇంకాస్త బెటర్ కావాలి.అందుకే ‘తెలుసు కదా’ చిత్రానికి డబ్బింగ్ చెప్పలేకపోయాను. ఇకపై నా ప్రతి సినిమాకు నేనే డబ్బింగ్ చెబుతాను’’ అని హీరోయిన్ శ్రీనిధి శెట్టి అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనిధి శెట్టి చెప్పిన సంగతులు. ⇒ ‘తెలుసు కదా’ మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు అనగానే అందరూ ఇది ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మూవీ అనుకుంటారు. కానీ ఇందులో మేం ఓ కొత్త అంశాన్ని చూపించాం. ఆ అంశం ఏమిటి? అనేది థియేటర్స్‌లో చూసినప్పుడు ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు. వరుణ్ (సిద్ధు పాత్ర పేరు), రాగ (శ్రీనిధి), అంజలి (రాశీ ఖన్నా) క్యారెక్టర్స్‌కు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. మా పాత్రల్లో కొంచెం గ్రే షేడ్స్ ఉన్నాయి. దర్శకురాలు నీరజ విజన్ ప్రేక్షకులకు నచ్చుతుంది. ⇒ తెలుగులో నా తొలి సినిమాగా ‘హిట్ 3’ విడుదలైంది. కానీ తెలుగులో నేను సైన్ చేసిన తొలి సినిమా ‘తెలుసు కదా’. ‘కేజీఎఫ్, కోబ్రా, హిట్ 3’ వంటి వరుస యాక్షన్ సినిమాలు చేసిన తర్వాత చేసిన రొమాంటిక్ మూవీ ‘తెలుసు కదా’ నాకు కొత్తగా అనిపించింది. ఇందులో నేను పోషించిన రాగ పాత్రకు, రియల్ లైఫ్‌లో నాకు పెద్దగా పోలికలు లేవు.⇒ ఓ నటిగా అన్ని రకాల జానర్ సినిమాలు చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా కమిట్ అయ్యాను. -
ప్రతిరోజూ నేర్చుకోవడం నాకు ఇష్టం: నీరజ కోన
‘‘స్కూల్ డేస్ నుంచే నాకు రైటింగ్ అంటే ఇష్టం. కథలు చెప్పడం ఇంకా ఇష్టం. అలా కొన్ని కథలు రాసుకున్నాను. నా స్నేహితులు రానా, నాని వంటివారు బాగా సపోర్ట్ చేశారు. ఒక దశలో సినిమా కథ రాయగలననే నమ్మకం కలిగింది. అలా రాసుకున్న కథే ఈ ‘తెలుసు కదా’’ అని అన్నారు నీరజ కోన. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో ఆమె పంచుకున్న విశేషాలు...⇒ ‘తెలుసు కదా’ మంచి ప్రేమ కథా చిత్రం. ప్రేమకథతోపాటు ఒక కాంప్లెక్స్ సిటీ కూడా ఉంది. నేను మహిళా దర్శకురాలిని కనుక ఈ సినిమా కథను మహిళా దృష్టి కోణంలో చెప్పలేదు. నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాం. ఫస్ట్ సిట్టింగ్‌లోనే నా కథను సిద్ధు జొన్నలగడ్డ ఓకే చేయడం, దర్శకురాలిగా నాకు అవకాశం రావడం నా లైఫ్‌లో మెమొరబుల్ మూమెంట్. ⇒ సిద్ధుపై టిల్లు క్యారెక్టర్ షాడో ఉండొచ్చు. కానీ, తను మంచి పెర్ఫార్మర్. ఈ సినిమాలో స్క్రీన్ పై తను పోషించిన వరుణ్పాత్రని మాత్రమే ఆడియన్స్ చూస్తారు. కథలో కాంప్లెక్స్‌గా ఉండే రాగపాత్ర కోసం శ్రీనిధిని తీసుకున్నాం. మెచ్యూర్డ్ క్యారెక్టర్ అంజలిపాత్రకి రాశి సరిపోయారు. టీజీ విశ్వప్రసాద్‌గారు లేకపోతే ఈ సినిమాయే లేదు. ఈ సినిమా ప్రయాణంలో కృతీ ప్రసాద్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ బ్యాక్ బోన్ .⇒ నేను ఏ సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయలేదు. కానీ, కాస్ట్యూమ్ డిజైనర్‌గా 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నా కెరీర్ స్టార్టింగ్‌లోనే ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ, విజయ్, సూర్య వంటి టాప్ హీరోలు చేసిన సినిమాలకు పని చేశాను. అదే నా లెర్నింగ్ స్కూల్, ఎక్స్పీరియన్స్. ప్రతిరోజూ నేర్చుకోవడం నాకు ఇష్టం. ఇప్పటికీ నేను ప్రతిదీ నా తొలి సినిమా అన్నట్లుగా భయం, టెన్షన్ తో పనిచేస్తుంటాను. దర్శకురాలిగా నా తర్వాతి చిత్రం కూడా లవ్‌స్టోరీనే. త్వరలోనే వివరాలు చెబుతాను. -
నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి
'కేజీఎఫ్' సినిమాతో హీరోయిన్గా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి.. తర్వాత అడపాదడపా దక్షిణాదిలో మూవీస్ చేస్తోంది. ఈ ఏడాది నాని 'హిట్ 3'తో వచ్చింది. సక్సెస్ అందుకుంది. ఇప్పుడు 'తెలుసు కదా' అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అక్టోబరు 17న థియేటర్లలో రానున్న ఈ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ తనని ఫ్రెండ్స్ అందరూ లేడీ ప్రభాస్ అని పిలుస్తారని చెప్పింది. అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టింది.'నేను ప్రభాస్‌లా సోషల్ మీడియాలో ఎక్కువ ఉపయోగించను. అందుకే నా స్నేహితులందరూ నన్ను లేడీ ప్రభాస్ అని పిలుస్తుంటారు' అని శ్రీనిధి శెట్టి చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయమై ప్రభాస్ అభిమానులు భిన్నంగా స్పందిస్తుంటారు. తమ ఫేవరెట్ హీరోకి లేడీ వెర్షన్ అంటే అనుష్కనే అవుతుందని మాట్లాడుకుంటున్నారు. అయితే శ్రీనిధి శెట్టి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓవైపు నిశ్చితార్థం.. మరోవైపు 'గర్ల్‌ఫ్రెండ్' రిలీజ్ ఫిక్స్)శ్రీనిధి కెరీర్ విషయానికొస్తే.. 2018 నుంచి ఇప్పటివరకు ఐదు సినిమాలు మాత్రమే చేసింది. కేజీఎఫ్ రెండు పార్ట్స్ హిట్ అయ్యాయి. తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' చేసింది. ఇది ఫ్లాప్ అయింది. తెలుగులో నానితో చేసిన 'హిట్ 3' ఆకట్టుకుంది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా'లో ఓ హీరోయిన్గా చేసింది. ఈ మూవీ హిట్ అయితే ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్సుంది.త్రివిక్రమ్-వెంకటేశ్ సినిమా కోసం ఈమెను హీరోయిన్గా తీసుకున్నారనే రూమర్ వినిపించింది. దీని గురించే 'తెలుసు కదా' ప్రమోషన్లలో అడగ్గా.. ఈ ప్రాజెక్ట్ విషయంలో తనని ఎవరు సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ ఆ ఆఫర్ వస్తే మాత్రం తప్పకుండా తాను నటిస్తానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్.. ఈ రోజుల్లో పెద్ద జోక్!)