temple committees
-
ఇక ఆలయాలపై పచ్చ నేతల కర్రపెత్తనం
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని గుళ్లనూ అధికార పార్టీ నేతలకు పంచిపెట్టబోతోంది. గ్రామాల్లోని టీడీపీ నేతలకు గుళ్లపై కర్రపెత్తనం అప్పగించేందుకు వీలుగా వెయ్యి గుళ్లకు పాలకమండళ్లను నియమించడానికి గత శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర దేవదాయ శాఖ పరిధిలో 22 వేలకు పైగా ఆలయాలు ఉన్నప్పటికీ.. ఆదాయం లేదన్న సాకుతో వేలాది ఆలయాల్లో ప్రభుత్వం కనీసం దేవదాయ శాఖ సిబ్బందిని కూడా నియమించలేదు. ఆదాయం బాగా ఉండే 4,459 ఆలయాల్లో మాత్రమే కార్యనిర్వాహక అధికారులు (ఈవోలు)/గుడి మేనేజర్లను నియమించింది. వీటిలో మాత్రమే దేవదాయ శాఖ సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ ఈ 4,459 ఆలయాలతో కలిపి మొత్తం 5052 ఆలయాలకు పాలకమండళ్లను నియమించాలని నిర్ణయించడం గమనార్హం. ఇప్పటికే వీటిలో 1955 ఆలయాలకు పాలకమండళ్లను నియమించింది. తాజాగా గత శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసిన వెయ్యి ఆలయాలు కలిపి మొత్తం 1201 ఆలయాలకు నియామక ప్రక్రియ పురోగతిలో ఉంది. మిగిలిన ఆలయాల్లోనూ పాలకమండళ్ల నియామకానికి దేవదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తోంది. నాలుగున్నరేళ్లుగా దార్మిక పరిషత్ ఏర్పాటే లేదు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం కంటే హిందూ మతంపై పూర్తి విశ్వాసం ఉండే రిటైర్డ్ న్యాయమూర్తులు, ఆలయాలకు భారీ దానాలిచ్చే దాతలు, మఠాధిపతులు, స్వామీజీల పెత్తనంలో దేవదాయ శాఖ ఉండాలనే ఉద్దేశంతో 2007లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేశారు. దేవదాయ శాఖ మంత్రితోపాటు మొత్తం 27 మంది సభ్యులుండే ధార్మిక పరిషత్ చెప్పిన ప్రకారమే దేవదాయ శాఖ పనిచేయాల్సి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తోపాటు అన్ని ఆలయాల్లో నిత్య పూజా కైంకర్యాలతోపాటు జమాఖర్చులపై పూర్తి పర్యవేక్షణ, పాలక మండళ్ల నియామకం వంటి వాటిపై ధార్మిక పరిషత్ చేసే సూచనలే శిరోధార్యం. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లుగా ధార్మిక పరిషత్ ఏర్పాటుపై దృష్టి పెట్టలేదు. ఆలయాలపై ప్రభుత్వానికి సమాంతరంగా ధార్మిక పరిషత్ పెత్తనం ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేయని ప్రభుత్వం ఇప్పుడు పాలకమండళ్ల నియామకాలకు మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం చూపుతోంది. చంద్రబాబు ప్రభుత్వం మరో ఆరు నెలలు మాత్రమే అధికారంలో ఉంటుంది.. కానీ పాలకమండళ్లను మాత్రం రెండేళ్ల కాలపరిమితికి నియమిస్తుండటం గమనార్హం. దేవాలయాలపై టీడీపీ నేతల పెత్తనానికే.. దేవాలయాల పాలకమండళ్లకు ఎంపికవుతున్న టీడీపీ నేతలు దేవుడి సొమ్మును దిగమింగడానికి అర్చకులు, దేవదాయ శాఖ ఉద్యోగులపై కర్రపెత్తనం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కణుపురం శివాలయంలో పనిచేసే మల్లిఖార్జున శర్మ అనే అర్చకుడు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొంటూ చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వేదాంతం కృష్ణకిశోర్ అనే అర్చకుడు ఆలయ మాజీ ధర్మకర్తలు తనను వేధింపులకు గురి చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ఆవేదన వెళ్లగక్కారు. విజయవాడ దుర్గమ్మ గుడిలో ఆలయ ఈవోలుగా పనిచేసిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు అక్కడి నుంచి బదిలీ కావడం వెనుక ఆలయ పాలక మండలి సభ్యులతో వారికి పొసగకపోవడమే కారణమనే వార్తలు వినిపించాయి. -
‘ధర్మకర్తల’ నియామకానికి నోటిఫికేషన్
ఐదేళ్ల తర్వాత దేవాలయాల పాలకమండళ్లకు మోక్షం తాండూరు: నామినేటెడ్ పదవుల కోసం ఎప్పటినుంచో నిరీక్షిస్తున్న టీఆర్ఎస్ నేతలకు ఇది తీపి కబురు. దేవాలయాలకు కొత్త పాలకమండళ్ల ఏర్పాటుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎట్టకేలకు ఐదేళ్ల తరువాత దేవాలయాల పాలక మండళ్లకు మోక్షం కలిగింది. ఆయా దేవాలయాల ధర్మకర్తల నియామకం కోసం తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎన్.శివశంకర్ సోమవారం నోటీఫికేషన్ జారీ చేశారు. ఈనేపథ్యంలో ఇప్పటికే నామిటెడ్ పదవుల రేసులో ఉన్న గులాబీ శ్రేణులు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశాయి. తాండూరు నియోజకవర్గంలో శ్రీభావిగి భద్రేశ్వర్, శ్రీపోట్లీ మహారాజ్, శ్రీకాళికాదేవి, శ్రీనగరేశ్వర(తాండూరు పట్టణం), శ్రీజుంటుపల్లి రామస్వామి దేవాలయం(యాలాల మండలం), కోత్లాపూర్ శ్రీరేణుకా ఎల్లమ్మ(తాండూరు మండలం) దేవాలయాల ధర్మకర్తల నియామకం కోసం కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ధర్మకర్తలుగా నియామకం కోసం ఆసక్తి ఉన్నవారు నోటిఫికేషన్ జారీ అయిన 20 రోజుల్లోపు కమిషనర్, సంయుక్త కమిషనర్లకు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. -
ఖర్చెంతైనా సై..!
జిల్లా టీడీపీలో నామినేటెడ్ పదవుల కోసం పైరవీలు వుడా,మార్కెట్,దేవాలయ కమిటీలు, గ్రంథాలయసంస్థ చైర్మన్ పోస్టులపై గురి లాభదాయక పదవులకు రూ.4 కోట్లలోపు ఖర్చుకు రెడీ సాక్షి, విశాఖపట్నం: జిల్లా టీడీపీలో నామినేటెడ్ పదవులకోసం పోటీ ఎక్కువవుతోంది. పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న శ్రేణులు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏదో ఒక పదవిని దక్కించుకునేందుకు తీవ్రంగా పావులు కదుపుతున్నారు. ఎవరికివారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దేవాలయ ట్రస్ట్ బోర్డులు,పాలకమండళ్లు, గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీలు, జీసీసీ, వుడా చైర్మన్ పదవులు, తదితర కీలక పదవులపై గురిపెట్టారు. ఎమ్మెల్యేలు,మంత్రులద్వారా పని చేయించుకునేందుకు బారులు తీరుతున్నారు. లాభదాయకమైన పోస్టుల కోసం కోట్లు వెచ్చించడానికైనా సై అంటున్నారు. కీలకమైన నామినేటెడ్ పోస్టు రూ.2 కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు ధర పలుకుతోంది. ఏ పదవైనా ఓకే... : జిల్లాలో సుమారు 4,200 నామినేటెడ్ పదవులున్నాయి. వాటిల్లో అధిష్టించి ఉన్న వారందరినీ తప్పుకోవాలని ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఒకవేళ రాజీనామా చేయకపోతే బలవంతంగానైనా తప్పిస్తామంటోంది. దీంతో సుమారు 412 పదవులు ఖాళీ కా నున్నాయి. ముఖ్యంగా జిల్లాలో 45 ఆలయాలకు పాలకమండళ్లు ఉన్నాయి. ఈ పదవులను కైవసం చేసుకోవాలని నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)ల్లో ప్రస్తుతం 30 మంది ఉన్నారు. నాలుగింటిలో అసలు నియామకాలు లేవు. వీటన్నింటిలో ఎలాగైనా పదవులు దక్కించుకోవడానికి నియోజకవర్గాల వారీ టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. 1700 మందికిపైగా ఆదర్శరైతుల ను తొలగిస్తుండడంతో వాటిపైనా కన్నేశారు. అన్నింటికి మించి అత్యధిక ఆదాయం ఇచ్చే ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలు 1500 వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఉద్యోగాల్లో ఉన్న వారిని తప్పిస్తుండడంతో ఏదొక మండలంలో పోస్టింగ్ కోసం నేతలు,కార్యకర్తలు ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా విశాఖలో అత్యంత కీలకమైన వుడా చైర్మన్ పోస్టు సుమారు పదేళ్ల నుంచి ఖాళీగా ఉంది. ఇటీవల ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు దీని కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇదికాక జీసీసీ పోస్టు కోసం టిక్కెట్ దక్కని సీనియర్ నేతలు హైదరాబాద్‌కు వెళ్లి మరీ ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రంథాలయసంస్థ చైర్మన్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ఇలా సుమారు అన్నీ కలిపి నాలుగువేలకుపైగా చిన్నాపెద్దా పదవులుండడంతో వీటిలో ఏదొకటి సా ధించేందుకు నేతలు పైరవీలు సాగిస్తున్నారు. లాభదాయకమైన పదవుల విషయంలో పోటీ మరీ తీవ్రంగా ఉంది. వీటికి ఎంతైనా ఖర్చుచేయడానికి నేతలు వెనుకాడడంలేదు. -
వీరహనుమాన్ విజయయాత్ర