నేటి నుంచి ఎములాడ జాతర
తొలిసారి గుడి సమాచారం కోసం మొబైల్ యాప్
సాక్షి, సిరిసిల్ల: ప్రముఖ శైవక్షేత్రం, దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామి దేవస్థానం శివరాత్రి మహా జాతరకు ముస్తాబైంది. ఈనెల 23 నుంచి 25 వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి దాదాపు ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడ్డాక వచ్చిన తొలిసారిగా వచ్చిన శివ రాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు ఉత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల కోసం ప్రత్యే కంగా భీమేశ్వరాలయం పక్కన సాంస్కృతిక కళాప్రదర్శనలు నిర్వహించనున్నారు.
అందుబాటులోకి మొబైల్ యాప్..
శ్రీ రాజరాజేశ్వరస్వామి భక్తుల కోసం తొలి సారి ‘వేములవాడ మహాశివరా త్రి’మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. టోల్‌ఫ్రీ నంబర్ 18004252037ను ఏర్పాటు చేశారు.