ఆన్లైన్లో ఆలయాల సేవలు
శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణస్వామిని దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ కుటుంబ సభ్యులతో కలసి గురువారం దర్శించుకున్నారు. అలాగే, కల్లేపల్లి మణినాగేశ్వరి శివాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... శ్రీ కూర్మం, అరసవల్లి, శ్రీముఖలింగం ఆలయాలను పర్యాటకంలో భాగంగా అభివృద్ధి చేస్తే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. దేవాలయాల్లో సేవలన్నింటినీ ఆన్లైన్ ద్వారా అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.