టెంపో - జీపు ఢీ: నలుగురికి గాయాలు
రాజంపేట (వైఎస్సార్ జిల్లా): వేగంగా వెళ్తున్న టెంపో వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న జీపును ఢీ కొట్టింది. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం జైపాస్ రోడ్డులో జరిగింది. వివరాలు.. మద్యం సేవించి డ్రైవర్ టెంపో నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ రెండు కాళ్లు విరిగిపోయాయి.
అంతేకాకుండా జీపులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.