ఏపీలో ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ జారీ
ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4 వరకు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను అధికారులు శనివారం ప్రకటించారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరుగుతాయి. రాత పరీక్షలు మార్చి 11వతేదీ నుంచి మార్చి 31 వరకు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీ క్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు.
ప్రాక్టికల్స్‌కు 1,689 కేంద్రాలు, థియరీ పరీక్షలకు 1,413 కేంద్రాలను కేటాయించారు. ప్రాక్టికల్ పరీక్షలకు 2,90,466 మంది విద్యార్ధులు హాజరు కానున్నారు. మొదటి ఏడాదిలో ఒకేషనల్ విద్యార్ధులు 26,900 మంది, రెండో ఏడాదిలో 28,914 మంది ఉన్నారు. నీతి, మానవ విలువలకు సంబంధించి జనవరి 28వతేదీన, పర్యావరణ విద్య పరీక్ష జనవరి 31న ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు ఉంటాయి. ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఏడాది పరీక్షలకు 9,89,240 మంది హాజరు కానున్నారు.