పవన్ పోరాడితే మా ఎంపీల మద్దతు: సుజాత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాన్ని మంత్రి పీతల సుజాత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడువేల అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తూ ఆమె సంతకం చేశారు. నూతన రాజధాని అమరావతిని భ్రమరావతిగా విమర్శించడం సరికాదని మంత్రి సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీలపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. హోదాపై పవన్ పోరాడితే టీడీపీ ఎంపీలంతా మద్దతిస్తారని అన్నారు.