ten percent
-
అగ్రవర్ణ కోటాపై ఇప్పుడే ఆదేశాలివ్వం: సుప్రీం
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ల కేసుపై ప్రస్తుత తరుణంలో తాము ఏ ఆదేశాలూ ఇవ్వదలచుకోవడం లేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ నెల 28న ఈ కేసుకు సంబంధించిన వాదనలను తాము వింటామనీ, రాజ్యాంగ ధర్మాసనానికి దీనిని బదిలీ చేయాలా, వద్దా అన్న విషయాన్ని కూడా అప్పుడే పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ ఇప్పటికే పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వారందరి కేసుల్లోనూ ఈ విషయాన్ని తాము తర్వాత పరిశీలిస్తామంటూ అన్ని పిటిషన్లనూ సుప్రీంకోర్టు వాయిదా వేస్తుండటం తెలిసిందే. ఈ పిటిషన్లపై స్పందన తెలపాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు గతంలోనే నోటీసులు పంపింది. ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌పై పిటిషన్లు కొట్టివేత ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హం చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కేంద్రం పొడిగించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) ఆర్డినెన్స్‌ను గత ఏడాది సెప్టెంబర్ 19న ప్రభుత్వం జారీ చేసింది. దీని ప్రకారం.. ముస్లిం పురుషుడు తన భార్యకు మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులివ్వడం శిక్షార్హం అవుతుంది. ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభ వద్ద పెండింగ్‌లో ఉంది. -
పేదల కోటాపై స్టేకు సుప్రీం నో
న్యూఢిల్లీ: జనరల్ కేటగిరీలోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో ఇటీవల కల్పించిన 10 శాతం రిజర్వేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కానీ ఈ కోటాకు వీలుకల్పిస్తున్న రాజ్యాంగ సవరణ చట్ట చెల్లుబాటును పరిశీలించేందుకు అంగీకరించింది. 10 శాతం రిజర్వేషన్ల అమలు నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వ స్పందన కోరుతూ బెంచ్ శుక్రవారం నోటీసులు జారీచేసింది. జనహిత అభియాన్, యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థలు ఈ పిటిషన్లను వేశాయి. ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ..ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు ఆర్థిక స్థితిగతులు మాత్రమే ప్రాతిపదిక కావొద్దని యూత్ ఫర్ ఈక్వాలిటీ తన పిటిషన్లో పేర్కొంది. 50 శాతమే ఉండాలన్న రిజర్వేషన్ల పరిమితిని తాజా చట్టం ఉల్లంఘిస్తోందని గుర్తుచేసింది. ‘ఎస్సీ/ఎస్టీ చట్ట సవరణ’పై యోచన ఎస్సీ, ఎస్టీ(సవరణ) వేధింపుల నిరోధక చట్టం–2018పై కేంద్ర ప్రభుత్వ సమీక్షతోపాటు, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలించనున్నట్లు కోర్టు తెలిపింది. ఎస్సీ/ఎస్టీ వేధింపుల చట్టం తీవ్రంగా దుర్వినియోగం అవుతోందనీ, ఈ చట్టం కింద దాఖలైన ఫిర్యాదులపై తక్షణం ప్రభుత్వ ఉద్యోగులను కానీ ఇతరులను కానీ అరెస్టు చేయరాదంటూ గత ఏడాది కోర్టు ఆదేశాలిచ్చింది. మరోవైపు, క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించినప్పు డు జరిగే ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్‌లలో డబ్బు వెంటనే వాపసు అయ్యేలా చూడాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే, పిటిషనర్ ముందుగా ఈ సమస్యను ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. -
రైల్వేలో పేదల కోటా కింద 23 వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల పేదల(ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్‌ను అమలుచేయబోయే తొలి ప్రభుత్వ విభాగంగా భారతీయ రైల్వే నిలవబోతోందని ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాబోయే రెండేళ్లలో దాదాపు 23,000 మందికి ఈ కోటా కింద ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. ఆరు నెలల్లోగా 1.31 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామనీ, రాబోయే రెండేళ్లలో మరో లక్ష ఉద్యోగుల్ని తీసుకుంటామని పేర్కొన్నారు. 2019–20 మధ్యకాలంలో 53 వేల మంది, 2020–21 కాలంలో 46 వేల మంది ఉద్యోగులు రైల్వేశాఖ నుంచి పదవీ విరమణ చేయబోతున్నారని తెలిపారు. -
అవినీతి.. అస్థిరత.. వ్యతిరేకభావం
ముంబై/ మర్గోవా: కోల్‌కతా వేదికగా సంఘీభావం తెలిపిన ప్రతిపక్ష నేతలది అవినీతి, వ్యతిరేకభావం, అస్థిరతలతో కూడిన మహాకూటమి అని ప్రధాని మోదీ అభివర్ణించారు. పేద వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తాము తీసుకున్న వచ్చిన చట్టంతో ప్రతిపక్షాలకు నిద్ర కరువైందన్నారు. గతంలో బలహీనంగా ఉన్న భారత్ బీజేపీ నాలుగున్నరేళ్ల పాలనలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిందని చెప్పారు. ఆదివారం ఆయన మహారాష్ట్రలోని కొల్హాపూర్, హట్కనంగ్లే, మాధా, సతారా, దక్షిణ గోవా లోక్‌సభ నియోజకవర్గాల బూత్ స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మహాకూటమి నేతలది ధనబలం కాగా తమది ప్రజాబలం అన్నారు. తమ కూటమి 125 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, ఆశలు, కలలతో ముడిపడి ఉందన్నారు. ‘కోల్‌కతా సభా వేదికపై ఉన్న వారంతా బడా నేతల కుమారుడు/కుమార్తె లేదా తమ కుమారుడు/కుమార్తెను రాజకీయాల్లోకి తేవాలని ఆశపడే వారే. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పై నమ్మకం లేని వారు ఇప్పుడు ప్రజాస్వామ్యంపై బహిరంగంగా ఉపన్యాసాలిస్తున్నారు’ అని దెప్పి పొడిచారు. ఎన్నికల్లో అన్ని రకాల అక్రమాలకు పాల్పడటమే వారి లక్ష్యమన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తప్పదని ముందుగానే ఊహించిన ప్రతిపక్షాలు ఈవీఎంలను సాకుగా చూపాలనుకుంటున్నాయి. పెట్టుబడిదారులు, కుంభకోణాలు, అవినీతి, అపనమ్మకం, అస్థిరతల కలయికే మహాకూటమి’ అని ఎద్దేవా చేశారు. బలహీనం నుంచి అభివృద్ధివైపు పయనం గత ప్రభుత్వాల పాలనతో బీజేపీ నాలుగున్నరేళ్ల పాలనను పోలుస్తూ ప్రధాని.. ‘బీజేపీ అధికారంలోకి వచ్చే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. విద్యుత్ కొరత, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. కుంభకోణాల గురించిన వార్తలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పేరు వినబడేది. ఇప్పుడు కుంభకోణాల(స్కాంల) ప్రస్తావనే లేదు. కేవలం కొత్త పథకాల(స్కీంల) గురించే చర్చ జరుగుతోంది. గత నాలుగున్నరేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారింది. ప్రపంచం ఇప్పుడు భారత్‌ను నమ్మకం, విశ్వాసంతో చూస్తోంది. అప్పట్లో దేశంలోని 98 శాతం మందికి టాయిలెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది’ అని తెలిపారు. పేదలకు రిజర్వేషన్లతో విపక్షాలకు నిద్ర కరువు ఆర్థికంగా బలహీన వర్గాల వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పంతో ప్రతిపక్ష నేతలకు నిద్ర కరువైందని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘మా నిర్ణయానికి తగు కారణం లేనట్లయితే, వాళ్లకు అశాంతి కరువయ్యేది కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలు, పుకార్లను వ్యాప్తి చేసేందుకు రంగంలోకి దిగేవాళ్లు. వాళ్లు అలా చేయడం లేదంటే దానర్ధం.. దేశ ప్రజల కోసం ప్రభుత్వం మంచి పని చేసిందనే కదా’ అని అన్నారు. రిజర్వేషన్ల కారణంగా సీట్ల కొరత తలెత్తకుండా ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో సీట్ల సంఖ్యను పది శాతం పెంచుతున్నట్లు వివరించారు. ‘ప్రతి ఒక్కరూ సమాన అవకాశాలు పొందాలన్నదే తమ అభిమతం. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం రిజర్వేషన్లపై చట్టం చేసిందన్న ప్రతిపక్షాల విమర్శలపై ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయాన్ని తాము ఎప్పుడు ప్రకటించినా వాళ్లు ఇలాంటి ఆరోపణలే చేసే వారని వ్యాఖ్యానించారు. -
క్రైస్తవులకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలి
విజయవాడ(గాంధీనగర్) : క్రైస్తవులకు అన్ని రంగాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పించాలని క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.జీవరత్నం డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రైస్తవులు సమాజంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిరుపేద పాస్టర్లకు నెలకు రూ.5వేల ఆర్థిక సాయం అందించాలని, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. క్రైస్తవులపై దాడులను అరికట్టాలన్నారు. క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర కోశాధికారి చింతా శాంతకుమార్, కో–ఆర్డినేటర్ వల్లూరి రవికుమార్, నాయకులు గద్దల ఆదాం, వర్ల రాజా పాల్గొన్నారు. · -
పదిశాతం పెరిగిన బస్సు చార్జీలు
ప్రయాణికులపై ఏడాదికి రూ.18 కోట్ల భారం మెదక్: ప్రభుత్వం ఇటీవల పెంచిన ఆర్టీసీ చార్జీలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలో మీటర్ల లోపు రూ.1లు అదనంగా వసూలు చేస్తే, ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్, సూపర్ లగ్జరీలు పదిశాతం అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో జిల్లా ప్రజలపై ఏడాదికి రూ.18కోట్ల అదనపు భారం పడుతుంది. జిల్లాలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, నారాయణఖేడ్, గజ్వేల్, జహీరాబాద్ డిపోల్లో మొత్తం 618 బస్సులు ఉన్నాయి. గతకొంతకాలంగా ఆర్టీసీ నష్టాల్లో ఉంది. గత రెండేళ్లుగా కరువు కాటకాలతోపాటు కార్మికులకు పెంచిన వేతన సవరణతో గత ఏడాది జిల్లాలో ఆర్టీసీకి రూ.10కోట్ల నష్టాల్లోకి కూరుకు పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నష్టం వందల కోట్లు . కాగా ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలు ఈనెల 27వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఆర్డీనరీ, పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలో మీటర్లలోపు రూ.1చార్జీ పెరగా, ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్, సూపర్ లగ్జరీలకు మాత్రం ఓవరాల్‌గా పదిశాతం అదనపు చార్జీలు పెంచారు. దీంతో జిల్లా ప్రయాణికులపై నెలకు రూ.1.5కోట్లు, ఏడాదికి రూ.18కోట్లు అదనపు భారం పడుతుంది. గతంలో మెదక్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం వెళ్లేందుకు లగ్జరీ బస్సు చార్జీ రూ.561 ఉండగా, ప్రస్తుతం రూ.612లకు పెరిగింది. ఈ లెక్కన ఒకవ్యక్తికి రూ.51లు పెరిగాయి. అలాగే కాకినాడకు గతంలో రూ.588లుండగా, ప్రస్తుతం రూ.646లకు పెరిగింది. ఈలెక్కన ఒక్కో వ్యక్తిపై రూ.58లను అదనంగా వసూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌కు కిలో రూ.8పైసలు, డిలక్స్కు రూ.9పైసలు, సూపర్‌లగ్జరీ రూ.11పైసలు, ఇంద్రలో రూ.14పైసలు, గరుడలో రూ.16పైసల చొప్పున వసూలు చేస్తున్నారు. ఈలెక్కన ఓవరాల్‌గా బస్సు చార్జీలు 10 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. పెరిగిన బస్సుచార్జీలతో బస్సు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ ధరలు పెరుగుతున్నాయి.. రాష్ట్రంలో నిత్యావసర ధరలతోపాటు డీజిల్, పెట్రోల్, కరెంట్, బస్సుచార్జీలు పెరిగాయి. అసలే కరువుతో కొట్టుమిట్టాడుతుంటే...పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. బస్సుల్లో ప్రయాణం చేయాలంటేనే భయమేస్తోంది. -సంతోష్, ప్రయాణికుడు, కరీంనగర్. మోయలేనిభారం.. పేద, సామాన్య ప్రజలు మోయలేని భారాన్ని ప్రభుత్వం మోపుతోంది. బస్సుచార్జీలు నామమాత్రమేనంటూ 10 శాతం పెంచారు. ఇక కరెంట్ చార్జీలు ఏమేరకు పెరుగుతాయనే ఆందోళన నెలకొంది. ధరల పెరుగులతో పేదప్రజలు మరింత పేదలుగానే మారుతున్నారు. -దుర్గారెడ్డి, ప్రయాణికుడు, చిట్కుల్