tenpin
-
టెన్‌పిన్ బౌలింగ్ విజేతలు కిరణ్, జ్యోతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్‌పిన్ బౌలింగ్ చాంపియన్‌షిప్‌లో కిరణ్, జ్యోతి ఆకట్టుకున్నారు. తెలంగాణ టెన్‌పిన్ సంఘం ఆధ్వర్యంలో ఇనార్బిట్ మాల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో కిరణ్, నరేశ్... మహిళల కేటగిరీలో జ్యోతి, మమత వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. ఇందులో మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను త్వరలో బెంగళూరు వేదికగా జరుగనున్న జాతీయ టెన్‌పిన్ బౌలింగ్ టోర్నీలో పాల్గొనే తెలంగాణ జట్టుకు ఎంపిక చేశారు. ఐదు రోజుల పాటు పోటీలు జరగ్గా....100కు పైగా ప్లేయర్లు పాల్గొన్నారు. శుక్రవారం ఫైనల్స్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమానికి విచ్చేసిన ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టెన్‌పిన్ బౌలింగ్ సంఘం కార్యదర్శి రాహుల్ రెడ్డి, సినీ నటుడు శ్రీధర్, రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ సంఘం అధ్యక్షుడు భరత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
టెన్ పిన్ చాంప్స్ జగన్, సింధూర
హైదరాబాద్: కార్పొరేట్ టెన్‌పిన్ బౌలింగ్ టోర్నమెంట్లో జగన్ రావు (కాగ్నిజెంట్), సింధూర జ్యోతి (సింక్రొని ఫైనాన్సియల్) టైటిల్స్ చేజిక్కించుకున్నారు. మంగళవారం ఇనార్బిట్‌మాల్‌లోని స్మాష్ బౌలింగ్ సెంటర్లో జరిగిన ఈ పోటీల్లో పురుషుల విభాగంలో జగన్ రెండు గేముల్లో కలిసి 367 పాయింట్లు సాధించాడు. రమేశ్ మణికంఠ (ఇన్ఫోసిస్) 361 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. అనిల్ తుడు (ఇన్ఫోసిస్, 327 పాయింట్లు)కు మూడో స్థానం దక్కింది. మహిళల విభాగంలో సింధూర జ్యోతి రెండు గేముల్లో కలిసి 277 పాయింట్లతో అగ్రస్థానం పొందింది. డెలాయిట్‌కు చెందిన జ్యోతి హెగ్డే (257 పాయింట్లు), శష్వి యాదవ్ (249 పాయింట్లు) వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ట్రోఫీలు అందజేశారు. ఇందులో 16 కార్పొరేట్ కంపెనీలకు చెందిన 50 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. 33 మంది పురుషుల కేటగిరీలో, 17 మంది మహిళల కేటగిరీలో తలపడ్డారు.