Terracotta museum
-
తెలుగు గడ్డపై అశోకుడు కాలుమోపాడా?
సాక్షి, హైదరాబాద్: భారత ఉపఖండాన్ని అత్యద్భుతంగా ఏలిన మౌర్య రాజ్య చక్రవర్తి అశోకుడు మన ప్రాంతంలో కాలుమోపాడా?.. ఇప్పటివరకు పెద్దగా ఆధారాల్లేవు. గతంలో తెలుగుగడ్డపై అశోకుడి కాలం నాటి వందలకొద్దీ నాణేలు లభించాయి తప్ప ఎక్కడా ఆయన పర్యటన జాడలు బయల్పడలేదు. కానీ, మంజీరా నది ఏడుపాయల ప్రాంతంలో ఉన్న కుల్చారం వద్ద ఇటీవల పరిశోధకులకు లభించిన టెర్రకోట ముక్కపై ఉన్న ‘దేవానా’ అనే బ్రాహ్మీ లిపి అక్షరాలు దీనిపై ఆసక్తి పెంచుతున్నాయి. దేవానాంపియ (దేవానాంప్రియ) అనేది అశోకుడి బిరుదు. దేవుడికి ప్రీతికరమైన వ్యక్తిగా తననుతాను అశోకుడు అభివర్ణించుకున్నాడని అంటారు. దేశవ్యాప్తంగా చాలా ఏళ్లనుంచి లభిస్తున్న శాసనాల్లో దేవానాంపియ పదం తప్ప ఎక్కడా అశోకుడి పేరుండదు. దీంతో తొలుత ఆ పేరుతో రాజు ఉండేవాడని చరిత్రకారులు భావించారు. కానీ హైదరాబాద్ సంస్థానంలో భాగమైన రాయచూరు సమీపంలోని మస్కీలో 1915లో లభించిన శాసనంలో దేవానాంపియ అనేది తన పేరుగానే అశోకుడు పేర్కొన్నట్టుగా ఉన్న శాసనం లభించింది. బ్రిటిష్ ఇంజనీర్ బీడన్ ఈ శాసనాన్ని చూడగా, నాటి ఎపిగ్రఫిస్ట్ కృష్ణశాస్త్రి నిపుణుల ద్వారా దాని గుట్టు విప్పారు. దీంతో దేవానాంపియ అంటే అశోకుడే అని ప్రపంచానికి తెలిసింది. ఏపీలోని అమరావతి, కర్నూలు సమీపంలోని రాజులమందగిరి, అనంతపురం దగ్గరి ఎర్రగుడిలో అశోకుడి శాసనాలు లభించాయి. తాజాగా, దేవానాంపియ పదంలో ‘దేవానా’ అన్న అక్షరాలున్న టెర్రకోట ముక్క కుల్చారం సమీపంలో లభించింది. మిగతా అక్షరాలున్న భాగం విరిగిపోయి ఈ ముక్క మాత్రమే మిగిలి ఉంటుందని దాన్ని గుర్తించిన శంకర్రెడ్డి, నాగరాజు, అరుణ్కుమార్తో కూడిన బృందానికి నేతృత్వం వహించిన పరిశోధకుడు ఎం.ఎ.శ్రీనివాసన్ తెలిపారు. ఇది క్రీ.పూ.3వ శతాబ్దానికి చెంది ఉంటుందని తెలిపారు. తవ్వకాలు జరిపితే.. తెలంగాణ ప్రాంతంలో మౌర్యుల కాలం నాటి వందలకొద్దీ నాణేలు గతంలో లభించాయి. 1921లో కరీంనగర్ ప్రాంతంలో ఒకేసారి 420 పంచ్మార్క్డ్ నాణేలు దొరికాయి. మిగతా ప్రాంతాల్లోనూ మరిన్ని లభించాయి. కానీ అశోకుడి బిరుదుతో ఉన్న టెర్రకోట లభించటం ఇదే తొలిసారి. అది బౌద్ధ స్తూపానికి చెందిన ఫలకంగా భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే స్తూపం ఆనవాళ్లు లభించవచ్చని అభిప్రాయపడుతున్నారు. తన హయాంలో అశోకుడు వేలసంఖ్యలో స్తూపాలు వేయించాడు. ఈ ప్రాంతానికి ఆయన వచ్చినట్టు గుర్తుగా స్తూపం ఉండి ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రాంతానికి కిలోమీటరు దూరంలో శాతవాహనుల కాలానికి చెందినదిగా భావిస్తున్న రాతిగుహ బయల్పడింది. అక్కడి రాతిగుండుపై ‘హెనమో బుద్ధేయ’, ‘ధర్మ’, ‘హే జమ’ అన్న పదాలు బ్రాహ్మీ లిపిలో లిఖించి ఉన్నాయి. -
ఆ దొంగతనంతో చైనా హర్టయ్యింది
వాషింగ్టన్ : బొటనవేలు దొంగతనం చేసినందుకు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది. అయితే అది మనిషిది కాదు సుమీ... చారిత్రక నేపథ్యం ఉన్న టెర్రా కోట్టా యుద్ధవీరుడి విగ్రహానిది. ఫిలడెల్ఫియాలోని ఫ్రాంక్లిన్ ఇనిస్టిట్యూట్ మ్యూజియంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... గతేడాది డిసెంబర్ 21 మ్యూజియంలో ఓ పార్టీ వేడుకలు జరిగాయి. దీనికి పెద్ద ఎత్తున్న విద్యార్థులు హాజరయ్యారు. వారంతా టెర్రా-కొట్టా వారియర్ ఎగ్జిబిషన్లో వారంతా కలియదిరిగారు. దానికి బియర్ ప్రాంతానికి చెందిన చెందిన మైకేల్ రోహనా అనే విద్యార్థి కూడా హజరయ్యాడు. అంతా ఫోటోలు దిగుతున్న సమయంలో మెల్లిగా ఓ విగ్రహాం వద్దకు వెళ్లి దాని బొటనవేలును విరిచేశాడు. దానిని తన జేబులో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సుమారు 4.5 మిలియన్ డాలర్ల విలువైన విగ్రహం కావటంతో ఏకంగా పోలీస్ శాఖా ఎఫ్బీఐ సాయం కోరింది. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా ఎఫ్బీఐ అతన్ని గుర్తించే ప్రయత్నం చేసింది. దాదాపు నెలన్నరకు పైగా విచారణ చేపట్టి చివరకు అతన్ని అరెస్ట్ చేసింది. బోటనవేలును అతని నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆపై రోహనా బెయిల్ పై విడుదలయ్యాడు. కాగా, ఈ ఘటనపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. షాంక్సి కల్చరల్ హెరిటేజ్ ప్రమోషన్ సెంటర్.. అమెరికా విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. ‘అది మా జాతి గౌరవానికి సంబంధించింది. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించటం దారుణం. ఈ కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలి’ అని పేర్కొంది. FBI says a US man stole the thumb of a 2,200-year-old Chinese terracotta warrior statue being displayed at the Franklin Institute pic.twitter.com/ZwzRrSq8V2 — CGTN (@CGTNOfficial) 18 February 2018 టెర్రా-కొట్టా మ్యూజియాలు... చైనాకు చెందిన బలమైన సైన్యం టెర్రా-కొట్టా సుమారు 2 వేల సంవత్సరాల క్రితం నాటిది. చైనా తొలి చక్రవర్తి క్విన్ షీ హువాంగ్ సమాధికి రక్షణగా ఈ టెర్రా-కొట్టా యుద్ధవీరుల విగ్రహాలను నిర్మించారు. 1974లో ఓ రైతు వీటిని గుర్తించటంతో వెలుగులోకి వచ్చింది. అందులోని కొన్ని విగ్రహాలను ప్రపంచంలోని వివిధ మ్యూజియాలకు తరలించి ప్రదర్శిస్తున్నారు. తమ సంప్రదాయాలకు, చరిత్రకు గుర్తుగా చైనా వీటికి అపూర్వ గౌరవం ఇస్తోంది. -
టెర్రకోట మ్యూజియం సందర్శన
చైనా మొదటి చక్రవర్తి క్విన్ షి హువాంగ్ సైన్యంలోని యుద్ధవీరులు, గుర్రాల టైటా ప్రతిమలున్న ప్రఖ్యాత మ్యూజియంను మోదీ సందర్శించారు. మ్యూజియంలోని ప్రతిమలను ఆసక్తిగా పరిశీలించిన మోదీ గంటకుపైగా గడిపారు. ఈ మ్యూజియం ప్రాంగణాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ఐరాస ప్రకటించింది. ఇక్కడ దాదాపు 8వేల మంది సైనికుల, 130 రథాల, 520 గుర్రాల ప్రతిమలున్నాయి.