ఆర్టీసీ సమ్మె.. గంగుల ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
సాక్షి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మృతితో కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆస్పత్రి వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ థామస్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గోశామహల్ స్టేషన్‌కు తరలించారు. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో తొమ్మిదో రోజుకు చేరింది. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
(చదవండి : బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేస్తారా?)
మంత్రి గంగుల ఇంటి వద్ద ధర్నా..
ఆర్టీసి డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యతో కార్మికులు ఆందోళన ఉధృతం చేశారు. బస్‌స్టేషన్ నుంచి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వరకు కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. గంగుల ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఓ వ్యక్తి మంత్రి ఇంటిపై రాయి విసిరేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి నాయకుడు చైతన్యను పోలీసులు అదుపులోని తీసుకున్నారు.
(చదవండి : డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి.. తీవ్ర ఉద్రిక్తత)