Thamballapalle
-
సీఎం జగన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న తంబళ్లపల్లె ప్రజలు
-
జై చంద్రారెడ్డి ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్ల దాడి
-
పార్వతీపురం, పెదకూరపాడు, తంబళ్లపల్లె నియోజకవర్గాలలో బస్సుయాత్ర
-
Pareshamma: ఒప్పించి.. మెప్పించింది!
ఐదేళ్ల శ్రమకు దక్కిన గౌరవం ఇది. నేలతల్లి గొంతు తడిని నిలిపిన ఫలితం. గ్రామీణ మహిళకు అందిన ఈ పురస్కారం. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె కరువుకు కేరాఫ్. భూగర్భ జలాలు అడుగంటిపోవడం ఇక్కడ రైతులకు కొత్తేమీ కాదు. సాగు చేయడానికి నేల ఉంది, పంట పండడానికి నీరు లేదు. తంబళ్లపల్లెతోపాటు చుట్టుపక్కల పదహారు గ్రామాలు ఇప్పుడు ఆ దుస్థితి నుంచి గట్టెక్కాయి. ఆ గట్టెక్కడంలో వేల అడుగులు నడిచింది పారేశమ్మ. ఆమె శ్రమకుగాను యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ వాటర్ మిషన్లు బుధవారం నాడు నేషనల్ ఉమెన్ వాటర్ చాంపియన్ అవార్డును ప్రకటించాయి. తంబళ్లపల్లె మండలం, గోపిదిన్నెకు చెందిన పారేశమ్మ ఐటీఐ పూర్తి చే సింది. గోపిదిన్నెకు చెందిన ఎరుకులప్పను కులాంతర వివాహం చేసుకుంది. అతడు తంబళ్లపల్లె పంచాయతీలో పారిశుద్ద్య కార్మికునిగా పనిచేస్తున్నాడు. పారేశమ్మ తల్లిదండ్రులకు రెండున్నర ఎకరాల పొలం ఉన్నప్పటికీ సాగునీటి ఇబ్బందులతో వ్యవసాయం చేయడం కుదరలేదు. బతుకుతెరువు కోసం తంబళ్లపల్లెలో స్థిరపడ్డారు. వెంటపడి వినిపించింది! తంబళ్లపల్లి వచ్చిన తర్వాత తాను కూడా ఏదో ఒక పని చేయాలి, ఏ పని దొరుకుతుందా అని ఆలోచిస్తున్నప్పుడు 2015లో ‘ఫౌండేషన్ ఫర్ ఎకోలాజికల్ సెక్యూరిటీ’ సంస్థ పర్యావరణం, నీటి సంరక్షణ, రైతుల కోసం పనిచేస్తున్న విషయం తెలిసి పని అడిగింది. నెలకు రూ. 4,500 గౌరవ వేతనంతో తంబళ్లపల్లె పంచాయతీ లో రీసోర్స్‌పర్సన్‌గా నియమితురాలైంది. తంబళ్లపల్లె పరిసరాల్లోని 16 పల్లెల్లో విధులు నిర్వహించాలి. వ్యవసాయంలో ఎంతో అనుభవం కలిగిన రైతులకు సూచనలివ్వాలి. చెప్పడానికి పారేశమ్మ సిద్ధంగా ఉన్నప్పటికీ వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. వాళ్లు అలవాటు పడిన పద్ధతిలో మార్పు తీసుకురావడం మాటలు కాదు. అందులోనూ సేద్యంలో అనుభవం లేని పారేశమ్మ చెప్తుంటే పట్టించుకునేదెవరు? ఆమె ప్రయత్నం అంతా తాతకు దగ్గులు నేర్పించడం వంటిదే అన్నమాట. కొన్నిరోజుల్లోనే పారేశమ్మకు పరిస్థితి అర్థమైపోయింది. అయితే ఆమె ఆ రోజు ఈ పని తనవల్ల కాదని వదిలేసుంటే పారేశమ్మ గురించి రాయడానికి ఏమీ ఉండేది కాదేమో! ఆమె పట్టుదలతో కొనసాగింది. ఒక్కొక్క పల్లెకు ఒకటికి పదిసార్లు వెళ్లింది. ఉదయం ఆరున్నరకు వెళ్తే మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి తిరిగొచ్చేది. మళ్లీ సాయంత్రం నాలుగింటికి వెళ్తే రాత్రి 8 గంటల దాక పల్లెల్లోనే. వాస్తవ నీటి పరిస్థితులు, అధిక నీటి వినియోగమయ్యే పంటలసాగుతో కలిగే ఇబ్బందులను వివరిస్తూ వచ్చింది. చెవినిల్లు కట్టుకుని చెప్పినట్లే చెప్పింది. చెప్పగా చెప్పగా రైతులు వినడం మొదలైంది. ఆ తర్వాత వారిలో ఆలోచన రేకెత్తింది. నిజమే కదా! అని సమాధానపడ్డారు. అలా పారేశమ్మ రైతులను పంటల సాగులో మార్పుకు ఒప్పించింది. రైతులకు అవగాహన కల్పిస్తున్న పారేశమ్మ చాంపియన్ పొలాల్లో కందకాలు తవ్వుకుంటే నీరు పొలంలోనే ఇంకిపోయి తేమ శాతం పెరుగుతుందని వివరించింది. భుగర్భజలాలు పెరగడంపై అవగాహన కల్పించేది. ఉపాధి హామీ పథకం పనుల్లో అధికంగా నీటినిల్వ పనులు చేసేలా ప్రోత్సహించింది. ఇప్పుడు ఈ పల్లెల్లో ఒక వర్షానికే కుంటలు నిండిపోతున్నాయి. రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి పారేశమ్మ ఒంటరిపోరాటం చేసింది. ఆమె కృషికి గుర్తింపుగా వాటర్ చాంపియన్ అవార్డు ఆమెను వరించింది. – టైలర్ షామీర్ బాషా ,బి. కొత్తకోట, చిత్తూరు జిల్లా పదహారు పల్లెలు తంబళ్లపల్లె, పులసవాండ్లపల్లె, గోళ్లపళ్లోపల్లె, చెవిటివారిపల్లె, ఎగువబోయపల్లె, బలకవారిపల్లె, చెన్నప్పగారిపల్లె, నాయనప్పగారిపల్లె, దబ్బలగుట్టపల్లె, కురవపల్లె, మట్టావాండ్లపల్లె, బురుజు, బోడికిందపల్లె, కొండకింద మేకలవారిపల్లె, ఇట్నెనివారిపల్లె, చేలూరివాండ్లపల్లెల్లో ఇంటికి ఒకరిని సంఘంలో చేర్చాను. వారితో నిత్యం పొలాల్లో, గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడంతోపాటు ఏయే పల్లెల్లో భూగర్భజలాల మట్టం ఏ స్థాయిలో ఉందో అంచనా వేసి వివరించాను. ఏయే పంటలకు ఏ మేరకు నీటి వినియోగం అవుతుందో చెప్పేదాన్ని, నీటివనరును బట్టి ఏ పంటలు సాగు చేయాలనే అవగాహన కల్పిస్తూ అందుకు అనువైన పంటల గురించి వివరించాను. అందరూ కలిసిరావడంతోనే విజయం సాధించాం. – పారేశమ్మ, రీసోర్స్ పర్సన్,ఎఫ్ఈఎస్ ఇదీ ప్రణాళిక! ఈ పల్లెల చుట్టూ కొండలు, గుట్టలు ఉంటాయి. పల్లెల చుట్టూ సహజంగా ఉన్న ప్రకృతి వనరులను కాపాడుకోవడం. భూమికోత నివారణ, మొక్కల పెంపకం ద్వారా అడవుల సంరక్షణ, భూగర్భజలాల వృద్ధికి నష్టం కలిగించే పనులు చేపట్టకపోవడం కార్యక్రమాలను సంఘాల ద్వారా అవగాహన కల్పించింది పారేశమ్మ. ఈ గ్రామాల్లో రైతులు వరి, టమాట పంటలనే ఎక్కువగా సాగు చేస్తారు. సగం పొలంలో రైతుకు ఇష్టమైన పంట వేసుకుని, మిగిలిన సగం పొలంలో కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు లాంటి చిరుధాన్యాలు, సజ్జలు, రాగులు, వేరుశెనగ సాగు చేశారు. గత ఏడాది 60 మంది రైతుల చేత 75 ఎకరాల్లో చిరుధాన్యాలను సాగు చేయించారు. ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడితో 480 టన్నులు వచ్చింది. కోవిడ్ ప్రభావంతో ధరలు తగ్గాయి. కొందరు రైతులు పంటను అమ్మకుండా మార్కెట్ మెరుగయ్యే రోజుల కోసం ఎదురుచూస్తున్నారు. ఫొటోలు: షేక్ మహ్మద్ రఫీ, సాక్షి, తిరుపతి -
వాటర్ చాంపియన్‌గా పారేశమ్మ
బి.కొత్తకోట(చిత్తూరు జిల్లా): భూగర్భ జలాల స్థితి ఆధారంగా పంటల సాగు ద్వారా రైతులు సత్ఫలితాలు సాధించేలా కృషి చేసిన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెకు చెందిన టి.పారేశమ్మ జాతీయ ఉమెన్ వాటర్ చాంపియన్ అవార్డుకు ఎంపికయ్యారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్డీపీ), జాతీయ వాటర్ మిషన్ బుధవారం ఢిల్లీ నుంచి వెబినార్ నిర్వహించాయి. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి 63 మందిని అవార్డుల కోసం ప్రతిపాదించగా.. అందులో ఏపీకి చెందిన పారేశమ్మ సహా 41 మందికి అవార్డులు దక్కాయి. పంటల గురించి పొలంలో రైతులతో సమావేశమైన పారేశమ్మ (ఫైల్) రీసోర్స్ పర్సన్‌గా.. రైతులకు అండగా.. చిత్తూరు జిల్లాలోని గొపిదిన్నెకు చెందిన పారేశమ్మ కుటుంబం తంబళ్లపల్లెకు వచ్చి స్థిరపడింది. ఐటీఐ చదివిన పారేశమ్మ.. 2015 నుంచి గుజరాత్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎకోలాజికల్ సెక్యూరిటీ (ఎఫ్ఈఎస్) సంస్థలో రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్నారు. తంబళ్లపల్లె పరిధిలోని 16 పల్లెల్లో విధులు నిర్వర్తిస్తూ.. అక్కడి వారితో సంఘాలు ఏర్పాటు చేశారు. పంటల సాగు, వనరుల సంరక్షణ గురించి ఈ సంఘాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తుంటారు. ఏఏ పంటలకు ఎంత నీరు అవసరం అవుతుంది? నీటివనరుల పరిస్థితి ఏంటి? భూగర్భ జలాల స్థితిని అంచనా వేసి.. ఏయే పంటలు సాగు చేయాలో రైతులకు తెలియజేసేవారు. భూగర్భ జలాల ఆధారంగా రైతుకున్న పొలంలోని సగ భాగంలో ఏదైనా పంట వేసేలా.. మిగిలిన సగంలో చిరుధాన్యాల సాగు చేసేలా ప్రోత్సహించేవారు. పారేశమ్మ కృషి వల్ల స్థానిక రైతుల్లో మార్పు వచ్చింది. పారేశమ్మ ఏర్పాటు చేసిన సంఘాల సూచనలను పాటించి రైతులు సత్ఫలితాలు పొందడం మొదలుపెట్టారు. సంతోషంగా ఉంది.. అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు మరింత బాధ్యతను పెంచింది. వ్యవసాయం, సహజ వనరుల సంరక్షణ కోసం గ్రామస్తులతో కలిసి మరింత కృషి చేస్తా. – టి.పారేశమ్మ, ఎఫ్ఈఎస్ రీసోర్స్ పర్సన్, తంబళ్లపల్లె -
నేను వెళ్తున్న దారి కరెక్ట్ కాదు.. లక్షలు సంపాదించా
సాక్షి, మదనపల్లె (చిత్తూరు జిల్లా): ‘నేను వెళ్తున్న దారి మంచిది కాదు. గతంలో పది మందిని మోసం చేసి లక్షలు సంపాదించా.. ఇక ఎవర్నీ మోసం చేయదల్చుకోలేదు. పేకాటలో ఎంత డబ్బు సంపాదించినా విలువ ఉండటంలేదు. అదొక వ్యసనంగా మారిపోయింది. ఇక ఈ జీవితాన్ని కొనసాగించదల్చుకోలేదు. దయచేసి అవయవాలు అమ్ముకునేందుకు అనుమతివ్వండి’.. అంటూ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోటకు చెందిన బావాజి (24) స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కీర్తి చేకూరిని అభ్యర్థించాడు. ఆ వివరాలు.. కురబలకోటకు చెందిన కొమద్ది రహంతుల్లా కుమారుడు బావాజి పదేళ్ల వయస్సులోనే పేకాటకు బానిసయ్యాడు. పేకముక్కల్లో ఏ నెంబరైనా ఇట్టే చెప్పగల ప్రావీణ్యం సాధించాడు. ఎంతగా అంటే.. ఒక్కో పేకముక్క అంకెను, అక్షరాన్ని చూడకుండా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. డబ్బు సంపాదించాలంటే పదిమందిని మోసం చేయాలని.. కానీ, ఇలాంటి బతుకు ఇక వద్దని నిర్ణయించుకున్నట్లు ‘స్పందన’లో సబ్‌కలెక్టర్‌కు చెప్పాడు. పేకాటలో కోట్ల రూపాయలు సంపాదించానని, ఎందరికో లక్షల రూపాయల ఆదాయం చేకూర్చానని చెప్పాడు. ఇక మోసం చేయడం ఇష్టంలేక అవయవాలు అమ్ముకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. పేకాట డబ్బులతోనే ఒక చెల్లెలికి పెళ్లి చేశానని, ఇంకా ఇద్దరికి పెళ్లి చేయాల్సి ఉందని, అవయవాల అమ్మకం ద్వారా వచ్చే డబ్బులతో వాళ్లకు పెళ్లి జరిపిస్తానన్నాడు. దీంతో అతని తల్లిదండ్రులను తీసుకురావల్సిందిగా సబ్ కలెక్టర్ స్థానిక తహసీల్దార్‌కు ఆదేశాలిచ్చారు. అనంతరం అర్జీదారుడి ఫిర్యాదుపై సబ్‌కలెక్టర్ స్పందిస్తూ.. బావాజి మానసిక స్థితిపై పూర్తిస్థాయిలో విచారించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, మధ్యాహ్నం బావాజి తండ్రి రహంతుల్లా సబ్ కలెక్టరేట్‌కు చేరుకుని తన కొడుకు చాలా తెలివైన వాడని, డబ్బు సంపాదించినది వాస్తవమేనని, ఇప్పుడు అంతా పోగొట్టేశాడని చెప్పుకొచ్చాడు. అవయవాలు అమ్ముకునేందుకు అనుమతి అడిగాడని చెబితే అదేమీ లేదు.. కొడుకును తీసుకెళ్తానని సబ్ కలెక్టర్‌కు చెప్పాడు. దీంతో బావాజీకి నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిద్దామని సబ్‌కలెక్టర్ చెప్పారు. -
ప్రజలతో ఎలా వ్యవహరిస్తారు..?
బి.కొత్తకోట: ప్రజలతో మమేకం అయ్యేలా వారితో ఎలా వ్యవహరిస్తారు, ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు అంటే ఏమిటి అన్న ప్రశ్నలతో అధికారులు వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కోటావూరు, బండారువారిపల్లె, శీలంవారిపల్లె పంచాయతీలకు చెందిన వలంటీర్ అభ్యర్థులకు మండల ప్రత్యేక అధికారి శివశంకర్, ఎంపీడీఓ సుధాకర్, డెప్యూటీ తహసీల్దార్ చంద్రమునిలు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 100 మార్కులకు ప్రశ్నలు వేశారు. ములకలచెరువు: గ్రామ వలంటీర్ల కోసం దరఖాస్తులు చేసుకున్న గూడుపల్లి, వేపూరికోట, కదిరినాథునికోట పంచాయతీ అభ్యర్థులకు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ ఎంపీడీఓ తాజ్మస్రూర్ గురువారం అన్నారు. మొత్తం 60 మందికి ఇంటర్వ్యూలు జరుగుతాయని అభ్యర్థులకు కేటాయించిన సమయానికి ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఎంపీడీఓ పేర్కొన్నారు. స్థానిక మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం జరిగిన గ్రామ వలంటీర్లకు జరిగిన ఇంటర్వ్యూల్లో 28 మంది హాజరయ్యారు. కాలువపల్లి, నాయనచెరువుపల్లెకు చెందిన 30 అభ్యర్థులకు గాను ఇద్దరు గైర్హాజరయ్యారు. పెద్దతిప్పసముద్రం: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం అంకిరెడ్డిపల్లి, బూచిపల్లి, సంపతికోట గ్రామాలకు చెందిన అభ్యర్థులకు వలంటీర్ల నియామకాలపై ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇన్చార్జి తహసీల్దార్ రెడ్డెప్ప, ఈఓఆర్డీ పద్మారాణి అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. శుక్రవారం మండలంలోని కాట్నగల్లు, రాపూరివాండ్లపల్లి, సంపతికోట గ్రామాల్లో దరఖాస్తు చేసుకుని వారి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లతో పాటు ఇంటర్వ్యూకు రావాలని ఫోన్ వచ్చిన వారు మాత్రమే హాజరు కావాలని అధికారులు కోరారు. తంబళ్లపల్లె: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు జరిగాయి. దిగువపాళ్యం, ఎగువసుగాలి తాండా, కన్నెమడుగు, మర్రిమాకుపల్లె, ఎర్రసానిపల్లె పంచాయతీల్లో 30 మంది దరఖాస్తుదారులకు గానూ 22 మంది మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వివిధ కారణాలతో 8 మంది గైర్హాజరైనట్లు డీటీ సుధాకర్‌బాబు తెలిపారు. -
తంబాళపల్లిలో పెద్దిరెడ్డి ధ్వారకానాథ్రెడ్డి ప్రచారం
-
అతిసారతో వ్యక్తి మృతి
తంబళ్లపల్లి (చిత్తూరు) : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం గోపిదిన్నె గ్రామంలో అతిసారతో పి.వెంకటేశ్(34) అనే వ్యక్తి మృతిచెందాడు. వారం రోజులుగా అతిసారతో బాధపడుతుండగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే పరిస్థితి విషమించడంతో స్థానిక వైద్యుల సూచన మేరకు అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్ సోమవారం మృతి చెందాడు. -
''విభజన కోసం దిక్కుమాలిన రాజకీయాలు''
-
తంబాళపల్లి నుండి సమైక్య శంఖారావం