breaking news
Thamma Movie
-
రష్మిక 'థామా' సినిమా.. ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్
రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా నటించిన థామా (Thamma) మొదటిరోజే భారీ కలెక్షన్స్ రాబట్టింది. హారర్ కామెడీ ఫిల్మ్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. స్త్రీ, భేడియా, ముంజ్యా, స్త్రీ 2 వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక హారర్ యూనివర్స్‌ను క్రియేట్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ థామాను తెరకెక్కించింది. అయితే, ఈ చిత్రానికి విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. కానీ దీపావళి పండుగ కారణంగా బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్స్ సాధించగలిగింది.బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రకటించే సక్నిల్క్ ప్రకారం.. థామా చిత్రం సుమారు రూ. 25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది చాలా మంచి ఓపెనింగ్ అని చెప్పవచ్చు. ఆయుష్మాన్ కెరీర్లో ఇప్పటివరకు తన అతిపెద్ద ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా థామా రికార్డ్ క్రియేట్ చేసింది. ఛావా, పుష్ప 2 వంటి చిత్రాలతో రష్మికకు భారీ ఓపెనింగ్స్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ నుంచి వరుసగా స్త్రీ, స్త్రీ2 బ్లాక్ బస్టర్లు కావడంతో థామాపై భారీ అంచనాలు పెరిగాయి. ఆపై దీపావళి సెలవులు ఉండటంతో భాగానే కలిసొచ్చింది.థామా సినిమాలో అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా), తడ్కా (రష్మిక) మెప్పించారు. భేడియాగా ప్రత్యేక పాత్రలో వరుణ్ ధావన్ అదరగొట్టేశాడు. ఈ మూవీ సెకడాఫ్ చాలా బాగుందని ఎక్కువగా రివ్యూస్ వచ్చాయి. మలైకా అరోరా, నోరా ఫతేహి ప్రత్యేక గీతాల్లో కనిపించి మెప్పించారు. సచిన్-జిగర్ సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. -
నువ్వు నాదానివే..!
నచ్చిన డిజర్ట్ కళ్ల ముందు ఊరిస్తుంటే ఎవరికైనా నోరారా ఆరగించాలని అనిపిస్తుంది. రష్మికా మందన్నాకూ అలానే అనిపించింది. కానీ రష్మిక తినలేని పరిస్థితి. ఎందుకంటే... ప్రస్తుతం రష్మికా మందన్నా ఓ స్పెషల్ డైట్‌ను ఫాలో అవుతున్నారట. ఇందులో భాగంగా జిమ్‌లో స్పెషల్ వర్కౌట్స్ చేస్తున్నారు. అలాగే ఈ డైట్ మెనూలో రోజూ స్వీట్ తినకూడదు. దీంతో తన కళ్ల ముందు ఉన్న డిజర్ట్‌ను తినలేక పోతున్నానన్న బాధను ఎక్స్‌ప్రెస్ చేస్తూ, ‘డియర్ డిజర్ట్... నువ్వు ఎప్పటికీ నా దానివే.కానీ ఈ రోజు కాదు’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో రష్మిక ఓ వీడియోను షేర్ చేయగా, వైరల్ అవుతోంది. ‘‘ఫిట్నెస్ కారణంగా సినిమా స్టార్స్ తమకు ఇష్టమైన ఆహారానికి దూరం కావాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్స్ మెరుపు తీగలా ఉండటం కోసం నచ్చిన ఆహారాన్ని త్యాగం చేస్తారు... ఇలాంటి త్యాగాలు తప్పవు’’ అని నెటిజన్లు స్పందిస్తున్నారు.ఇక రష్మికా మందన్నా నటించిన హిందీ చిత్రం ‘థామా’ ఈ నెల 24న విడుదల కానుంది. అలాగే రష్మిక లీడ్ రోల్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబరు 7న రిలీజ్ కానుంది. అలాగే ‘మైసా’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్, హిందీలో ‘కాక్టైల్ 2’తో పాటు మరో రెండు సినిమాలతో రష్మిక ఎప్పటిలానే బిజీ బిజీ. -
51 ఏళ్ల వయసులోనూ ఐటమ్ సాంగ్.. వీడియో రిలీజ్
రష్మిక హీరోయిన్గా చేస్తున్న లేటెస్ట్ హిందీ సినిమా 'థామా'. 'స్త్రీ' యూనివర్స్ నుంచి వస్తున్న కొత్త మూవీ ఇది. అక్టోబరు 21న హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా పర్లేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో పాటలు మాత్రం ప్రతిదీ ఐటమ్ సాంగే అనిపిస్తుంది. తాజాగా రిలీజైన సాంగ్‌లో అయితే 51 ఏళ్ల బ్యూటీ అదిరిపోయే స్టెప్పులేయడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'థామా' నుంచి తాజాగా 'పా*యిజన్ బేబీ' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇది కూడా పార్టీ నేపథ్యంగా సాగే గీతం అర్థమవుతోంది. తొలుత మలైకా అరోరా గ్లామరస్‌గా కనిపిస్తూ స్టెప్పులేయగా, చివరలో రష్మిక కూడా మలైకతో కలిసి డ్యాన్స్ చేసింది. ఇదే కాదు గతంలో 'దిల్బర్' అంటూ సాగే మరో పాట రిలీజ్ చేశారు. ఇందులో నోరా ఫతేహి డ్యాన్స్ చేసింది. ఇది ఐటమ్ సాంగ్. అంతకుముందు రష్మిక పాట కూడా చూడటానికి ఐటమ్ సాంగ్‌లానే అనిపిస్తుంది. చూస్తుంటే సినిమాలో కామెడీతో పాటు ఐటమ్ గీతాలు చాలానే ఉన్నాయి!(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్స్ కృతి శెట్టి, కల్యాణి బెల్లీ డ్యాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్) -
'థామ' ప్రమోషన్స్‌లో రష్మిక, మలైకా అరోరా స్టెప్పులు (ఫోటోలు)
-
మనం కలిసి బతుకుదామా...
‘‘నేను ఏ సినిమా చేసినా అందులో ఒక కొత్త కాన్సెప్ట్ ఉండేలా చూసుకుంటాను. ‘థామా’ సినిమా కాన్సెప్ట్ ఆడియన్స్‌ని అలరిస్తుంది. ఈ సినిమాలోని అలోక్ క్యారెక్టర్ చేయడం కొత్తగా అనిపించింది. ‘థామా’ చిత్రం కోసం యాక్షన్ సీక్వెన్స్ చాలా చేశాను’’ అని ఆయుష్మాన్ ఖురానా అన్నారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన హిందీ చిత్రం ‘థామా’. మాడాక్ హారర్ ఫిల్మ్స్ యూనివర్స్ (ఎమ్హెచ్సీయు) లో భాగంగా ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 21న విడుదల కానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘థామా’ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ– ‘‘నా సినిమా ప్రమోషన్స్ కోసం తొలిసారిగా హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ‘థామా’ ఫుల్ పాన్ ఇండియా మూవీ. రష్మికగారితో తొలిసారి కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆమె బ్రిలియంట్ పెర్ఫార్మర్. ‘థామా’ సినిమాను థియేటర్స్‌లో చూసి, ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు. ‘‘మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది.‘థామా’ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలో ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేసే క్యారెక్టర్ చేశాను’’ అని తెలిపారు రష్మికా మందన్నా. ‘పోలీసుల కోసం నేను ఏమైనా చేస్తాను’, ‘ఏం చేశారో చెప్పండి’, ‘విక్రమార్కుడు సినిమా ఎనిమిది సార్లు చూశాను సార్’, ‘నేను వెళ్లక తప్పదు అలోక్... నా కారణంగా నువ్వు కూడా ప్రమాదంలో పడతావ్..’, ‘నాకేం కలిసి చనిపోయే ఉద్దేశం లేదు... మనం కలిసి బతుకుదామా!’, ‘నేను నీతో పాటు ఉండలేను... మన ప్రపంచాలు ఒకటి కావు’ అనే డైలాగ్స్ ‘థామా’ తెలుగు ట్రైలర్లో ఉన్నాయి. -
థామా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మెరిసిన రష్మిక.. ఫోటోలు
-
'రష్మికా మందన్న' గ్లామరస్ సాంగ్ విడుదల
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా(Rashmika) నటించిన కొత్త చిత్రం థామా(Thamma).. హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి తాజాగా ఒక సాంగ్‌ను విడుదల చేశారు. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ చిత్రంలో అలోక్పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా మందన్నా నటించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న ఈ మూవీ విడుదల కానుంది. యూత్‌ను ఆకట్టుకునేలా మరింత గ్లామర్‌గా ఈ సాంగ్ కోసం రష్మిక కనిపించింది. -
రష్మిక మందన్నా సినిమా ప్రమోషన్స్‌లో బాలీవుడ్ స్టార్స్ (ఫోటోలు)
-
రష్మిక చేసిన దెయ్యం సినిమా.. ట్రైలర్ రిలీజ్
హీరోయిన్ రష్మిక చేస్తున్న లేటెస్ట్ బాలీవుడ్ సినిమా 'థామా'. భేడియా, స్త్రీ, స్త్రీ 2, ముంజ్య చిత్రాల తర్వాత హారర్ యూనివర్స్‌లో వస్తున్న మూవీ ఇది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తుండగా నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ దీపావళి సందర్భంగా అక్టోబరు 21న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బికినీ ఫొటోలు.. వెటకారంతో క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి)ట్రైలర్ చూస్తుంటే ఓవైపు భయపెడుతూనే మరోవైపు నవ్విస్తున్నారు. హీరో ఆయుష్మాన్.. వ్యాంపైర్ అవుతాడు. ఇతడి ప్రేమికురాలిగా రష్మిక నటించింది. మరి ప్రియుడిలో దెయ్యం లక్షణాలు వచ్చేసరికి రష్మిక ఏం చేసింది? చివరకు ఏమైంది అనే కాన్సెప్ట్‌తో మూవీ తీసినట్లు అనిపిస్తుంది. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. గతంలో వచ్చిన స్తీ, స్త్రీ 2 చిత్రాలు వందల కోట్ల కలెక్షన్స్ సాధించాయి. మరి ఇప్పుడు 'థామా' ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))