ఇంటెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్‌లో ఎన్నారై విద్యార్థుల హవా
న్యూయార్క్ : ఇంటెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ నిర్వహించిన పరీక్షలో ఇండో - అమెరికన్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ అవార్డులలో తెలుగు తేజం ప్రేమ్ బాబు (ఇన్నోవేషన్) రెండోస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరో తెలుగుతేజం కిషోర్ శశావత్ (బేసిక్ రీసెర్చ్) మూడో స్థానంలో నిలవగా, అన్విత (గుప్తా గ్లోబెల్ గూడ్) మూడో స్థానంలో నిలిచారు.
గురువారం అమెరికా అధ్యక్షడు ఒబామా చేతుల మీదగా వీరంతా అవార్డులు అందుకున్నారు. మొత్తం 40 అవార్డుల్లో ఏకంగా 13 పురస్కారాలను ఇండో అమెరికన్ విద్యార్థులు దక్కించుకోవడం విశేషం.