అధికారులకు ధన్యవాదాలు
అనంతపురం : పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరిగిన ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో పోలింగ్ ప్రశాతంగా జరిగేందుకు అధికారులు పూర్తిగా సహకరించారన్నారు.
ఎక్కడా చిన్న సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్న అధికార యంత్రాగానికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో జరిగే ఎలాంటి ఎన్నికలైనా ఇదే స్ఫూర్తితో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మూడు జిల్లాల్లోనూ తనకు సహకరించిన వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, నాయకులతో పాటు ఓటింగ్‌లో పాల్గొన్న పట్టభద్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు కొర్రపాడు హుసేన్‌పీరా, ఓబుళరావు, ఎస్ఎం బాషా, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.