Tharoor
-
శశి థరూర్‌కు షాక్.. ‘ఓటింగ్ అక్రమాల’ ఆరోపణలపై కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు శశి థరూర్ వర్గం ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. ఈ అంశంపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసుదన్ మిస్త్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే..శశి థరూర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మిస్త్రీ. మీకు రెండు ముఖాలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేము మీ అభ్యర్థనను స్వీకరించాము. కానీ, మీరు మీడియా ముందుకు వెళ్లి కేంద్ర ఎన్నికల అథారిటీ మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నినట్లు ఆరోపించారు. మా సమాధానాలన్నిటితో మీరు సంతృప్తి చెందారని తెలియజేసేందుకు మా ముందు మీకు ఒక ముఖం ఉంది. మాపై ఈ ఆరోపణలన్నీ చేసిన మీడియాలో వేరే ముఖం ఉందని చెప్పడానికి నేను చింతిస్తున్నాను.’అని శశి థరూర్ తరఫు చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్‌కు సమాధానం పంపించారు మిస్త్రీ. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలుడుతున్న క్రమంలో పోలింగ్ ప్రక్రియపై ఆరోపణలు చేస్తూ బుధవారం మధుసుదన్ మిస్త్రీకి లేఖ రాశారు థరూర్ పోలింగ్ ఏజెంట్. నాలుగు రకాల ఫిర్యాదులను అందులో పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సులకు అనధికారిక సీల్స్ వేయటం, పోలింగ్ బూతుల్లో వేరే వ్యక్తులు ఉండటం, ఓటింగ్ జరుగుతున్న క్రమంలో అక్రమాలు, పోలింగ్ షీట్లు లేకపోవటం వంటి అంశాలను లేవనెత్తారు. ఈ ఎన్నికల్లో శశి థరూర్‌కు 1,072 ఓట్లు రాగా.. మల్లికార్జున్ ఖర్గేకు 7,897 ఏట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు: ఎప్పుడూ ఏకగ్రీవమే, కానీ.. ఇప్పుడే ఇలా! -
చివరి రోజు ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై థరూర్ ట్వీట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు శశి థరూర్. తనకు ఎదురయ్యే సవాళ్ల నుంచి తానెప్పుడూ వెనక్కి తగ్గబోనని, పోటీలో చివరకు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు పార్టీలోని ఇద్దరు సహచరుల మధ్య జరుగుతున్న స్నేహపూర్వక పోటీ మాత్రమేనని పునరుద్ఘాటించారు. శశి థరూర్ నామినేషన్ ఉపసంహరణ చేసుకుంటున్నారని వస్తున్న వార్తలపై తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో ద్వారా స్పష్టత ఇచ్చారు. ‘కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో నేను నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు కాల్స్ రావటం ఆశ్చరానికి గురి చేసింది. వారు ఢిల్లీ అధిష్ఠానం నుంచి సమాచారం అందినట్లు చెప్పారు. అయితే.. అవన్నీ అవాస్తవం. నా జీవితంలో ఇంతవరకెప్పుడూ సవాళ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. తగ్గను కూడా. ఇది పోరాటం. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న స్నేహపూర్వక పోటీ. ఇందులో నేను చివరి వరకు పోరాడాలి. నేను పోటీలో ఉన్నా. అక్టోబర్ 17న హాజరై ఓటు వేయాలని కోరుతున్నాను. రేపటి కోసం, థరూర్ కోసం ఆలోచించండి’ - శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ నామినేషన్లకు చివరి రోజైన అక్టోబర్ 8న థరూర్ ఈ వీడియో పోస్ట్ చేయడంతో అధ్యక్ష పదవికి పోలింగ్ ఖాయమైంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి థరూర్‌తో పాటు సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో పోలింగ్ అనివార్యమైంది. అక్టోబరు 17న ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబరు 19న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో 9వేల మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడైన ఖర్గేకు ఎక్కువమంది మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. Surprised to get calls saying that “sources in Delhi” claim that I have withdrawn! I am on this race till the finish. #ThinkTomorrowThinkTharoor pic.twitter.com/zF3HZ8LtH5 — Shashi Tharoor (@ShashiTharoor) October 8, 2022 ఇదీ చదవండి: నేనేం సోనియా రిమోట్‌ను కాను -
కాంగ్రెస్‌లో గాంధీల స్థానంపై శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు సీనియర్ నేత శశి థరూర్. అక్టోబర్ 17న జరగనున్న ఎన్నికల్లో మరో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేతో పోటీ పడనున్నారు. ఈ క్రమంలో గాంధీ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు శశి థరూర్. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో గాంధీలు ఒక భాగం మాత్రమేనని పేర్కొన్నారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పలు అంశాలపై మాట్లాడారు థరూర్. అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేయటాన్ని సోనియా గాంధీ స్వాగతించారని, తమ కుటుంబం తటస్థంగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు థరూర్ చెప్పారు. తాను సోనియా గాంధీ ఆమోదం కోసం ఆమెను కలవలేదని, అయికే.. వారి అధికారిక వైఖరి ఏంటని తెలుసుకునేందుకే భేటీ అయినట్లు చెప్పారు. ‘మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు, మేము ఎల్లప్పుడూ ఏకాభిప్రాయంతో పనులు చేస్తాం, మాకు వదిలివేయండి, సరైన వ్యక్తిని కనుగొంటాము అని ఆమె చెప్పలేదు. దానికి విరుద్ధంగా.. ఎన్నికలు పార్టీకి మంచిదని నమ్ముతానన్నారు. నీవు పోటీ చాయాలనుకుంటే.. స్వాగతిస్తా అన్నారు. అధికారిక అభ్యర్థి అంటూ ఎవరూ ఉండరని చెప్పారు. ఈ పోటీ కేవలం సహచరుల మధ్య జరుగుతోన్న పోరు మాత్రమే. నాకు 14 ఏళ్ల అనుభవం ఉంది. అన్ని రకాలుగా పోటీకి అర్హుడినే. నా అభ్యర్థిత్వంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ’ అని తెలిపారు శశి థరూర్. పార్ట చీఫ్ కోసం పోటీ పడుతోన్న ఏ అభ్యర్థి అయినా.. గాంధీ కుటుంబీకుల చేతిలో కీలుబొమ్మగా మారతారా? అని ప్రశ్నించగా.. ‘కాంగ్రెస్‌లో గాంధీల స్థానం.. పార్టీ డీఎన్ఏతో వారికున్న అవినాభావ సంబంధాలు గొప్పవని నేను కచ్చితంగా నమ్ముతాను. వారి నుంచి, వారి వారసత్వం నుంచి మనల్ని మనం వేరు చేసే ప్రశ్నే లేదు. వారు క్రీయాశీలకంగా వ్యవహరించొద్దని భావిస్తే.. ఆ భయం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు.’ అని పేర్కొన్నారు థరూర్. మరోవైపు.. రాహుల్ గాంధీ ఇప్పటికీ పార్టీ ఇంఛార్జ్‌గానే కనిపిస్తారని తెలిపారు. అలాగే.. తాను జీ-23 తరఫున అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవటం లేదని స్పష్టం చేశారు. నాకు కేవలం 23 మంది కాదు, 9,100 మంది మద్దతు కావాలంటూ తెలిపారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: దిగ్విజయ్ సింగ్ -
కుమార్తెను చంపి...ఆపై ఉరేసుకుంది
ధారూరు (రంగారెడ్డి జిల్లా) : అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ మహిళ.. పది నెలల కుమార్తెను గొంతు నులిమి చంపి ఆపై తానూ దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం రాళ్లచిట్టెంపల్లిలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. రాళ్లచిట్టెంపల్లికి చెందిన రాజుకు కేరెళ్లి గ్రామానికి చెందిన చింతకింది నాగన్న కుమార్తె లక్ష్మి (24)తో 2008లో వివాహమైంది. ఆ సమయంలో తండ్రి నాగన్న రూ. లక్ష నగదు, 3 తులాల బంగారం ఇచ్చి వివాహం చేశాడు. కొంత కాలం వరకు సాఫీగా సాగిన వీరి దాంపత్యంలో ఇటీవల అదనపు కట్నం కింద మరో లక్ష తేవాలని భర్త రాజు, బావ శంకరయ్య, అత్త రుక్కమ్మలు లక్ష్మిని వేధిస్తూ ఇంటి నుంచి గెంటేశారు. ఆ సమయంలో లక్ష్మి తండ్రి నాగన్నతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరిగి పెద్దల రాజీతో అత్తారింటికి వచ్చిన లక్ష్మికి మళ్లీ వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. దీంతో మానసికంగా కృంగిపోయిన లక్ష్మి.. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తె శ్రీజ (10 నెలలు)ను గొంతు నులిమి చంపి ఆ తర్వాత ఇంట్లోని దూలానికి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలాన్ని మోమిన్‌పేట్ సీఐ రంగా, ఎస్ఐ షంషోద్దీన్లు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోసం వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
తల్లిని అడవిలో వదిలిపెట్టిన కూతురు
- అన్నపానీయాలు లేక ఆకలి ఘోస - రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చినా స్పందించని కుటంబసభ్యులు ధారూరు (రంగారెడ్డి) : ఇంట్లో ఉన్న ముసలి తల్లిని వదిలించుకునేందుకు ఓ కూతురు.. అర్ధరాత్రి ఆటోలో తీసుకెళ్లి తల్లిని అడవిలో వదిలిపెట్టింది. వృద్ధురాలు అతి కష్టమ్మీద సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్‌కు చేరుకుని అన్నపానీయాలు లేక ఆకలితో అలమటిస్తూ గడుపుతుంది. గమనించిన రైల్వే పోలీసులు వృద్ధురాలి కూతురు, ఆమె కొడుకులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదు. ఈ సంఘటన ధారూరు రైల్వేస్టేషన్లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దేముల్ మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన వడ్డె బిచ్చమ్మ(75)ను కూతురు బాలమ్మ.. తన కుమారులు గోపాల్, రజనీకాంత్‌లతో కలిసి ఆదివారం అర్ధరాత్రి ధారూరు రైల్వేస్టేషన్ సమీప అడవి ప్రాంతం రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. బిచ్చమ్మ నడవలేని స్థితిలో ఉన్నా పాక్కుంటూ సమీప రైల్వేస్టేషన్‌కు చేరుకుని తలదాచుకుంది. అన్నపానీయాలు లేక అలమటించడమే కాకుండా లేవటానికి చేతకాక మలమూత్రాలు అక్కడే చేసుకుంటూ ఉంది. ఈమెను గమనించిన రైల్వేస్టేషన్ మాస్టర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను విచారించి వివరాలు అడిగి వృద్ధురాలి మనుమలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వారు వృద్ధురాలిని తీసుకెళ్లేందుకు నిరాకరించారు. కాగా బిచ్చమ్మకు బాలమ్మ, ఎల్లమ్మ, మొగులమ్మ, అంబమ్మ, లక్ష్మిలనే ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. వీరిలో నలుగురు కూతుళ్ల పెళ్లిళ్లు చేయగా లక్ష్మికి వివాహం కాలేదు. వీరిలో బాలమ్మ అనే కుమార్తెకు పెళ్లిచేసి కుమార్తె, అల్లుడిని ఇల్లిరికంపెట్టుకుంది. బాలమ్మ తల్లి ఆస్తిని అనుభవిస్తూ తల్లికి నెలనెలా వచ్చే వృద్ధాప్య ఫించన్, బియ్యంను కూడ లాగేసుకుంటుంది. నెల రోజుల క్రితం తల్లి బిచ్చమ్మను తాండూర్ రైల్వే స్టేషన్లో వదిలివెళ్లగా ఎలాగో బిచ్చమ్మ తిరిగి ఇంటికి చేరింది. దీంతో తల్లిని పూర్తిగా వదిలించుకోవాలనే ఆలోచనతో ధారూరు సమీప అడవిలో రోడ్డు పక్కన వదిలిపెట్టి వెళ్లారు. మళ్లీ ఇంటికి రావద్దని, వస్తే మా పరువు పోతుందని, నువ్వు ఇంటి వద్ద ఉంటే తన పిల్లల పెళ్లిళ్లు కావని, జీవితం చాలు అనుకుంటే అక్కడే దగ్గర్లో ఉన్న రైల్వేస్టేషన్‌కు వెళ్లి చచ్చిపో అంటూ బెదిరించారని వృద్ధురాలు వాపోయింది. తన ఆస్తిని కూతురు, మనుమలు కలిసి దర్జాగా అనుభవిస్తున్నారని, తనను మాత్రం వదిలించుకోవాలనీ, లేకుంటే చంపేయాలనీ ప్రయత్నిస్తున్నారని ఆమే రైల్వే పోలీసులకు తెలిపింది. తనతోపాటు తన భర్త పెంటప్పను కూడా కూతురే ఇంటి నుంచి వెళ్లగొట్టిందని కన్నీరుమున్నీరయ్యింది. -
వీడనున్న సునంద మర్డర్ మిస్టరీ
-
సునంద పుష్కర్ అంత్యక్రియలు పూర్తి