హనుమంతుని జన్మస్థలంపై చర్చ రేపే
సాక్షి, చిత్తూరు: హనుమంతుడి జన్మస్థలంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. తిరుమలలోని జపాలి తీర్థమే హనుమాన్ జన్మస్థలం అని టీటీడీ చెప్తుండగా, కాదు కిష్కింధే హనుమంతుడి జన్మస్థలం అని తీర్థ క్షేత్ర ట్రస్టు చెప్తోంది. ఈ నేఫథ్యంలో టీటీడీతో హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చర్చకు సిద్ధమైంది.
రేపు తిరుపతిలో హనుమాన్ జన్మస్థలంపై సంస్కృత విద్యాపీఠంలో చర్చ జరగనుంది. కిష్కింధ ట్రస్టు తరపున గోవిందానంద సరస్వతి, టీటీడీ తరపున కమిటీ కన్వీనర్, సభ్యులు చర్చలో పాల్గొంటున్నారు. రేపు ఆహ్లాదకరమైన వాతావరణంలో పండితుల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇరుపక్షాలు చర్చించి శాస్త్రోక్తంగా నిర్ధారణకు రావడమే ఉపాయమని గోవిందానంద సరస్వతి తెలిపారు.
చదవండి: శ్రీవారి కోసం 365 రకాల దేశీ వరి!