డీఎంకే పార్టీ అభ్యర్థిని మట్టికరిపించండి: ఆళగిరి
ఉసిలమ్ పట్టి: డీఎంకే అభ్యర్థిని ఓడించాలంటూ బహిష్కృత నేత, కరుణానిధి కుమారుడు అళగిరి సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. థేనీ లోకసభ స్థానం నుంచి పోటి చేస్తున్న పోన్ ముతురామలింగంను మట్టికరిపించాలని కార్యకర్తలకు అళగిరి సూచించారు. అంతేకాకుండా థేని నియోజకవర్గంలో పోన్ ముత్తురామలింగంను నాలుగవ స్థానానికి పరమితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బంధువును కోల్పోయిన ఓ కార్యకర్తను పరామర్శించడానికి ఉసిలమ్ పట్టి గ్రామంలో పర్యటించారు.
ఉసిలమ్ పట్టి గ్రామంలో ఆళగిరికి ఘనస్వాగతం పలికిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. లౌకికవాద పార్టీగా రుజువు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని కరుణానిధి చేసిన వ్యాఖ్యలపై ఆళగిరి మాట్లాడానికి నిరాకరించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న డీఎంకే పార్టీ ప్రస్తుతం ఆపార్టీతో పొత్తుకు దూరంగా ఉంది. పార్టీ నియమ నిబంధనల్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆళగిరిని పార్టీని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.