theppothsavam
-
కృష్ణానదిలో హంసవాహనంపై విహరించనున్న అమ్మవారు
-
అతుకుల బండి.. ఆదిత్యునికండి!
అరసవల్లి: విఖ్యాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. హంస నావికా ఉత్సవానికి ఇంకా ఒక్క రోజే ఉంది. పవిత్ర ఇంద్రపుష్కరిణిలో ముగ్గురు దేవేరులతో క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా హంసవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చేందుకు స్వామి సతులతో సిద్ధంగానే ఉన్నారు. అయితే ఆయన విహరించే వాహనమే ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. బుధవారం సాయంత్రం జరగనున్న ఈ ఉత్సవానికి అన్ని ఏర్పా ట్లు పకడ్బందీగా చేసేందుకు ఆలయ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వారిలో కూడా బయటకు చెప్పలేని ఆవేదన కనిపిస్తోంది. గత ఏడాది తెప్పోత్సవంలో కనిపించిన నావకు ఇప్పటి నావకు అసలు పోలిక లేకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాహన ఫ్రేమింగ్‌లో ఎక్కడచూసినా ఏదో ఒక లోపం కనిపిస్తోంది. వెల్డింగ్‌లు చేసీ చేసీ ఎలాగోలా హంస వాహనాన్ని సోమవారం సాయంత్రానికి సిద్ధం చేశారు. పదేళ్ల కిందట నగరానికి చెందిన పేర్ల ప్రభాకరరావు అనే దాత ఇచ్చిన ఈ హంస వాహనానికి ప్రత్యేక బోల్ట్ ఫిటింగ్ సౌకర్యం ఉండేది. ఇప్పుడు ఆ విధమైన పరిస్థితులు లేవు. బోల్టులు లేకపోవడం, కొన్ని ఫ్రేములు కన్పించకపోవడంతో చాలా చోట్ల వెల్డింగ్ అతుకులు తప్పలేదు. దీంతో ఇప్పుడు వాహనం రూపురేఖలే మారిపోయాయి. గత ఏడాది ఈ వాహనాన్ని అనంతపురం పంపించడంతోనే ఈ దుస్థితి నెలకొందని అధికారులంటున్నారు. జిల్లాలో ఇన్చార్జి మంత్రిగా పనిచేసిన కాలంలో మంత్రి పరిటాల సునీత ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కుంతిమట్టి (వెంకటాపురం)లో కృష్ణ, రాయలసీమ నదుల అనుసంధాన కార్యక్రమంలో భాగంగా అక్కడి అనం త పద్మనాభ స్వామి దేవాలయ తెప్పోత్సవానికి ఆదిత్యుని హంస వాహనాన్ని గత ఏడాది డిసెంబర్ 12న తరలించారు. మంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సూచన మేరకు ఆలయ ఈ వాహనాన్ని ‘అనంత’కు తరలించారు. అయితే నాడు వాహనాన్ని తీసుకెళ్లిన తర్వాత అదే నెలలో 15 వతేదిన తిరిగి వాహనం అరసవల్లికి చేరుకుంది. అయితే అనంతపురం తెప్పోత్సవంలో వీలు కోసం ఆదిత్యుని హంస వాహనాన్ని ఇష్టానుసారంగా మార్చేసి, ఫ్రేమింగ్ మార్చేయడంతో ఇప్పుడు ఆదిత్యుని వాహనం తీరు మారిపోయింది. ఎక్కడికక్కడ బోల్టుల సిస్టమ్ పాడైపోయింది. దీంతో చేసేదేమీ లేక వెల్డింగ్లతో లోపాలను కప్పేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వాహన తరలింపు అధికారికంగానే జరిగిందని ఆలయ అధికారులు చెబుతుంటే హంస వాహనాన్ని దేవాదాయ శాఖ ఆర్జేసి ఉత్తర్వుల మేరకు సవ్యంగా తీసుకెళ్లి, అలాగే తిరిగి తెచ్చామని, ఇందుకుగాను విరాళంగా రూ.11,001 లను అరసవల్లి దేవాలయానికి చెల్లించామని అనంతపురం కార్యక్రమ వైదిక నిర్వాహకుడు నేతేటి భాస్కరరావు ‘సాక్షి’కి తెలిపారు. గతంలోనే.. గతంలో ఇక్కడ విధుల్లో ఉన్న లక్ష్మణరావు అనే ఉద్యోగి నిర్వాకంతోనే హంస వాహనానికి చెందిన పలు సామగ్రి మాయమైందనే ఆరోపణలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆలయంలో కొన్ని ఇనుప వస్తువులను దొంగతనంగా అమ్మకానికి తీసుకెళ్లాడన్న ఆరోపణలతో లక్ష్మణరావును ఆలయ ఈఓ శ్యామలాదేవి సస్పెండ్ చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే. అయితే ఈ ఉద్యోగి నిర్వాకంతోనే వాహన గోడౌన్ నుంచి పలు వస్తువులు, సామగ్రి మా యమయ్యాయని, దీనికి తోడు వాహన తరలింపు తర్వాత ఫ్రేమింగ్ పాడైందని, పేర్లు చెప్పడం ఇష్టం లేని పలువురు ఆలయ ఉద్యోగులు తెలిపారు. వాహనం అతుకులతో నెట్టుకురావడంతో గతంలోలాగా ఎక్కువమందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం నాటి తెప్పోత్సవం విజయవంతంగా నిర్వహిస్తామని, తెప్ప వినియోగంలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సంబంధిత ఆలయ ఉద్యోగులు ‘సాక్షి’కి తెలిపారు. -
నేత్రపర్వం.. నరసన్న తెప్పోత్సవం
హంస వాహనంపై దేవేరులతో స్వామివారి విహారం అంతర్వేది(సఖినేటిపల్లి) : శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా చివరిరోజు శనివారం స్థానిక మంచినీటి చెరువులో హంస వాహనంపై శ్రీస్వామి, అమ్మవార్ల తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. అంతకుముందు ఆలయం వద్ద నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పక వాహనంపై ఊరేగింపుగా చెరువు వద్దకు అర్చకులు, భక్తులు తీసుకువచ్చారు. తెప్పోత్సవానికి ముందు ఆలయ ప్రధాన అర్చకుడు కిరణ్, మాజీ ప్రధాన అర్చకుడు బుచ్చిబాబు చెరువు వద్ద గంగపూజ నిర్వహించారు. పుష్పకవాహనంపై కొలువుదీరిన స్వామిని వేదమంత్రాలతో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు, భక్తుల గోవింద నామస్మరణలతో తెప్పపైకి అధిరోహింపజేశారు. ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ఉత్సవ సేవా కమిటీ సభ్యులు కొబ్బరి కాయలు కొట్టి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. దేవస్థానం ఏర్పాటు చేసిన బాణాసంచా కాల్పులు భక్తులను అలరించాయి. వెన్నెల, దీప కాంతుల నడుమ భీమేశ్వరుని తెప్పోత్సవం ద్రాక్షారామ (రామచంద్రపురం): శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఆలయ ప్రాంగణలో గల సప్తగోదావరి నదిలో స్వామి వారి తెప్పోత్సవం కనుల పండువగా నిర్వహించారు. దివి నుంచి చంద్రుని పున్నమి వెన్నెల... భువి నుంచి రంగు రంగుల విద్యుత్‌దీప కాంతుల నడుమ సప్తగోదావరిలో స్వామివారి తెప్పోత్సవాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ప్రత్యేకంగా అలకరించిన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి తోడ్కొని వచ్చి విద్యుత్ దీపాలతో ఆలకరించిన హంసవానంలో ఉంచి పూజలు నిర్వహించారు. మూడు సార్లు నదిలో తెప్పోత్సవం జరిపారు. ఈఓ పెండ్యాల వెంకటచలపతిరావు, వేగాయమ్మపేట జమీందారు వాడ్రేవు సుందర రత్నాకర్, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పంపా సరోవరమే... పాలసంద్రమై
కనుల పండువగా సాగిన సత్యదేవుని తెప్పోత్సవం అమ్మవారితో కలసి హంసవాహనంపై స్వామివారి జలవిహారం తిలకించి పులకించిన భక్తజనం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినవేళ పంపా సరోవరం పాలసంద్రంగా శోభిల్లింది. దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడైన అన్నవరం సత్యదేవుడు.. పంపా జలశయంలో హంసవాహనంపై విహరించిన తరుణాన.. ఆ సంరంభాన్ని వీక్షించిన భక్తకోటి తన్మయత్వం చెందింది. పంపా జలాశయమే పాలసంద్రమై.. హంసవాహనమే శేషశయ్య కాగా.. సాక్షాత్తూ ఆ లక్ష్మీనారాయణులుగా అమ్మవారు, సత్యదేవుడు భక్తులకు దర్శనమిచ్చారు. - అన్నవరం పంపా సరోవరపుటలలు.. సోమవారం రాత్రి పులకించిపోయూరుు. కారణం- శీతల పవనాలు తమను అల్లనమెల్లన తాకుతున్నందుకు కాదు..అనంతలక్ష్మీ సత్యవతీదేవితో కలిసి సత్యదేవుడు విహరించే హంసవాహనానికి తాము బోయూలైనందుకు! నింగిలోని జాబిలి మోము.. పున్నమి రెండు రోజులుందనగానే నిండుగా వెలిగిపోరుుంది. కారణం.. స్వామి విహారాన్ని తిలకించినందుకు! క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా సత్యదేవుని తెప్పోత్సవం పంపా సరోవరంలో నయనమనోహరంగా జరిగింది. వేలాదిమంది భక్తులు ఈ వేడుకను వీక్షించి, పరవశులయ్యారు. కళ్లు మిరుమిట్లుగొలిపే బాణసంచా కాల్పులు, రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణతో దేదీప్యమానంగా ప్రకాశించిన పంపా తీరంలో రత్నగిరివాసుని తెప్పోత్సవం సోమవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. రత్నగిరి నుంచి సత్యదేవుడు, అమ్మవార్లను సాయంత్రం 5.30 గంటలకు మేళతాళాల నడుమ ఊరేగింపుగా పంపా నదీ తీరంలోని వేదిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడ సర్వాంగ సుందరంగా అలంకరించిన సింహాసనంపై స్వామి అమ్మవార్లను ప్రతిష్ఠించిన పండితులు.. క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు చతుర్వేద స్వస్థి, ఆశీర్వచనం అందజేశారు. నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలను నివేదించారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనపాఠి, గొర్తి సుబ్రహ్మణ్య ఘనపాఠి, చిట్టిశివ ఘనపాఠి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, అర్చకులు కోట శ్రీను, వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, ఛామరి కన్నబాబు, పాలంకి పెద పట్టాభి తదితరులు నిర్వహించారు. పూజల అనంతరం స్వామి, అమ్మవార్లను పంపా నదిలో హంసవాహనంగా తీర్చిదిద్దిన తెప్పమీదకు పండితుల మంత్రోచ్చారణ మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు. తెప్పమీద ప్రత్యేక మండపంలో స్వామి, అమ్మవార్లను ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం రాత్రి 7.15 గంటలకు తెప్పోత్సవం ప్రారంభమైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్పుల నడుమ.. స్వామి, అమ్మవారు ముచ్చటగా మూడుసార్లు పంపా నదిలో హంసవాహనంపై విహరించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఎంపీ తోట నరసింహం, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, తుని మార్కెట్ యార్డ చైర్మన్ యనమల కృష్ణుడు, పర్వత రాజబాబు తదితరులు తెప్పపైకి ఎక్కి స్వామి, అమ్మవార్లతో కలిసి విహరించారు. తెప్పోత్సవ ఏర్పాట్లను దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు పర్యవేక్షించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. తెప్పోత్సవానికి పెద్దాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులతో విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను, తుని అగ్నిమాపక శకటాన్ని కూడా అందుబాటులో ఉంచారు. ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రత్తిపాడు సీఐ సత్యనారాయణ, అన్నవరం ఎస్సై జగన్మోహన్ బందోబస్తును పర్యవేక్షించారు. ఉత్సవాన్ని తిలకించడానికి వేలాదిగా భక్తులు రావడంతో పంపా తీరం, ఘాట్‌రోడ్ చాలని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఘాట్ రోడ్డు రెండో మలుపు వద్ద నుంచి కూడా పలువురు ఉత్సవాన్ని తిలకించారు. ఇదేం ఆనవాయితీ సత్యదేవా? తెప్పోత్సవం ప్రారంభమైన తరువాత ప్రముఖులు ప్రత్యేక బోటులో వచ్చి నది మధ్యలో తెప్పలోకి ఎక్కడం ఓ ఆనవాయితీగా మారినట్టుంది. గత ఏడాది మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు ఇలా చేయడం వివాదస్పదం కాగా.. ఈసారి ఆ వంతు ఎంపీ తోట నరసింహం తదితరులదైంది. రాత్రి 7.15 గంటలకు తెప్పోత్సవం ప్రారంభం కాగా, అప్పటికి ఎంపీ రాలేదు. తెప్ప ఒక రౌండ్ పూర్తి చేసేసరికి 7.40 గంటలైంది. ఆ సమయానికి అనుచరులతో వచ్చిన తోట నది మధ్య ఉన్న తెప్ప వద్దకు బోటుపై చేరుకున్నారు. కొంతసేపటికి మరో బోటులో తుని మార్కెట్ యార్డు చైర్మన్ యనమల కృష్ణుడు కూడా వచ్చి తెప్ప ఎక్కారు. తెప్పను మధ్యలో ఆపి ప్రముఖులను ఎక్కించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.