third season
-
షూటింగ్లో పాల్గొనడం సంతోషం
‘‘ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ‘ఆర్య 3’ షూటింగ్ కోసం జైపూర్‌కు వచ్చాను. తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు నటి సుష్మితాసేన్. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన సుష్మితాసేన్కు ఓ మేజర్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి షూటింగ్స్‌కు కాస్త దూరంగా ఉంటున్న ఆమె ఇప్పుడు కోలుకుని షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘ఆర్య’ వెబ్ సిరీస్‌లోని మూడో సీజన్ కోసం సుష్మితాసేన్ ప్రస్తుతం జైపూర్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. సుష్మితాసేన్ టైటిల్ రోల్ చేస్తున్న ‘ఆర్య 3’ వెబ్ సిరీస్‌కు రామ్‌మద్వానీ, సందీప్ మోది దర్శకత్వం వహిస్తున్నారు. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ రిలీజ్ డేట్‌పై త్వరలో ఓ స్పష్టత రానుంది. ఇక సుష్మితాసేన్ ‘తాలి’ అనే మరో వెబ్‌సిరీస్‌లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో తన పాత్ర డబ్బింగ్‌ని గత నెలలో పూర్తి చేశారామె. -
సమయం వచ్చేసింది... సాక్షి క్రికెట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీకి ఎంట్రీల ఆహ్వానం
మీకు క్రికెట్ అంటే ప్రాణమా? ప్రతిభ ఉన్నా సత్తా చాటుకోవడానికి సరైన వేదిక కోసం వేచి చూస్తున్నారా? అయితే ఎందుకు ఆలస్యం... సమయం వచ్చేసింది... బ్యాట్ పట్టుకోండి... బంతితో చెలరేగిపోండి... మీ కలలను నిజం చేసుకోండి... ప్రస్తుతం మీరు చేయాల్సిందల్లా ... ముందుగా ఎంట్రీలు పంపించడం... ఆ తర్వాత మైదానంలోకి దిగడమే! ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ఔత్సాహిక క్రికెటర్లకు సువర్ణావకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో డిసెంబర్ చివరి వారంలో సాక్షి క్రికెట్ ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) మూడో సీజన్ మొదలుకానుంది. ఎస్పీఎల్ రెండో సీజన్లో ఆంధ్రప్రదేశ్ సీనియర్ విభాగంలో శ్రీ సాయిబాబా నేషనల్ డిగ్రీ కాలేజీ (అనంతపురం), జూనియర్ విభాగంలో శాతవాహన జూనియర్ కాలేజీ (శ్రీకాకుళం) చాంపియన్స్‌గా నిలిచాయి. తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ సీనియర్ విభాగంలో భవన్స్ డిగ్రీ కాలేజీ (సైనిక్‌పురి), జూనియర్ విభాగంలో భవాన్స్ శ్రీ ఆరంబిందో జూనియర్ కాలేజీ (సైనిక్‌పురి), నార్త్ తెలంగాణ రీజియన్ సీనియర్ విభాగంలో వాగ్దేవి డిగ్రీ కాలేజీ (మంచిర్యాల), ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజీ (మంచిర్యాల), సౌత్ తెలంగాణ రీజియన్ సీనియర్ విభాగంలో మాస్టర్జీ పీజీ కాలేజీ (హనుమకొండ) జూనియర్ విభాగంలో హార్వెస్ట్ జూనియర్ కాలేజీ (ఖమ్మం) టైటిల్స్ నెగ్గాయి. టోర్నీ ఫార్మాట్... ముందుగా జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను 10 ఓవర్లపాటు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో విజేతగా నిలిచిన జట్లు ప్రాంతీయ స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లను 20 ఓవర్లపాటు నిర్వహిస్తారు. ప్రాంతీయ స్థాయి టోర్నీ విజేతలు రాష్ట్ర స్థాయిలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టైటిల్ కోసం తలపడతాయి. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపాదికగా ఎంట్రీలు స్వీకరిస్తారు. ఎంట్రీ ఫీజు... ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే జట్లు రూ. 1,500 ఎంట్రీ ఫీజుగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్ పద్ధతిలోనూ చెల్లించవచ్చు. వివరాలకు సాక్షి జిల్లా యూనిట్ కార్యాలయంలో సంప్రదించాలి. www.arenaone.in వెబ్సైట్లోనూ వివరాలు లభిస్తాయి. ఎంట్రీలను డిసెంబర్ 10వ తేదీలోపు పంపించాలి. ఏ ఏ విభాగాల్లో... సాక్షి ప్రీమియర్ లీగ్‌ను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అండర్–19 జూనియర్ స్థాయిలో (1–12–2002 తర్వాత జన్మించి ఉండాలి)... అండర్–25 సీనియర్ స్థాయిలో (1–12–1996 తర్వాత జన్మించి ఉండాలి) వేర్వేరుగా నిర్వహిస్తారు. జూనియర్ స్థాయిలో ఆడేందుకు జూనియర్ కాలేజీ జట్లకు, సీబీఎస్ఈ స్కూల్ (ప్లస్ 11,12) జట్లకు, ఐటీఐ, పాలిటెక్నిక్ జట్లకు అర్హత ఉంది. సీనియర్ స్థాయిలో ఆడేందుకు డిగ్రీ, పీజీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీ జట్లకు అవకాశం కల్పిస్తారు. ఎన్ని జట్లకు అవకాశం... ఒక్కో కాలేజీ నుంచి గరిష్టంగా రెండు జట్లను పంపించే వెసులుబాటు ఉంది. రెండు జట్లు కూడా వేర్వేరుగా ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఒక జట్టులో ఆడే ఆటగాడు మరో జట్టుకు ఆడకూడదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం.... www.arenaone.in వెబ్సైట్లో లాగిన్ కావాలి. మ్యాచ్‌లు ఆడే సమయంలో ఆటగాళ్లు వయసు ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. మ్యాచ్ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్) చూపించాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్‌గ్లౌవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూస్ ధరించాలి. గమనిక: అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం. ► తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలను మూడు రీజియన్లుగా విభజించారు. ► రీజియన్–1లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ ఉన్నాయి. ► రీజియన్–2లో వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉన్నాయి. ∙ రీజియన్–3లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉన్నాయి. ► ఒక్కో జోన్ నుంచి విజేత జట్టు రాష్ట్రస్థాయి టోర్నీకి అర్హత సాధిస్తుంది. ఇతర వివరాలకు నిర్వాహకులను సంప్రదించాల్సిన ఫోన్‌నంబర్లు (తెలంగాణ రీజియన్) 99120 35299 (హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్) 950 551 4424, 96660 13544 (వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్) -
ఏసెస్‌తో స్లామర్స్ అమీతుమీ
ఐపీటీఎల్–2016 సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) మూడో సీజన్ చాంపియన్ ఎవరో నేడు తేలనుంది. ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ఫైనల్లో మాజీ చాంపియన్ ఇండియన్ ఏసెస్‌తో డిఫెండింగ్ చాంపియన్ సింగపూర్ స్లామర్స్ అమీతుమీ తేల్చుకుంటుంది. శనివారం లీగ్ దశ పోటీలు ముగిశాక ఏసెస్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో, సింగపూర్ స్లామర్స్ 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాయి. చివరి రౌండ్లో ఇండియన్ ఏసెస్ 20–24తో యూఏఈ రాయల్స్ చేతిలో ఓడిపోగా... సింగపూర్ స్లామర్స్ 30–20తో జపాన్ వారియర్స్‌పై గెలిచింది. రాయల్స్‌తో జరిగిన పోటీలో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–సానియా మీర్జా (ఏసెస్) ద్వయం 3–6తో నెస్టర్–అనా ఇవనోవిచ్ జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో ఫిలిప్పోసిస్ (ఏసెస్) 2–6తో జొహాన్సన్ చేతిలో ఓటమి చెందగా... మహిళల సింగిల్స్‌లో ఫ్లిప్కెన్స్ (ఏసెస్) 6–3తో ఇవనోవిచ్‌పై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న–ఇవాన్ డోడిగ్ (ఏసెస్) జోడీ 6–3తో క్యూవాస్–నెస్టర్ జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో డోడిగ్ (ఏసెస్) 3–6తో బెర్డిచ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. -
కబడ్డీ... కబడ్డీ...
నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్ సాక్షి, విశాఖపట్నం: సాగరతీరంలో మరో క్రీడా సంరంభానికి రంగం సిద్ధమైంది. ప్రొ కబడ్డీ లీగ్ మూడో సీజన్ నేడు విశాఖపట్నంలో ప్రారంభం కాబోతోంది. మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్న ఈ లీగ్‌లో 60 మ్యాచ్‌లు జరుగుతాయి. న్యూఢిల్లీలో మార్చి 5న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. శనివారం జరిగే లీగ్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబాతో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. శనివారమే జరిగే రెండో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్ తలపడతాయి. జైపూర్, పుణే, పట్నా, బెంగాల్ లీగ్‌లో బరిలోకి దిగుతున్న మిగిలిన నాలుగు జట్లు. విశాఖపట్నంలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 2 వరకు పోటీలు జరుగుతాయి. ఈ నాలుగు రోజులూ ప్రతి రోజూ తెలుగు టైటాన్స్ మ్యాచ్ ఉంటుంది. ప్రొ కబడ్డీ లీగ్ తొలి సీజన్లో వైజాగ్‌లో మ్యాచ్‌లు జరగ్గా... రెండో సీజన్లో హైదరాబాద్‌లో పోటీలు జరిగాయి. మూడో సీజన్ కూడా షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో జరగాల్సి ఉన్నా... జీహెచ్ఎంసీ ఎన్నికల కారణంగా వైజాగ్‌కు వేదికను మార్చారు. తెలుగు టైటాన్స్ ఈసారైనా... ప్రొ కబడ్డీ తొలి సీజన్లో ఐదో స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్... రెండో సీజన్లో లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచినా సెమీస్‌లో ఓడిపోయింది. ఈసారైనా టైటిల్ సాధించాలని కసితో ఉన్న ఈ జట్టుకు మరోసారి స్టార్ ఆటగాడు రాహుల్ చౌదురి కీలకం. సుఖేవ్ హెగ్డేతో పాటు ఇరాన్‌కు చెందిన మెరాజ్ షేక్ కూడా రాణిస్తే జట్టు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. రా. గం. 8.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
వైజాగ్ లో ప్రొ కబడ్డీ
♦ 30న లీగ్ ప్రారంభం ♦ తొలి మ్యాచ్‌లో టైటాన్స్, ♦ యు ముంబా ఢీ న్యూఢిల్లీ: వరుసగా రెండేళ్ల పాటు అభిమానులను అలరించిన ప్రొ కబడ్డీ లీగ్‌కు మరోసారి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 30 నుంచి ఈ లీగ్ మూడో సీజన్ ప్రారంభం కానుంది. ఇకనుంచి కబడ్డీ లీగ్ ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ లీగ్ 30న హైదరాబాద్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో స్టేడియం అందుబాటులో లేకపోవడంతో వేదికను విశాఖపట్నంకు మార్చారు. ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబాతో తెలుగు టైటాన్స్ జట్టు తలపడుతుంది. 2014 తొలి సీజన్లోనూ వైజాగ్‌లోనే మ్యాచ్‌లు జరిగాయి. మార్చి 5న ఢిల్లీలో జరిగే ఫైనల్‌తో సీజన్ ముగుస్తుంది. మొత్తం ఎనిమిది జట్లు తలపడుతున్న ఈ టోర్నీలో 26 మంది విదేశీ ఆటగాళ్లు కూడా బరిలోకి దిగుతున్నారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వివరాలను ప్రకటించారు. జైపూర్ జట్టు యజమాని అభిషేక్ బచ్చన్‌తో పాటు ఆటగాళ్లు నవనీత్, అనూప్, కాశీలింగ ఇందులో పాల్గొన్నారు. ఈసారి టైటిల్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నట్టు అభిషేక్ బచ్చన్ తెలిపారు.