thiruchanur
-
ఆధ్యాత్మిక సేవలో స్టార్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఆ సిరీస్ తర్వాత ఎలాంటి సినిమాకు సామ్ సైన్ చేయలేదు. ఇదిలా ఉంటే.. గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా గతేడాది విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇటీవల కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ప్రతి రోజు తన ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తోంది. తాజాగా సమంత ఆధ్యాత్మిక బాట పట్టారు. తిరుపతికి వెళ్లిన సామ్ శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఇటీవల ఆమె విజయ్ సరసన మరో చిత్రంలో నటించనుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. #Samantha in Tirumala Tirupati Devasthanam! 🥹♥️🧿#Samantha #SamanthaRuthPrabhu #SamFanClub #TeamSamantha pic.twitter.com/9zI8EkTMio — 𝐓𝐞𝐚𝐦 𝐒𝐚𝐦𝐚𝐧𝐭𝐡𝐚™ (@TeamSamantha__) March 4, 2024 Thalaivi @Samanthaprabhu2 arrived in tirumala today afternoon. Had darshan of Lord Venkateswara and took blessings! 🥹🙏#Samantha #SamanthaRuthPrabhu #SamFanClub #TeamSamantha pic.twitter.com/afgyj5vrLF — 𝐓𝐞𝐚𝐦 𝐒𝐚𝐦𝐚𝐧𝐭𝐡𝐚™ (@TeamSamantha__) March 4, 2024 -
కలెక్టరేట్ ఎక్కడనే నిర్ణయం ప్రభుత్వానిదే
సాక్షి, ఢిల్లీ: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న నిర్ణయం అభివృద్ధి అడుగుగానే భావించాలని అభిప్రాయపడింది. చిత్తూరు జిల్లా తిరుచానూరులోని పద్మావతి నిలయాన్ని బాలాజీ జిల్లా కలెక్టరేట్‌గా మార్చాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆధ్యాత్మిక భవనాన్ని కలెక్టరేట్‌కు ఇవ్వడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషనర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు తెలిపారు. ‘కలెక్టర్ ఎక్కడ కూర్చోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోబోం. కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలి కదా. రాష్ట్ర విభజన అయిందంటే కొత్త రాష్ట్రంలో హైకోర్టు ఎక్కడ పెట్టాలి? సెక్రటేరియట్ ఎక్కడ నిర్మించాలి అని చూస్తాం కదా? ఆ ప్రాంతంలో ప్రజల నివాసానికి అనుగుణంగా ఉండాలి కదా? దీనికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలి. పద్మావతి నిలయాన్ని ప్రభుత్వం అద్దె ప్రాతిపదికనే తీసుకుంది. ఉచితంగా ఏం తీసుకోలేదు కదా? కలెక్టర్ కార్యాలయం వచ్చిందంటే ఆ ప్రాంతం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. కలెక్టర్ ఎక్కడ కూర్చోవాలి.. చెట్టు కింద కూర్చొని పనిచేయి అని మేం చెప్పలేం కదా. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలివేయాలి. ప్రజా ప్రయోజనాల అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పులో జోక్యం చేసుకోం. ఈ పిటిషన్ కొట్టివేస్తున్నాం..’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. చదవండి: కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. అవతరణకు ముహూర్తం ఖరారు -
ఆగస్టు 12న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం
ఆగస్టు 12న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం – ఈ నెల 27నుంచి ఈ–దర్శన్ కౌంటర్లో టికెట్లు తిరుచానూరు: తిరుచానూరులో కొలువైన శ్రీవారి పట్టపురాణి శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 12వ తేదీన వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరగనుంది. నిండు ముల్తైదువైన అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం నోచుకుంటే భక్తులకు అషై్టశ్వరాలు, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తారని నమ్మకం. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందురోజు నిర్వహించే వరలక్ష్మీ వ్రతాన్ని అమ్మవారి సన్నిధిలో చేయడానికి దంపతులు ఆసక్తి చూపుతారు. వ్రతం నోచుకునే భక్తుల కోసం ఈనెల 27వ తేదీ నుంచి ఈ–దర్శన్ కౌంటర్ ద్వారా వరలక్ష్మీ వ్రతం టికెట్లను టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. దేశవ్యాప్తంగా 200 టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతుంది. వ్రతంలో పాల్గొనదలచిన దంపతులు గుర్తింపు కార్డుతో పాటు రూ.500 చెల్లించి టికెట్లు కొనుగోలు చేయాలి. వ్రతంలో పాల్గొన్న భక్తులకు అంగవస్త్రం, రవిక, లడ్డూ, వడలను అమ్మవారి ప్రసాదంగా అందించనున్నారు. అదే రోజు సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకు ఆరోజు అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవలను రద్దుచేశారు.