Thiruchanuru
-
తిరుచానూరు : శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
-
పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ చైర్మన్
సాక్షి, తిరుపతి: నవంబరు 23 నుంచి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలు నేటితో ముగియనుండగా.. ఆదివారం జరిగిన పంచమి తీర్థం వేడుకల్లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయన్నారు. నవంబరు 23న ప్రారంభమైన కార్తీక బ్రహోత్సవాలు డిసెంబరు 1న చక్రస్నానంతో ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమలకు వచ్చినట్లే తిరుచానూరుకు కూడా లక్షల మంది భక్తులు వచ్చారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు కల్పించామని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అమ్మవారి ఆశిస్సులు ఉండాలని కోరుకున్నట్లు వైవి సుబ్బారెడ్డి, సతీమణి స్వర్ణలత తెలిపారు. అమ్మవారికి శ్రీవారి సారె: బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తీసుకొచ్చి పద్మావతి అమ్మవారికి సమర్పించారు. పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాభరణాలతో కూడిన సారె తిరుమల మాడ వీధుల్లో ఉదయం 4.30 గంటలకు ఏనుగులపై ఊరేగించారు. ఉదయం10 గంటలకు పుష్కరిణిలోని పంచమితీర్థం మండపంలో స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 12.10కి కుంభ లగ్నంలో పంచమితీర్థం చక్రస్నానం నిర్వహించారు. పట్టు వస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం వేడుకల్లో ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం కలగటం తన అదృష్టం అని పేర్కొన్నారు. ఇందుకు సీఎం జగన్ కు రుణ పడి ఉంటానని తెలిపారు. సీఎం జగన్ వల్లే నాకు ఈ భాగ్యం కలిగిందని, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని కోరుకొన్నట్లు వెల్లడించారు. -
అమ్మవారి సేవలో కొత్త గవర్నర్
సాక్షి, తిరుచానూరు(భాకరాపేట): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం అమ్మవారి దర్శనానికి వచ్చిన గవర్నర్ దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈఓ అని ల్‌కుమార్ తిరుపతి జేఈఓ పి.బసంత్‌కుమార్, సీవీ ఎస్ఓ గోపీనాథ్‌జెట్టి, తిరుపతి ఆరీఓ కనకనరసారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈఓ ఝాన్సీరాణి, రూరల్ తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఆలయ అర్చక బృందం స్వాగతం పలికారు. తొలుత ఆలయంలో ధ్వజ స్తం భానికి మొక్కుకొని, కుంకుమార్చన సేవలో గవ ర్న ర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదానలను అందజేశారు. బాధ్యతతో పనిచేస్తా : గవర్నర్ శ్రీపద్మావతి అమ్మవారి దర్శనానంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ శ్రీవారి, అమ్మవారి ఆశీస్సులతో తనకు ఈ పదవి లభిం చిందని, బాధ్యతతో విధులు నిర్వహిస్తానన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. విమానాశ్రయంలో సాదర స్వాగతం రేణిగుంట: రాష్ట్ర నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు మంగళవారం రేణిగుంట విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. ఆయ న తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం ఉద యం 11.40గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎన్.భరత్‌గుప్తా, అర్బన్ ఎస్పీ అన్బురాజన్, తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీషా, టీటీడీ జేఈఓ బసంత్‌కుమార్, మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి, తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి, తిరుపతి డీఎఫ్ఓ సునీల్‌కుమార్‌రెడ్డి, సెట్విన్ సీఈఓ లక్ష్మి, తహసీల్దార్ విజయసింహారెడ్డి, డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అంజూయాదవ్ తదితరులు పుష్పగుచ్ఛం అం దించి స్వాగతం పలికారు. సాయంత్రం వీడ్కోలు తిరుమల శ్రీవారి దర్శనానంతరం గవర్నర్ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఆయనకు జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తా, డీఐజీ క్రాంతిరాణా టాటా, పలువురు జిల్లా అధికారులు వీడ్కోలు పలికారు. -
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి కోవింద్
-
తిరుమలలో రాష్ట్రపతి కోవింద్
తిరుమల/రేణిగుంట(చిత్తూరు జిల్లా)/సాక్షి, అమరావతి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. సతీమణి సవితా కోవింద్‌తో కలసి తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. శనివారం రాత్రికి రాష్ట్రపతి తిరుమలలోనే బస చేశారు. ఆదివారం ఉదయం వరాహస్వామి దర్శనానంతరం శ్రీవేంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. రాష్ట్రపతికి ఇస్తికఫాల్ మర్యాదలతో శ్రీవారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీవారి దర్శనానంతరం రాష్ట్రపతి పద్మావతి అతిథిగృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరించాక తిరుగు ప్రయాణమవుతారు. రేణిగుంటలో ఘన స్వాగతం.. : అంతకుముందు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి శనివారం సాయంత్రం 5.10 గంటలకు చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నవాజ్‌బాష, జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, డీసీసీబీ చైర్మన్ సిద్దాగుంట సుధాకర్‌రెడ్డి, చిత్తూరు కలెక్టర్ నారాయణభరత్‌గుప్త, డీఐజీ కాంతిరాణ టాటా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక వాహనశ్రేణిలో రోడ్డు మార్గాన తిరుచానూరుకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తదుపరి తిరుపతిలోని కపిలేశ్వరస్వామిని దర్శించుకుని తిరుమలకు వెళ్లారు. శనివారం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో గవర్నర్ దంపతులు రేణిగుంట విమానాశ్రయం లాంజ్‌లో గవర్నర్ నరసింహన్‌తో ముచ్చటిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. -
టీటీడీ అధికారి ఇంట్లో ముగిసిన ఏసీబీ దర్యాప్తు
నిందితుడిని నెల్లూరు కోర్టుకు హాజరు తిరుపతిక్రైం : టీటీడీ డెప్యూటీ ఈవో భూపతి రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో దర్యాప్తు మంగళవారం ముగిసిందని ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. భూపతిరెడ్డి ఆస్తులు విలువ ఎంతనేది అంచనాకు రాలేక పోతున్నామన్నారు. ఇప్పటికే ఆయన బంధుమిత్రులకు సంబంధించిన 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. అయితే 2015 డిసెంబర్లో రూ.1.8 కోట్ల విలువ చేసే ఒక స్థలానికి రూ.65 లక్షలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నారని, అలాగే ఆయనకు తిరుచానూరు, రాఘవేంద్రనగర్ గ్రామీణ బ్యాంకుల్లో రెండు లాకర్లు ఉన్నాయని గుర్తించినట్లు చెప్పారు. ఆ లాకర్లను బుధవారం తెరుస్తామని, వాటిల్లో మరింత ఆస్తుల సమాచారం, ఇతరత్రా లభించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఇప్పటికే 12 ఖాతాలు ఉన్నట్లు గుర్తించామని, వాటిలో ఎంత మొత్తం నగదు వుందనేది బుధవారం నాటికి పూర్తిగా తెలుస్తుందన్నారు. అయితే ఐసీసీఐ బ్యాంకు ఖాతాలో మాత్రం రూ.37లక్షలు ఉన్నట్టు తేలిందన్నారు. ఇంకా పోస్టల్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో దర్యాప్తు చేస్తున్నామన్నారు. భూపతిరెడ్డిని నెల్లూరు కోర్టులో హాజరు పరచామన్నారు.