భారత్‌లో స్వచ్ఛమైన ప్రభుత్వం రావాలి: భారతీయ అమెరికన్లు
వాషింగ్టన్: అమెరికాలోని దాదాపు 30 లక్షల మంది భారతీయ అమెరికన్లలో అతికొద్దిమందికి మాత్రమే భారత్‌లో ఓటు హక్కు ఉంది. అయితే ఆ వర్గానికి చెందిన వారిలో ప్రతి ఒక్కరూ భారత్‌లో లోక్‌సభ ఎన్నికల తర్వాత స్వచ్ఛమైన ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షిస్తున్నారు. ‘భారత్ ప్రపంచ వేదికపై కనిపించడం లేదు. కొత్త ఆలోచనలను స్వీకరించి దేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపే ప్రభుత్వం రావాలి’ అని భారత సంతతి ప్రజల అంతర్జాతీయ సంస్థ(గోపియో) వ్యవస్థాపక అధ్యక్షుడు థామస్ అబ్రహామ్ అన్నారు. కొత్త ప్రభుత్వం అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలను బలోపేతం చేసేదిగా ఉండాలన్నారు.