చంద్రబాబువి అన్నీ ఆర్భాటాలే
పుట్లూరు : ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డికే దక్కుతుందని జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తోపుదుర్తి కవి త అన్నారు. శుక్రవారం మండలంలోని కడవకల్లులో ఆమె సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతితో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీలను అమలు చేయకుండా కేవలం ఆర్భాటాలు చేస్తూ పబ్బం గడుపుతున్నార ని తెలిపారు.
రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని ఒకవైపు చెబుతూ మరో వైపు గోదావరి పుష్కరాలకు రూ.1400 కోట్లు, కృష్ణా పుష్కరాలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రజలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే కేవలం రూ.1000కోట్లు ఖర్చు పెట్టలేకపోతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ జంగం నల్లమ్మ పాల్గొన్నారు.